1. ఒక ఆరోగ్యకరమైన సంఘంలో చేరండి.

2. సంఘ కూడికలకు వీలైనంత ముందుగా చేరుకొని, సాధ్యమైనంత ఆలస్యంగా వెళ్ళండి.

3. సంఘ సభ్యులకు క్రమం తప్పకుండా ఆతిథ్యమిస్తూనే ఉండండి.

4. మంచి స్నేహితులను దయచేయుమని దేవున్ని ప్రార్థించండి.

5. సాధ్యమైతే, సంఘంలో వారానికొకసారి ఇతర సంఘ సభ్యులతో సమయం గడపడానికి అయ్యే ఖర్చును కుటుంబ బడ్జెట్ లో చేర్చండి. నీ జీవిత భాగస్వామితో దీని గురించి చర్చించండి. సాధ్యమైతే, నీ జీవిత భాగస్వామి కొరకు కూడ ఈ ఏర్పాటు చేయండి.

6. తరుచుగా కలిసి బ్రేక్ ఫాస్ట్ చేయడం, భోజనం చేయడం, లేదా సంస్కృతిపరంగా అంగీకరించే ఇతర కార్యక్రమాలు (ఉదా: మగవారు మగవారితో లేదా ఆడవారు ఆడవారితో) ఏర్పాటు చేయండి. నీవు ఎవరినైతే శిష్యత్వంలో నడిపించాలనుకుంటున్నావో ఆ వ్యక్తి సమయాన్ని బట్టి నెలలో మీరు ఎన్నిసార్లైనా, లేదా నిర్దిష్టంగా నాలుగు లేదా ఐదు సార్లు, కలుసుకోడానికి నిర్ణయించుకోవచ్చు.  మీరిద్దరూ కాలక్షేపం కోసం ఏం చేస్తారో తెలుసుకొని, ఆ సమయంలో దానిని మీరిరువురు కలిసి చేయగలరో లేదో ఆలోచించవచ్చు.

7. నీవు ఎవరినైతే శిష్యత్వంలో నడిపించాలనుకుంటున్నావో ఆ వ్యక్తిని గురించిన వివరాలు తెలిసికోండి. వారి తలిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలు, సాక్ష్యము, ఉద్యోగం, క్రీస్తుతో నడుచుకొనుట, మొ॥ విషయాల గూర్చి తెలిసికోండి. ఇలాంటి వివరాల కోసం అడిగే ప్రశ్నల ధోరణి మీ సంస్కృతికి తగినట్టు ఉండునట్లు చూసుకోండి.

8. నీ జీవితం గురించి కూడ పంచుకోండి.

9. ఆధ్యాత్మిక విషయాల గూర్చి సంభాషించండి. ఇద్దరు కలిసి ఒక వాక్యభాగాన్ని లేదా ఏదైన క్రైస్తవ సాహిత్యాన్ని చదవండి.

10. అవతలి వ్యక్తి యొక్క భౌతిక లేదా ఇతర అవసరతల గురించి తెలిసికోండి. మీ సహాయం వారికి సహాయకరంగా ఉంటుందో లేదో ఆలోచించండి.

11. వారితో కలిసి ప్రార్థించండి.

12. మీ కుటుంబము/ఇంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, అప్పుడప్పుడు అలా ఇంటికి వచ్చి వెళ్లండని, మీ కుటుంబముతో కొంత సమయం గడుపవచ్చునని వారిని ఆహ్వానించండి. తద్వారా వారు నీ జీవితాన్ని గమనించే అవకాశమివ్వండి.

9 మార్క్స్
9 మార్క్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *