మన కోసం యేసు ప్రార్థిస్తున్నాడు

మన కోసం యేసు ప్రార్థిస్తున్నాడు

షేర్ చెయ్యండి:

“ఈయన తన ద్వారా దేవునియొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైయున్నాడు”. (హెబ్రీ 7:25)

మన కోసం విజ్ఞాపన చేయడానికి క్రీస్తు ఎల్లప్పుడు జీవిస్తున్నాడు కాబట్టి సంపూర్ణంగా, శాశ్వతంగా రక్షించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. మరొక విధంగా చెప్పాలంటే, క్రీస్తు నిరంతరం మన కోసం విజ్ఞాపన చేయకపోతే ఆయన మనల్ని శాశ్వతంగా రక్షించలేడని పై వచనం చెప్తోందన్నమాట.

ఈ మాటకు అర్థం ఏంటంటే క్రీస్తు యాజకత్వం ఉన్నంత కాలం మన రక్షణకు భద్రత ఉంటుంది. ఇందుచేతనే, మనకు మానవ యాజకునికంటే ఎంతో గొప్పవాడైన యాజకుడు అవసరం. క్రీస్తు దైవత్వం మరియు మృతులలో నుండి ఆయన పునరుత్థానం అనేవి మన కోసం నశించని ఆయన యాజకత్వాన్ని భద్రపరుస్తాయి.

దీని అర్థం మన రక్షణ గురించి మనం తరచుగా మాట్లాడుకునే తేలికపాటి మాటలలో మాట్లాడుకోకూడదు, అంటే నేను ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నాను, క్రీస్తు మరణించి తిరిగి లేచినప్పుడు ఏదో చేసాడు, అంతే ఇంకేముంది, అదొక్కటే అక్కడ ఉంది అన్నట్లుగా మనం మాట్లాడుకోకూడదు.

ఈ రోజే పరలోకంలో యేసు చేసేటువంటి నిరంతర విజ్ఞాపన ద్వారా నేను రక్షించబడ్డాను. యేసు మన కోస౦ ప్రార్థిస్తున్నాడు, అదే మన రక్షణకు అతి ప్రాముఖ్యమైన విషయం.

నిత్యము చేసేటువంటి ప్రార్థనల (రోమా 8:34) ద్వారా, మన ప్రధాన యాజకునిగా పరలోకంలో యేసు అనే ఉత్తరవాది (1 యోహాను 2:1) ద్వారా మనం శాశ్వతంగా రక్షించబడ్డాం. ఆయన మన కోసం ప్రార్థిస్తున్నాడు మరియు ఆయన ప్రార్థనలకు జవాబు ఇవ్వబడుతుంది, ఎందుకంటే తన పరిపూర్ణమైన త్యాగమును ఆధారం చేసుకొని ఆయన పరిపూర్ణంగా ప్రార్థిస్తాడు.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...