మరియ యొక్క అద్భుతమైన దేవుడు

షేర్ చెయ్యండి:

“అప్పుడు మరియ యిట్లనెను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్పకార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్నితరములవారును నన్ను ధన్యురాలని యందురు. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడువారిమీద ఆయన కనికరము తరతరములకుండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనములనుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను ఆకలిగొనినవారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టిచేతులతో పంపివేసెను. అబ్రాహామునకును అతని సంతానమునకును యుగాంతమువరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసికొందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను”. (లూకా 1:46–55)

దేవుని గురించిన ఒక విశేషమైన విషయాన్ని మరియ స్పష్టంగా చూస్తుంది: ఆయన మానవ చరిత్ర దిశను పూర్తిగా మార్చబోతున్నాడు; కాలమంతటిలో అత్యంత ముఖ్యమైన మూడు దశాబ్దాలు ప్రారంభం కాబోతున్నాయి.

అయితే దేవుడు ఎక్కడ ఉన్నాడు? పెద్దగా  గుర్తింపులేని, వినయము గల స్త్రీలైన – ఒక వృద్ధ గొడ్రాలు (ఎలీసబెతు), ఒక యవ్వనస్థురాలైన కన్య (మరియ)లతో దేవుడు ఉన్నాడు. మరియ , దీనుల ప్రేమికుడైన దేవుని గూర్చిన ఈ దర్శనానికి ఎంతగానో కదిలింపబడినదై, ఆమె ఒక పాట పాడింది – ఈ పాటను ఆంగ్లంలో “ది మాగ్నిఫికేట్” అని పిలుస్తారు.

లూకా వ్రాసిన సువార్తలో మరియ, ఎలీసబెతులు అద్భుతమైన కథానాయికలు. అతను ఈ స్త్రీల విశ్వాసాన్ని మెచ్చుకొంటాడు. ఎలీసబెతు, మరియలు అద్భుతమైన దేవునికి తమనితాము సమర్పించుకున్నప్పుడు వారు చూపించే అణకువ మరియు ఉల్లాసమైన వినయమునకు, తాను ఆకర్షితుడైనట్లు తన గొప్ప పాఠకుడైన థెయొఫిలా కూడా ఆకర్షితుడవ్వాలని లూకా వ్రాస్తున్నాడు.

ఎలీసబెతు ఇలా చెప్పింది (లూకా 1:43), “నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నా కేలాగు ప్రాప్తించెను?” మరియు (లూకా 1:48), “నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించెను” అని మరియ చెప్పింది. వారి దీన స్థితిని గుర్తించిన అద్భుతమైన దేవుడు తమ స్టాయికి దిగి రావడాన్ని బట్టి ఉబ్బితబ్బిబ్బయిన ఎలీసబెతు, మరియల వంటి వారు మాత్రమే ప్రభువును నిజంగా మహిమపరచగలుగతారు.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...