సంఘ సభ్యత్వం అంటే ఏమిటి?

 సంఘ సభ్యత్వం అంటే ఏమిటి?

షేర్ చెయ్యండి:

సంఘ సభ్యత్వం అంటే క్రీస్తు రాజ్యములో తమ పౌరసత్వమును ప్రకటించడం (లేదా వెల్లడి చేయడం). ఇది మనకు ఇవ్వబడిన పాస్ పోర్ట్ లాంటిది. అంతే కాకుండా, క్రీస్తు రాజ్యము యొక్క పత్రికా విలేఖరుల సమావేశపు గదిలో బహిరంగంగా ఇచ్చిన ఒక ప్రకటనలాంటిది కూడా. సంఘ సభ్యత్వం పొందుకున్న ప్రతి వ్యక్తి ఒక అధికారిగా, ధృవీకరించబడిన వ్యక్తిగా, అధికార సభ్యత్వం పొందిన వ్యక్తిగా, యేసుకు నమ్మకమైన ప్రతినిధిగా ప్రకటించుటయే.

మరింత స్పష్టంగా చెప్పాలంటే, సంఘ సభ్యత్వం అంటే సంఘ ఆమోదం ద్వారా అర్హత పొంది, సంఘ సంరక్షణలో తమ క్రైస్తవ శిష్యత్వపు జీవితాన్ని జీవిస్తూ పర్యవేక్షించబడే క్రైస్తవునికి మరియు స్థానిక సంఘానికి మధ్య ఉండే అధికారిక సంబంధం.

సంఘ సభ్యత్వంలో మూడు అంశాలు పొందుపరచబడ్డాయి, వాటిని గమనించండి:

1.  సంఘములో చేర్చబడే ప్రతి ఒక్కరి విశ్వాసమును, బాప్తిస్మమును వాక్యానుసారంగా నమ్మదగినవే  అని సంఘమంతా అధికారికంగా ఆమోదిస్తుంది;

2. ప్రతి ఒక్కరి వ్యక్తిగత శిష్యత్వాన్ని పర్యవేక్షణ చేయడానికి  హామీనిస్తుంది;

3. ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా తమ శిష్యత్వాన్ని సంఘానికి మరియు సంఘ నాయకుల అధికారానికి లోబడేలా చేస్తుంది.

సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరితో సంఘమంతా, “మేము మీ విశ్వాసమును, మీరు పొందిన బాప్తిస్మమును, అలాగే క్రీస్తులో మీ శిష్యత్వమును ప్రామాణికమైనవిగా గుర్తిస్తున్నాం. అందుచేత, మీరు క్రీస్తుకు చెందినవారని సంఘము ఎదుట మిమల్ని మేము గుర్తిస్తూ, మిమల్ని బహిరంగంగా ఆమోదిస్తూ, మా సహవాసపు పర్యవేక్షణలో మిమ్మల్ని చేర్చుకుంటున్నాము.” అని చెబుతుంది. ముఖ్యంగా, సంఘములోనికి చేర్చబడిన ప్రతి విశ్వాసి వ్యక్తిగతంగా సంఘముతో, “మిమ్మల్ని నమ్మకమైన, సువార్త-కేంద్రీత సంఘంగా నేను గుర్తించాను. నన్ను నేనూ, నా శిష్యత్వాన్ని మీ పర్యవేక్షణకు మరియు మీరు చూపించే ప్రేమకు అప్పగించుకుంటున్నాను” అని చెప్తారు.

ఒక్క విషయాన్ని మినహాయించి, సంఘ సభ్యత్వము కోసం ఉండే ప్రమాణాలన్నీ క్రైస్తవులుగా ఉండటానికి ఉండాల్సిన ప్రమాణాలకంటే ఎక్కువ లేదా తక్కువ కాకూడదు. క్రైస్తవుడంటేనే పశ్చాత్తాపపడి (అనగా మారుమనస్సు పొంది), క్రీస్తును నమ్మిన వ్యక్తి. అటువంటి వ్యక్తులనే సంఘాలు సంఘ సభ్యులుగా ఆమోదించాలి. ఈ ప్రమాణానికి అదనంగా చేర్చే ఒకే ఒక్క ప్రమాణం బాప్తిస్మం. క్రొత్త నిబంధన అంతా సర్వసాధారణంగా కనిపించే పద్ధతైన బాప్తిస్మాన్ని సంఘ సభ్యులు తప్పనిసరిగా తీసుకోవాలి. “మారుమనస్సు పొంది, బాప్తిస్మము పొందండి” (అపొ.కార్య. 2:38) అని యెరూషలేములో ఉన్నటువంటి గుంపుతో పేతురు చెప్పాడు. పౌలు రోమా పట్టణములోని సంఘానికి వ్రాస్తూ, రోమా సంఘ సభ్యులందరూ బాప్తిస్మము తీసుకున్నారని (రోమా 6:1-3) భావించాడు.

మరొక విధంగా చెప్పాలంటే, సంఘ సభ్యత్వం అంటే “అదనంగా కావాల్సిన అర్హతల” గురించి చెప్పేది కాదు. సంఘ సభ్యత్వం అంటే ఒక క్రైస్తవుని కోసం సంఘం, సంఘం కోసం ఒక క్రైస్తవుడు ప్రత్యేకంగా చేపట్టే బాధ్యత. సంఘ సభ్యత్వం అంటే క్రీస్తు సార్వత్రిక శరీరములో మన సభ్యత్వాన్ని “పొందుకోవడం,” “జీవించడం,” మరియు “బలమైనదిగా చేసికోవడం.” మరొక విధంగా చెప్పాలంటే, వివాహములో “నేను కట్టుబడి ఉంటాను” అని భార్యాభర్తలు ఒకరితో ఒకరు వాగ్దానము చేసుకున్నట్లే, స్థానిక సంఘము మరియు స్థానిక సంఘ సభ్యులందరు ఒకరితో ఒకరు ప్రమాణం చేస్తారు. అందుకే సంఘసభ్యత్వాన్ని ఒక “వాగ్దానముగా (నిబంధనగా)” కొంతమంది సూచిస్తుంటారు.

ఒక క్రైస్తవుడు సంఘములో చేరేందుకు నిర్ణయం తీసుకోవాలన్నది నిజమేగాని, అలా చేయడంవలన సంఘమేమి స్వచ్ఛంద సంస్థగా మార్చబడదు. ఒక క్రైస్తవుడు క్రీస్తును స్వీకరించాక, సంఘంలో సభ్యుడవ్వడం తప్ప అతనికి మరొక మార్గం లేదు.

జోనాతన్‌ లీమన్‌

జోనాతన్‌ లీమన్‌

జోనాతన్ 9మార్క్స్ పుస్తకాలని అలాగే 9మార్క్స్ జర్నల్స్ ను ఎడిట్ చేస్తారు. అతను సంఘానికి సంబంధించిన అనేక విషయాలపై పుస్తకాల రచయిత కూడా. జోనాతన్ సదరన్ సెమినరీ నుండి MDiv మరియు యూనివర్శిటీ ఆఫ్ వేల్స్ నుండి ఎక్లెసియాలజీలో Ph.D ని సంపాదించారు. అతను మేరీల్యాండ్‌లోని షెవర్లీలో తన భార్య మరియు నలుగురు కుమార్తెలతో నివసిస్తున్నాడు, అక్కడ అతను షెవర్లీ బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ గా ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...