మేము నమ్మేవి 

పరిశుద్ధ లేఖనాలు
పాత మరియు క్రొత్త నిబంధన పుస్తకాలు దేవుని మాట వలన స్పూర్తి పొంది, అసలు ప్రతులలో ఎటువంటి తప్పులు లేవని మేము విశ్వసిస్తాం. ఈ స్పూర్తి, లేఖనాలలో ప్రతి భాగానికి పూర్తిగా మరియు సమానంగా వర్తిస్తుందనీ, అదేవిధంగా అవి విశ్వాసి జీవితంలో అంతిమ అధికారం కలిగి ఉంటాయని మేము విశ్వసిస్తాం. (యోహాను 5:39, 17:8, 26:2; 2 తిమోతీ 3:16-17, 2 పేతురు 1:21)

కాబట్టి, లేఖనాలకు విరుద్ధంగా ఉన్న ప్రతీ బోధని, పరిశుద్ధ బైబిల్ తో సమానపరచుకునే ప్రతీ రాతని మేము వ్యతిరేకిస్తాం.

త్రిత్వం
శాశ్వతంగా ముగ్గురు వ్యక్తులుగా ఉన్న త్రియేక దేవుణ్ణి మాత్రమే మేము నమ్ముతున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్దాత్మ ముగ్గురు ఒకే స్వభావం, ఒకే గుణలక్షణాలు, ఒకే పరిపూర్ణత కలిగి, ఆరాధనకు, విధేయతకు సమాన యోగ్యత కలిగి ఉన్నారని మేము విశ్వసిస్తాం. (మత్తయి 28:19-20, యోహాను 1:1-4)

కాబట్టి, త్రియేక దేవుణ్ణి తిరస్కరించే ప్రతీ బోధని మేము తిరస్కరిస్తాం.

యేసు క్రీస్తు – ఆయన వ్యక్తిత్వం
యేసు క్రీస్తు ఒకే సమయంలో సంపూర్ణమైన దేవునిగా, సంపూర్ణమైన మానవునిగా ఉన్నాడని మేము విశ్వసిస్తాం. ఆయన తండ్రికి నిత్యవారసుడు, పరిశుద్దాత్మ వలన బలము పొందిన వాడు, కన్య మరియకు జన్మించాడు. యేసు క్రీస్తు నిష్కళంకమైన వాడనీ, మార్పు లేని వాడనీ, సమస్తానికీ సృష్టికర్త అనీ, అన్ని విషయాలలో ఆధిపత్యం కలిగినవాడనీ మేము విశ్వసిస్తాం. (కొలస్సీ 1:16,17 , హెబ్రీ 4:15)

కాబట్టి, యేసు క్రీస్తు దైవత్వాన్నీ, మానవత్వాన్నీ, ఆయన కన్యకకు జన్మించటాన్నీ, ఆయన పాపరాహిత్యాన్నీ, ఆయన సార్వభౌమత్వాన్నీ తిరస్కరించే ప్రతి సిద్ధాంతాన్నీ మేము తిరస్కరిస్తాం.

యేసు క్రీస్తు – ఆయన పని
ప్రభువైన యేసుక్రీస్తు మన పాపాలకు ప్రత్యామ్నాయ బలిగా మరణించాడనీ, మన పాపాల కోసం పూర్తిగా ప్రాయశ్చిత్తం చెల్లించాడని, అతని శిలువ వేయబడిన శరీరం మృతులలో నుండి లేపబడిందని మరియు మన ప్రధానయాజకునిగా, న్యాయవాదిగా, మధ్యవర్తిగా తండ్రి ముందు కనిపించడానికి పరలోకానికి ఆరోహణమయ్యాడని మేము నమ్ముతున్నాం. క్రీస్తు యేసు తన సంఘం కొరకు మళ్లీ వస్తున్నాడని కూడా మేము నమ్ముతున్నాం. (1 తిమోతి 2:5; 1 పేతురు 1:18-20; 1 కొరింథీయులు 15:1-3; 1 థెస్సలొనీకయులు 4:13-18)

కాబట్టి, వీటిని తిరస్కరించే ప్రతి ఇతర నమ్మకానికి దూరంగా ఉంటాము: మన పాపాలకు యేసు క్రీస్తు యొక్క ప్రత్యామ్నాయ త్యాగం; ఆయన పూర్తి ప్రాయశ్చిత్తం మరియు సిలువపై పూర్తి చేసిన కార్యం; శారీరక మరణం మరియు పునరుత్థానం, మరియు ఆయన ఆరోహణ మరియు రెండవ రాకడ గూర్చి మేము నమ్ముతాం.

పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మ తన కార్యాన్ని నెరవేరుస్తూ, దైవ లక్షణాలు కలిగిన సంపూర్ణమైన వ్యక్తి మరియు దేవుడు అని మేము విశ్వసిస్తాం. పెంతెకోస్తు రోజున ఆయన ప్రత్యేకమైన రీతిలో ప్రపంచంలో తన నివాసాన్ని తీసుకున్నాడని, ప్రతి విశ్వాసిలో నివసిస్తున్నాడని మరియు క్రైస్తవులందరినీ ఒకే శరీరంలో, సార్వత్రికమైన సంఘంలో ఏకం చేస్తుందని మేము నమ్ముతున్నాం. ఈ కాలంలో, పరిశుద్ధాత్మ ప్రపంచంలోని చెడును అరికట్టడం, పాపంలో, నీతి మరియు తీర్పు గురించి ప్రజలను దోషులుగా నిర్ధారించడం, తన ప్రజలను నూతన పరచడం, క్రైస్తవులను అభిషేకించి వారిలో నివసించడం, విమోచన దినం కొరకు వారిని ముద్రించడం, రక్షింపబడిన ప్రతి ఒక్కరిని బాప్తీస్మం ద్వారా క్రీస్తు శరీరంలో ఒక్కటిగా చేస్తూ, ప్రతి విశ్వాసినీ శక్తితో నింపుతున్నాడు. (యోహాను 14:16-17; 16:7-15; అపొస్తలుల 1:8; 1 కొరింథీ 6:19; ఎఫెసీ 2:22; 2 థెస్సలొనీక 2:7)

అందువలన, పరిశుద్దాత్మ వ్యక్తిత్వాన్నీ, దైవత్వాన్నీ ఖండించే ప్రతీ ఇతర నమ్మకాన్నీ, బోధనీ, మేము తిరస్కరిస్తాం.

పతనం
మానవుడు దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడని, ఉద్దేశపూర్వకంగా దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి, తద్వారా భౌతిక మరణం మాత్రమే కాకుండా ఆత్మీయ మరణం కూడా కలిగియున్నాడు. ఇది దేవుని నుండి వేరు చేయబడటం అని మేము నమ్ముతాం. మనిషి యొక్క పతనమైన స్థితి కారణంగా నీతిమంతులు ఎవరూ లేరు. (ఆ.కా 1:27; రోమా 3:10-12; 5:12-19; యెషయా 64:6)

కాబట్టి, మానవజాతి పతన స్థితిని నమ్మని ప్రతి బోధనను మేము త్యజిస్తాము.

రక్షణ
సిలువపై తన రక్తాన్ని చిందించిన క్రీస్తుయేసు ద్వారా రక్షణ కార్యం పరిపూర్ణం అయిందని, మనిషి ద్వారా ఏది రక్షణ వైపు నడిపించలేదని మేము నమ్ముతున్నాం. అందరూ పాపులు మరియు మంచి పనుల ద్వారా ఎవరూ రక్షణ పొందలేరు, పరలోకానికి చేరుకోలేరు. రక్షణ కేవలం క్రీస్తులో విశ్వాసం ద్వారా, కృప వలన మాత్రమే అని మరియు నిజంగా రక్షించబడిన వారు మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలిస్తారని మేము నమ్ముతున్నాం. మేము ముందుగా ఏర్పరచబడిన సిద్ధాంతాన్ని మరియు చివరి వరకు ఆత్మలను దేవుడు సంరక్షించడాన్ని కూడా నమ్ముతాం. (యోహాను 1:12; 3:16; 14:6; అపొస్తలుల కార్యములు 4:12; రోమా 3:12,23; 2 పేతురు 1:3-11; ఎఫెసీ 1:3-4; 2:8-9; యోహాను 10: 28)

