సువార్త ప్రకటించుటలోని చెడు అభ్యాసాలు – కొన్ని ఉదాహరణలు
షేర్ చెయ్యండి:
- సువర్తమానమును ఏమాత్రమును పంచుకొనకుండుట. సువార్త ప్రకటించుట అంటేనే సువర్తమానమును పంచుకొనడమై యున్నది, గనుక ఈ సందేశాన్ని తెలియజెప్పకపోవడం వలన తప్పుచేసినవారమవుతున్నాము. బీదల యెడల శ్రద్ధ చూపించడము ద్వారా లేదా అణగద్రొక్కబడుతున్నవారికి సహాయం చేయడము ద్వారా వారు ‘‘నోరు తెరచి మాట్లాడకుండానే సువార్త పంచుకుంటున్నారని’’ కొన్నిసార్లు సామాజిక సేవ చేసేవారనుకుంటారు. లేదు, వారు పంచుకొనడం లేదు. వారు ఇతరుల కోసం దయతో కూడిన & నిస్వార్థమైన అద్భుతకరమైన పనులు చేయవచ్చు, కాని సువార్త ప్రకటించడమంటే క్రీస్తును గూర్చిన సందేశాన్ని ఇతరులకు తెలియజెప్పుటయై యున్నది.
- సందేశాన్ని వక్రీకరించుట. నమ్మకమైన సౌవార్తీకరణమంటే, సందేశాన్ని పూర్తిగా చెప్పడమని అర్థం. ‘పూర్తిగా’ లేక ‘మొత్తం’ అనంటే, పాపము మరియు దేవుని తీర్పు వంటి ప్రజలు ఇష్టపడని సత్యాలు కూడా అని అర్థం (అపొ. 20:27).
- సత్య సువార్తకి బదులు అబద్ధ వార్తను చెప్పడము. ‘మేము సువార్త ప్రకటిస్తున్నామని’ చెప్పుకొను కొందరు వాస్తవానికి దానికి వ్యతిరేకమైనదానిని ప్రకటిస్తున్నారు, తీవ్రమైన పరిణామాలను వారు ఎదుర్కొంటున్నారు, వారి శ్రోతలు కూడ ఎదుర్కొంటున్నారు (గలతీ 1:6-9, 2 పేతురు 2:1-3).
- సువార్తను కేవలము ఒక అభిప్రాయంగా చెప్పడము. సువార్తను వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పడము దానిని వక్రీకరించినట్టే, ఎందుకంటే వ్యక్తిగత అభిప్రాయాలను ఇతరులు తృణీకరించుటకు అవకాశాలున్నాయి, తత్ఫలితంగా ఆశించిన ఫలితం దక్కదు. సువార్త ప్రకటించడమనగా, ప్రజలు వారి పాపముల గూర్చి మారుమనస్సు పొంది, దేవుని ఉగ్రత నుండి రక్షింపబడుటకు క్రీస్తునందు నమ్మకముంచవలెనని చెప్పడం. సువార్త, ఒక సామాన్య అభిప్రాయం కాదు గనుక మన సౌవార్తీకరణము, సువార్త యొక్క సార్వత్రిక సత్యసంధత్వము మరియు కట్టుబాటుగా కోరబడుతున్న సంబంధిత విషయాలను నమ్మకంగా తెలియజెప్పాలి.
- ఒకరు నిర్ణయించుకొనుటకు ఒత్తిడి చేయడం. దేవుడు మాత్రమే ఒకనిని విశ్వసింపజేయగలడు, మారుమనస్సు పొందునట్లు చేయగలడు. ఈ విషయాల్లో మనము ఒత్తిడి చేసినట్లయితే, వారు నిత్యత్వంలో విలువలేని నిర్ణయం చేసికొనవచ్చు. ఇంతేగాక, ఒకడు తన పాపముల గూర్చి మారుమనస్సు పొందక, క్రీస్తునందు విశ్వాసముంచకుండానే, నేను ‘‘నిర్ణయించుకుంటే’’ చాలు, నేను క్రైస్తవుడనైనట్లే అని నమ్మగల తప్పుడు భావనను వానిలో పుట్టించగలదు.
- ముఖ్యమైన విషయాలను వదిలిపెట్టి, చిన్న చిన్న విషయాలను ఎక్కువగా పట్టించుకొనుట. క్రైస్తవేతరులడిగే ప్రశ్నలన్నిటికి దాదాపు సంతృప్తినిచ్చు జవాబు చెప్పాలనే ఆశతో, చెదు లేదా పాపము గూర్చి తర్కించుటలో గంటలు గంటలు సమయం గడుపడం, క్రీస్తును ప్రకటించినట్టు కాదు. అసలు విషయానికి బదులు వేరొక విషయాన్ని చర్చించడము, నీవు సిలువ సందేశాన్ని చెప్పకుండునట్లు చేయనీయకు.
- క్రైస్తవేతరుల ప్రశ్నలను లేదా ఆక్షేపణలను నిర్మొహమాటంగా కించపరచడం. ఇది వారికి అభ్యంతరం కలిగించే ముఖ్య విధానం, తత్ఫలితంగా నీ సౌవార్తీకరణ సంభాషణ శీఘ్రంగా, అర్థాంతరంగా ముగియగలదు. ‘‘నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారమై, మనలో ఉన్న నిరీక్షణను గూర్చి మనలను హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండవలెనని’’ అని వ్రాస్తూ, మనము క్రైస్తవేతరులడిగే ప్రశ్నలకు ఎలా జవాబివ్వాలో చెప్పుతున్నాడు (1 పేతురు 3:15-16).
Samskarana
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది
సంస్కరణ
“సంస్కరణ” ప్రత్యేకంగా తెలుగు భాషలో లేఖన-కేంద్రీకృత విస్తృత వనరులను అందిస్తుంది. ఈ వనరులు అనుదిన ధ్యానాలు, వ్యాసాలు, ప్రసంగాలు, పాడ్ కాస్ట్ లు మరియు పుస్తకాలను కలిగి ఉన్నాయి. ఇవన్నీ తెలుగు స్థానిక సంఘాల క్షేమాభివృద్ధి కొరకు ఆరోగ్యకరమైన సిద్ధాంత బోధలను అందించే లక్ష్యంతో ఉన్నాయి.
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web