శిష్యత్వపు సంస్కృతిని పెంపొందించడానికి ఒక సంఘ నాయకునిగా నేను ఎలా సహాయపడగలను?

శిష్యత్వపు సంస్కృతిని పెంపొందించడానికి ఒక సంఘ నాయకునిగా నేను ఎలా సహాయపడగలను?

షేర్ చెయ్యండి:

1. క్రొత్తగా క్రైస్తవులయిన వారితో సమయం గడిపేందుకు వీలుగా నీ వారమంతటి షెడ్యూల్ తయారుచేసికొవాలి (టిఫిన్ మరియు లంచ్ సమయంలో వారితో గడపడం, చిన్న చిన్న పనులకు వారిని తోడుగా తీసుకెళ్లడం, ప్రసంగాలను పున: సమీక్ష చేయడం, మొ॥).

2. చదవగల సభ్యులున్న సంఘానికి నీవు నాయకత్వం వహిస్తున్నట్లయితే, సంఘంలో ఉచితంగా పుస్తకాలు పంచిపెట్టడానికి ఆర్ధిక సహాయం కేటాయించునట్లు సంఘాన్ని అడగండి. సందర్భసహితంగా ఇవ్వడానికి కొన్ని పుస్తకాలు నీకు దగ్గర్లో ఉంచుకోవాలి. పుస్తకాలు ఇవ్వబడినవారు వాటిని చదివి, ఆ పుస్తకం గూర్చి చర్చించడానికి నీకు ముందుగానే తెలియజెప్పుమని చెప్పాలి.

3. మీ సంఘంలో పరిపక్వత చెందిన క్రైస్తవులు ఇతరులతో కలుసుకునేలా ప్రోత్సహించాలి. మీ సంఘసభ్యులు మీకు తెలిసిన ఇతర ఆరోగ్యకరమైన స్థానిక సంఘాల సభ్యులతో కలిసి సమయం గడపడం గురించి కూడా ఆలోచించాలి (ఉదా॥ ‘‘హలో, జో, ఈ రోజు భోజనం ఎవరితో కలిసి చేస్తున్నావు? జాన్‌తో కలిసి కొంత సమయం గడపాలని అనుకుంటున్నావా?’’’).

4. నీ బోధను వ్యక్తిగతంగా మాత్రమేగాక, సంఘమంతటికి అన్వయించేలా చూడాలి. (ఉదా॥ ఒక సంఘంగా, ఈ వాక్యభాగం మనకు ఏమి బోధిస్తుంది? మనం ఒకరికొకరం ప్రోత్సహించుకోడానికి, సరిదిద్దుకోడానికి సిద్ధంగా ఉండాలని చెప్తుంది.’’) ఇలా నీవు చేసే ప్రసంగాల అన్వయింపుల ద్వారా క్రైస్తవ శిష్యత్వం మరియు సంఘంలో ఒకరి పట్ల ఒకరు శ్రద్ధవహించే విషయాల్లో ప్రోత్సాహాన్ని ఇవ్వాలి.

5. సువార్త బోధించాలి, అన్వయించాలి. సరైన సువార్త బోధన, క్రీస్తులో విశ్వాసులంతా ఒకే కుటుంబం అన్న గుర్తింపు ఆధారంగా, వారు ఒకరికొకరు సలహాలిస్తూ సహాయం చేస్తూ మరియు వారిని శిష్యులనుగా చేయాల్సిన వారి కర్తవ్యాన్ని తెలియజేస్తుంది. వీలైనంత తరచుగా, సంఘం తన విశ్వాసపు ఒప్పుకోలుకి అలాగే ఒకరి యెడల మరొకరికి ఉండాల్సిన క్రియాశీలకమైన ప్రేమకి ఉన్న సంబంధాన్ని తెలుసుకునేలా సహాయం చెయ్యాలి.

6. శిష్యులనుగా చేయడం లేదా కౌన్సిలింగ్ చేయడం గురించి విశ్వాసులకు తరగతులు జరిపించాలి.

7. బైబిల్ స్టడీల్లో ఎక్కువగా, “మనుష్యుల భయం’’ లేక ‘‘దేవుని చిత్తము మరియు నడిపింపు’’ వంటి నిర్దిష్టమైన అంశాల గూర్చి నేర్పిస్తుండాలి.

8. సంఘ సభ్యత్వపు తరగతులను సద్వినియోగం చేసికోని, సంఘంలో ఒకరి జీవితంలో మరొకరు వాక్యానుసారమైన క్రమమైన ప్రమేయం (జోక్యం) కలిగిఉంటుందని అర్థమయ్యేలా బోధించాలి.

9. సంఘ సభ్యత్వానికి సంబంధించిన సంభాషణల్లో, వ్యక్తిగత శిష్యత్వపు పరిచర్యలో పాల్గొనడానికి వారికిష్టమేనా అని అడిగి తెలిసికోవాలి.

10. మీ సంఘ గ్రంథాలయాన్ని శిష్యత్వానికి సంబంధించిన మంచి మంచి పుస్తకాలతో నింపాలి.

11. బైబిల్ సంబంధమైన కౌన్సిలింగ్ పుస్తక ప్రదర్శనను మీ సంఘంలో ఏర్పాటుచేయడం గూర్చి ఆలోచించండి. సాధ్యమైతే, చిన్న చిన్న పుస్తకాలను ఉచితంగా పంచండి.

12. అనేక మంచి పుస్తకాలను ప్రసంగ వేదిక మీది నుండి సంఘమంతటికి చూపిస్తూ, వాటి గూర్చి వివరిస్తూ, పంచండి.

13. సంఘ కాపరిగా, వినయము మరియు దిద్దుబాటును ఆహ్వానించే విషయంలో మాదిరిగా ఉండాలి!

14. యౌవన దంపతులుకి, వివాహాం కాని వారికి కొన్ని వనరులు (పుస్తకాలు, ఆర్టికల్స్)  సిఫారసు చేసి వాటిని సమకూర్చుట గూర్చి సంఘం ఆలోచించాలి.

15. సంఘ సభ్యులకు మరియు చిన్న గుంపుల నాయకులకు సలహాలిచ్చే లేదా సహాయం చేసే శిక్షణ తరగతులు (కౌన్సిలింగ్ తరగతులు) జరిపించుము.

16. ప్రార్థించు! సంఘ సభ్యులందరి పట్ల తగిన శ్రద్ధ చూపడానికి, సంఘ కాపరులను, దైవభక్తిగల స్త్రీలను, మరియు శిష్యులనుగా చేయుటలో పరిపక్వత చెందినవారిని దేవుడు మీ సంఘంలోనే లేపునట్లు ఆయనను వేడుకొనుము.

9 మార్క్స్

9 మార్క్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...