అందువలన, మనిషి యొక్క మంచి పనుల ద్వారా రక్షణను విశ్వసించే మరియు మనిషి యొక్క రక్షణ కొరకు సిలువపై క్రీస్తు పూర్తి చేసిన పనిని తిరస్కరించే ప్రతి ఇతర సిద్ధాంతానికి వ్యతిరేకంగా మేము నిలబడతాం.

నిత్యత్వం
మనిషి ఒక్కసారి మాత్రమే పుడతాడనీ అలాగే ఒకసారి మాత్రమే చనిపోతాడని ఆ తదుపరి తీర్పు మరియు నిత్యత్వాన్నీ ఎదుర్కొంటాడని మేము నమ్ముతున్నాం. పునర్జన్మ (కర్మ), ప్రక్షాళన మరియు సార్వత్రిక రక్షణ అనే భావనను మేము తిరస్కరిస్తాం. మేము నిత్యమైన పరలోకం మరియు నరకం యొక్క వాస్తవికతను విశ్వసిసస్తాం. (హెబ్రీ 9:27, 10:34; దానియేలు12:2-3; ప్రకటన 20:15).

అందువలన, తీర్పు, నిత్యత్వం, పరలోకం మరియు నరకాన్ని నమ్మని ప్రతి బోధనను మేము తిరస్కరిస్తాం.

పాపం
పాపం యొక్క దారుణమైన స్వభావంపై బైబిల్ యొక్క బోధనలను మేము నమ్ముతాం. మనిషి తన పాపాలకై పశ్చాత్తాపపడకపోతే, పరిశుద్ధ గ్రంధం స్పష్టంగా ఇలా బోధిస్తుంది – “లైంగిక అక్రమార్కులు, విగ్రహారాధకులు, వ్యభిచారులు, పురుష వేశ్యలు, స్వలింగ సంపర్కులు, అపవిత్రులు, దొంగలు, అత్యాశపరులు, తాగుబోతులు, అపవాదులు, మోసగాళ్ళు, పిరికివారు, అవిశ్వాసులు, హంతకులు, నీచమైన మాయా విన్యాసాలు చేసేవారు, అబద్ధాలు చెప్పేవారు, అసూయపడేవారు, దురాక్రమణదారులు దేవుని రాజ్యానికి వారసులు కారు.” (1 కొరింథీ 6:9-10; ప్రకటన 21:8; గలతీ 5:19-21)

కాబట్టి, పరిశుద్ధతను విస్మరించే మరియు పాపాన్ని దాని పర్యవసానాలను ప్రోత్సహించే ప్రతి మోసపూరిత నమ్మకాన్ని, బోధనను మేము త్యజిస్తాము.

సంఘం
సంఘం అనేది యేసుక్రీస్తు యొక్క రక్షణాధారమైన కృపను నమ్మి, పరిశుద్ధాత్మ ద్వారా నూతన పరచబడి, క్రీస్తు శరీరంలో ఒకటిగా చేయబడి, దేవుని కుటుంబంగా ఏర్పరచబడిన వ్యక్తుల యొక్క కలయిక అని మేము నమ్ముతాం. యేసుక్రీస్తు సంఘానికి ప్రభువు మరియు అధిపతి. స్థానిక సంఘంలోని ప్రతి సభ్యుడు/ సభ్యురాలు క్రీస్తు శరీర అభివృద్ధి కొరకు క్రియాశీలకంగా పనిచేస్తూ నశించిన వారికి రక్షణ గురించిన సాక్షులుగా ఉండాలి (ఎఫెసీ 2:19-20, 4:16; మార్కు 16:15-16).

కాబట్టి, క్రీస్తు శరీరం యొక్క ప్రాముఖ్యతను వ్యతిరేకించే ప్రతి బోధనను మేము తిరస్కరిస్తాం.