ప్రబలంగా వ్యాపించియున్న కృప

ప్రబలంగా వ్యాపించియున్న కృప

షేర్ చెయ్యండి:

నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతును వారిలో దుఃఖించువారిని ఓదార్చుదును”. (యెషయా 57:18)

వాక్యానుసారమైన లేఖన భాగాల నుండి సిద్ధాంతాలను నేర్చుకోండి. ఆ విధంగా చేయడం ఎంతో ఉత్తమం. అది అంతరంగాన్ని ఎంతగానో పోషిస్తుంది.

ఉదాహరణకు, లేఖనాల నుండి ఎదురించలేని కృపను గురించిన సిద్ధాంతాన్ని నేర్చుకోండి. ఈ విధంగా, ఆ మాటకు మనం దేవుని కృపను ఎదిరిస్తామని కాదు అనే విషయాన్ని మీరు చూస్తారు; ఆ మాటకు అర్థం ఏంటంటే దేవుడు ప్రజలను ఎన్నుకున్నప్పుడు, ఆయన ఆ తిరుగుబాటును అధిగమించగలడు, అధిగమిస్తాడు. దేవుడు మార్పు చెందించే శక్తిని ఎవరూ ఎదిరించలేరు. 

ఉదాహరణకు, యెషయా 57:17-19 వచనాలలో దేవుడు తిరుగుబాటు చేసిన ప్రజలను దండించుట ద్వారా, తన ముఖాన్ని మరుగు చేయడం ద్వారా, ఆయన వారిని శిక్షించాడు: “వారి లోభమువలన కలిగిన దోషమునుబట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని, నేను నా ముఖము మరుగుచేసికొని కోపించితిని వారు తిరుగబడి తమకిష్టమైన మార్గమున నడచుచు వచ్చిరి” (17వ వచనం). 

అయితే, వారు పశ్చాత్తాపపడడానికి బదులుగా భక్తిలో దిగజారిపోయారు. వారు తిరగబడ్డారు: “వారు తిరుగబడి తమకిష్టమైన మార్గమున నడచుచు వచ్చిరి” (17వ వచనం). 

అందుచేత, కృప ఎదిరించబడుతుంది. వాస్తవానికి, “మీ పితరులవలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు..” అని స్తెఫెను యూదా నాయకులతో అన్నాడు (ఆపొ. కార్య 7:51). 

అప్పుడు దేవుడేమి చేయాలి? ఎదిరించినవారినందరిని పశ్చాత్తాపములోనికి, పరిపూర్ణతలోనికి తీసుకు రావడానికి ఆయన శక్తిలేనివాడా? ఆయన శక్తిలేనివాడు కాదు. యెషయా 57:18వ వచనంలో, నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతును వారిలో దుఃఖించువారిని ఓదార్చుదును” అని వ్రాయబడింది. 

అందుచేత, అవిధేయత చూపినప్పుడు, కృపను ఎదిరించి భక్తిహీనతలో ఉన్నప్పుడు, “నేను వారిని స్వస్థపరుస్తాను” అని దేవుడు చెప్తున్నాడు. ఆయన వారిని “పునరుద్ధరిస్తాడు.” “పునరుద్ధరణ” అనే పదానికి “సంపూర్ణులనుగాను లేక పరిపూర్ణులనుగాను చేయుట” అని అర్థం. ఇది షాలోమ్ లేక “సమాధానం” అనే పదానికి సంబంధించింది. ఆ సంపూర్ణత మరియు సమాధానం అనేది కృపను ఎదిరించిన భక్తిహీనులను దేవుడు ఎలా తన వైపుకు తిప్పుతాడో అనే విషయాన్ని వివరించే తరువాత వచనంలో, అంటే 19వ వచనంలో చెప్పబడింది.

“వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు దూరస్థులకును సమీపస్థులకును సమాధానము సమాధానమని (షాలోమ్, షాలోమ్ అని),’ చెప్పుట ద్వారా ఆయన ఈ కార్యమును జరిగిస్తాడు, ‘నేనే వారిని స్వస్థపరచెదనని’”  యెహోవా సెలవిచ్చుచున్నాడు (యెషయా 57:19). సమాధానం, సంపూర్ణత లేనప్పుడు దేవుడు వాటిని సృష్టిస్తాడు. ఈ విధంగానే మనం రక్షించబడతాం. ఈ విధంగానే మనం పదే పదే భక్తిహీనత నుండి వెనక్కి తీసుకురాబడతాం

దేవుని కృప మన తిరుగుబాటును జయిస్తుంది, మనము ఇంతకు ముందు ఆయనను స్తుతించని స్థితి నుండి ఆయనను స్తుతించునట్లు చేస్తుంది. ఆయన సమీపస్థులకు దూరస్థులకు షాలోం షాలోమ్ షాలోమ్ అంటే (సమాధానం, సమాధానం) తీసుకు వస్తాడు. సమీపస్థులకు దూరస్థులకు సంపూర్ణత తీసుకొస్తాడు. ఆయన ఈ పనిని “పునరుద్ధరణ” కార్యం ద్వారా జరిగిస్తాడు, అంటే తిరుగుబాటు తత్వాన్ని తీసివేసి, లోబడే తత్వాన్ని అనుగ్రహిస్తాడు

ఎదిరించలేని కృప యొక్క ముఖ్యాంశం ఏంటంటే, మనం ఆ కృపను ఎదిరించలేమని కాదు. మనం ఎదిరించగలం, మనం ఎదిరిస్తాం. ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు ఎన్నుకున్నప్పుడు, ఆయన మన తిరుగుబాటును జయించి, లోబడే తత్వాన్ని పెడతాడు. దీనిని ఆయన సృష్టిస్తాడు. “వెలుగు కలుగునుగాక!” అని ఆయన సెలవిస్తున్నాడు. ఆయన స్వస్థపరుస్తాడు. ఆయన నడిపిస్తాడు. ఆయన పునరుద్ధరిస్తాడు. ఆయన ఓదారుస్తాడు. 

అందుచేత, మనం ఆయన వైపుకు తిరిగామని మనమెప్పటికి అతిశయించకూడదు. మన తిరుగుబాటునంతటిని జయించిన ఎదురులేని ఆయన కృప కోసం మనం ప్రభువు ముందు తలలు వంచి, ఆనందంతో ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుదాం.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...