మేము ఎవరము

సంస్కరణ అనేది రిఫార్మ్డ్ సిద్ధాంతంలోని ఇవాంజెలికల్ సంఘముల పరిచర్య.

క్రీస్తు సువార్త యొక్క రూపాంతరీకరణ శక్తిని ఇతరులతో పంచుకొనుట,
లేఖన అధికారమును ఎత్తి పట్టుకొనుట మరియు ప్రతి విషయంలో క్రీస్తు యొక్క ఆధిపత్యాన్ని హెచ్చించుట మా పరిచర్య లక్ష్యమై యున్నది.

క్రీస్తు సంఘము యొక్క ప్రాముఖ్యత మరియు దేవుని వాక్యానుసారంగా సంఘ పరిచర్య చేసే విషయంలో పెరుగుతున్న నిర్లక్ష్య ధోరణి గురించి మేము తీవ్రంగా ఆందోళన చెందుతున్నాము.

వాక్యంలో దేవునిచే నిర్ణయించబడిన ప్రమాణాలకు తగినట్లుగా సంఘమును సంస్కరించే దైవికమైన ఆశ కలిగియున్నాము.

సంఘమును ఉజ్జీవింపజేయుటకు, క్రీస్తు సువార్త యొక్క ప్రాముఖ్యతను ప్రకటించుటకు మరియు దేవుని వాక్యమునకు నమ్మకముగా ఉండుటకు ప్రయాసపడే ఈ సంస్కరణ పరిచర్యలో మాతో చేరండి.

లేఖనాలను అధ్యయనం చేయడం ద్వారా, మన జీవితాలకు మరియు సంఘాలకు దాని కాలాతీతమైన సత్యాలను అన్వయించడం ద్వారా బైబిల్ సంస్కరణను వెంబడిద్దాం.