కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా దేవుణ్ణి మహిమపరచండి

షేర్ చెయ్యండి:

“కృప యెక్కువమంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున, సమస్తమైనవి మీకొరకై యున్నవి”. (2 కొరింథీ 4:13) 

దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం అనేది ఆనందంతో కూడిన భావోద్వేగం. ఆయన కృప కోసం మనం ఎంతో ఆనందంతో కూడిన ఋణ భావాన్ని కలిగియున్నాం. కాబట్టి, కృతజ్ఞతలు చెల్లించే ప్రతి భావంలోనూ, మనమందరం ప్రయోజనాలను పొందుతూనే ఉన్నాం. అయితే, స్వభావరీత్యా, కృతజ్ఞతలు చెల్లించడమనేది ఇచ్చిన వ్యక్తిని మహిమపరుస్తుంది. మనం కృతజ్ఞత భావాన్ని కలిగి ఉన్నప్పుడు, మనం మన అవసరతను, దేవుని ఉపకారాన్ని, దేవుని సంపూర్ణతను, ఆయన మహిమైశ్వర్యమును గుర్తిస్తాం.

నన్ను నేను తగ్గించుకొని, రెస్టారెంట్ లోని సర్వర్ కి “థాంక్యూ” అని చెప్పి, అతను అందించిన సేవకు అతణ్ణి పొగిడాను, అలాగే నేను దేవునికి కృతజ్ఞతలు చెప్పాలని కృతజ్ఞతా భావంతో నిండియున్నప్పుడు నన్ను నేను తగ్గించుకొని, నేను ఆయనను ఘనపరుస్తాను. అవును, ఇక్కడున్న వ్యత్యాసం ఏంటంటే దేవుడు నాకు చూపించే కృప కోసం నేను నిజంగా అపరిమితంగా రుణపడి ఉన్నాను మరియు ఆయన నా కోసం చేసే ప్రతీది ఉచితం మరియు అమూల్యం (ఆయన ఇచ్చే ప్రతిదీ పొందే అర్హత నాలో లేదు). 

అయితే, ఇక్కడ విషయం ఏంటంటే కృతజ్ఞత భావం కలిగి ఉండడమనేది ఇచ్చే వ్యక్తిని మహిమపరుస్తుంది. ఇది దేవుణ్ణి మహిమపరుస్తుంది. పౌలు వ్యయప్రయాసములన్నిటిలో అతడు కలిగియున్న అంతిమ లక్ష్యం ఇదే. అవును, అతడు చేసిన ప్రతి పరిచర్య సంఘం కోసమే, అంటే సంఘ క్షేమము కోసమే. అయితే, సంఘమనేది ఉన్నత లక్ష్యం కాదు. మరొకసారి ఈ మాటను వినండి: కృప యెక్కువమంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున, సమస్తమైనవి మీకొరకై యున్నవి!

సువార్త గురించి అద్భుతమైన విషయం ఏంటంటే దేవుని మహిమ కోసం అది మన నుండి కోరుకున్న స్పందన అనేది అత్యంత స్వాభావికంగాను మరియు ఆనందదాయకంగాను ఉండే స్పందనే, అంటే కృపనుబట్టి కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండడం. ఇవ్వడంలో దేవుని సర్వోత్తమ మహిమ మరియు స్వీకరించడంలో మన వినయపూర్వకమైన సంతోషం అనేవి పోటీలో లేవు. ఆనందకరమైన కృతజ్ఞతా భావం దేవుణ్ణి మహిమపరుస్తుంది.

దేవుని కృప కోసం దేవునికి మహిమ చెల్లించే జీవితం, లోతైన ఆనందాన్ని కలిగిన జీవితం అనేవి ఒకటి కాదు. వాటిని ఏకం చేసేది (లేక వాటిని ఒకటిగా చేసేది) కృతజ్ఞతా భావమే.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...