కృతజ్ఞత లేకపోవడానికి మూలం

కృతజ్ఞత లేకపోవడానికి మూలం

షేర్ చెయ్యండి:

“వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి”. (రోమా 1:21)

దేవునిపట్ల మానవ హృదయంలో కృతజ్ఞత పెల్లుబికినప్పుడు మన ఆశీర్వాదపు సంపదకు ఆధారంగా ఆయన ఘనపరచబడతాడు. ఆయన ఇచ్చేవాడిగాను, ఉపకారిగాను మహిమపొందుతాడు.

అయితే, మనపట్ల దేవుడు చూపిన మంచితనం కోసం మన హృదయాలలో కృతజ్ఞత లేదంటే, దాని అర్థం బహుశా మనం ఆయనకు స్తుతి ప్రశంశలు చెల్లించడానికి ఇష్టపడటంలేదని అర్థం; ఆయనను మన ఉపకారిగా ఘనపరచడానికి మనకి ఇష్టంలేదని అర్థం.

స్వభావరీత్యా మానవులు దేవునిని కృతజ్ఞతతో ఘనపరచకపోవడానికి, లేదా తమ ఉపకారిగా ఆయనను కీర్తించకపోవడానికి చాలా మంచి కారణం ఉంది. అలా చేయకపోవడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి ఘనపరిచి, కీర్తించినప్పుడు మనకు రావలసిన మహిమను కోల్పోతాం మరియు స్వభావ సిద్ధంగా ప్రజలందరూ దేవుని మహిమకంటే ఎక్కువగా తమ స్వంత మహిమను ప్రేమిస్తారు.

కృతజ్ఞత లేకపోవడానికి మూలం ఏంటంటే ఒక వ్యక్తి తన గొప్పతనాన్ని ప్రేమించుకోవడమే. ఎందుకంటే, మనం సంపాదించని ఆస్తికి  లబ్దిదారులుగా ఉన్నామనే విషయాన్ని నిజమైన కృతజ్ఞత భావం కలిగినవారు ఒప్పుకుంటారు. యేసుక్రీస్తు సిలువ ఆకారంలో ఉన్న ఊచకర్ర మీద వ్రేలాడుతున్న వికలాంగులం. మనం దేవుని కరుణ యొక్క ఇనుప ఊపిరితిత్తులో నిమిష నిమిషానికి ఊపిరి పీల్చుకుంటున్న పక్షవాతం గలవారం. మనం పరలోకపు కుర్చీలో (స్త్రోలర్ లో) నిద్రపోతున్న పిల్లలు.

రక్షించే కృపను అనుభవించని వ్యక్తి తనను తాను అయోగ్యమైన లబ్దిదారుడని, వికలాంగుడని, పక్షవాతంగలవాడని, పిల్లవాడని ఆలోచించడానికి అసహ్యించుకుంటాడు. అదంతా దేవునికి ఇవ్వడం ద్వారా వారు ఆయన మహిమను దొంగలిస్తారు.  

అందుచేత, ఒక మానవుడు తన మహిమను ప్రేమి౦చి, తన స్వయం సమృద్ధిని గౌరవి౦చి, తాను పాపినని, నిస్సహాయుడని భావించటాన్ని ద్వేషి౦చినప్పుడు, అతను సత్య దేవునిపట్ల నిజమైన కృతజ్ఞత భావంతో ఎప్పటికీ ఉండలేడు, కాబట్టి తాను ఎప్పటికీ దేవుణ్ణి ఘనపరచవలసిన విధంగా ఘనపరచలేడు గాని తనను తాను ఘనపరచుకుంటాడు. 

“యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యముగలవారికి వైద్యుడక్కరలేదు; నేను పాపులనే పిలువ వచ్చితినిగాని నీతిమంతులను పిలువరాలేదు” అని చెప్పాడు (మార్కు 2:17).

మేము బాగున్నామని చెప్పుకునేవారికి సేవ చేయడానికి యేసు రాలేదు. మేము గొప్పవారము కామన్న విషయాన్ని ఒప్పుకున్నామనే సంగతిని మనందరి నుండి ఆయన ఎదురుచూస్తున్నాడు. ఇది అహంకారులకు చెడు వార్తే గాని స్వయం సమృద్ధిని వదులుకుని దేవుణ్ణి వెదుకుతున్నవారికి తీపి కబురు.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...