మాదిరి జీవితపు శక్తి

మాదిరి జీవితపు శక్తి

షేర్ చెయ్యండి:

“మాదిరి అనేది జీవితంలో ప్రాముఖ్యమైన విషయం కాదు, మాదిరిగా ఉండడమే జీవితం.” 

ఈ మాటలు ప్రఖ్యాత మెడికల్ మిషనరీ మరియు గ్రంథకర్తయైన ఆల్బర్ట్ ష్వయిట్జర్ గారు మాదిరి జీవితపు శక్తిని మరియు ప్రాధాన్యతను గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ఈ మాటలు చదువుతున్న మనలో ఎంతోమంది, మన క్రైస్తవ జీవిత ప్రారంభ రోజుల్లో మనం చూసిన శక్తివంతమైన కొంతమంది సంఘ కాపరుల (పాస్టర్స్) ద్వారా, లేక ఇతర క్రైస్తవుల జీవితాల ద్వారా ప్రభావితం చెంది ఉంటాం!

ఒక వేళ “నమ్మకమైన సంఘ కాపరి” అని నేను చెప్పగానే, మీ మనస్సులో ఎవరు మెదులుతారు? ఒక వేళ “నమ్మకమైన క్రైస్తవుడు” అని నేను చెప్పగానే మీరు ఎవరిని గూర్చి ఆలోచిస్తారు?

అవును, ష్వయిట్జర్ గారి వ్యాఖ్య అతిశయోక్తే. నమ్మకమైన జీవితంలో అనేకమైన విషయాలు చోటు చేసుకొని ఉంటాయి, కానీ అవన్ని కలగలిపి ఇతరులకు మాదిరిగా చూపించే విధంగా ఉంటాయి.

“మార్గదర్శకత్వం చేయడం మరియు “రూపించడం” అనేవి క్రొత్త విషయాలుగా కనిపిస్తాయి గాని, అవి క్రొత్తవి కాదు. ఈ విషయాలు దేవుడు మనల్ని సృష్టించినప్పటినుండి, ఆయన మనస్సులో ఉన్నట్లు అనిపిస్తోంది. ఆయన తన స్వరూపములో మనుష్యులను చేసుకున్నాడు. మనం ఆయన మాదిరిని అనుసరించాలి, ఆయన గుణలక్షణాను అనుకరించాలి. ‘… మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను’ (1పేతురు 2:21) అని పేతురు చెప్పినట్లుగా, క్రీస్తు శరీరధారిగా వచ్చినప్పుడు, మనం దేవుణ్ణి అర్థం చేసుకొని, ఆయనకు సంబంధించినవారముగా ఉండడానికి దేవుడు శరీరమును ధరించుకున్నాడు.

మనం కూడా మాదిరిగా ఉంటూ, మాదిరిని అనుసరించే పరిచర్యలో పాల్గొనాలి. కుటుంబములో పుట్టడానికి, కుటుంబములోని ఇతరులతో సహవాసము చేయడానికి దేవుడు మానవులను సృష్టించాడు. మనంతట మనమే ఇక్కడ పుట్టలేదు, లేదా మనం రెప్పపాటులో పెద్దవారమైపోము. మనుష్యులు ఎదిగే విధానంలో భాగమైయుండడానికి, ప్రేమగల తలిదండ్రులు ఉండాలని దేవుడు ఉద్దేశించాడు.

పతనమైన ఈ ప్రపంచములో దేవుడు తనను తాను బయలుపరచుకోవడానికి ఇది కూడా దేవుడు నిశ్చయించిన విధానం.

ఈ ప్రపంచంలో పరిశుద్ధంగా, ప్రత్యేకమైనవారిగా ఉండడానికి మరియు విభిన్నమైన ప్రజలుగా ఉండడానికి, పాత నిబంధనలో, దేవుడు అబ్రహామును మరియు అతని సంతానాన్ని పిలిచాడు. దేవుని ఉద్దేశాలను, ఆయన విలువలను కలిగియుండి, ఆయన గుణలక్షణాలను ప్రతిబింబించే సమాజంగా లోకం వారిని గుర్తించేట్లు వారు ప్రత్యేకమైనవారిగా ఉన్నారు. లేవియకాండం 19వ అధ్యాయములో “మీరు పరిశుద్ధులైయుండవలెను. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనైయున్నాను” అని దేవుడు తన ప్రజలకు చెప్పినప్పుడు, ఆయన మోషేతో, అహరోనుతో, లేక యెహోషువతో మాత్రమే మాట్లాడటం లేదు. లేవియకాండం 19:1వ వచనములో ఇశ్రాయేలు సర్వ సమాజమంతటికీ కూడా చెప్పాలని దేవుడు ప్రత్యేకంగా మోషేకు ఆజ్ఞాపించినట్లు మనం చూడగలం. దేవుడు వారికిచ్చిన కట్టడలన్నీ కూడా, సంబంధాలు, సమానత్వం, న్యాయం మరియు సామాజిక పరస్పర ప్రతిస్పందనలతో పని చేయడానికి ఎక్కువగా ముడిపడియున్నాయి. ఈ ప్రజలు ఒకరినొకరు పట్టించుకున్నప్పుడు అనగా అన్యులను మరియు దీనులను, పరదేశులను మరియు యౌవ్వనులను పట్టించుకున్నప్పుడు, వారు న్యాయవంతుడైన, కనికర సంపన్నుడైన తమ సృష్టికర్త యొక్క గుణలక్షణాలలో కొంతైన ఇతరులకు చూపించగలరు.

ఇతరులకు మాదిరి చూపించే ఈ పరిచర్యలో ఇశ్రాయేలు వైఫల్యం, పాత నిబంధనలోని వారికి విరుద్ధంగా దేవుడు చేసిన ఆరోపణలలో ప్రధానమైనదిగా ఉన్నది. అందుచేత, యెహెజ్కేలు 5వ అధ్యాయంలో, ప్రతికూల మాదిరిని చూపించుట ద్వారా హెచ్చరికకు గురైన దేశాలలో ఒకటిగా ఇశ్రాయేలు నిలిచిపోయింది. “ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చెను–ఇది యెరూషలేమే గదా, అన్యజనుల మధ్య నేను దానినుంచితిని, దాని చుట్టు రాజ్యములున్నవి…. ఆలాగు నీ చుట్టునున్న అన్యజనులలో నిన్ను చూచు వారందరి దృష్టికి పాడుగాను నిందాస్పదముగాను నేను నిన్ను చేయుదును. కావున నీ పోషణాధారము తీసివేసి, నీ మీదికి నేను మహా క్షామము రప్పించి, నీవారు క్షయమగునట్లుగా వారిని క్షయపరచు మహా క్షామమును పంపించి, కోపముచేతను క్రోధముచేతను కఠినమైన గద్దింపులచేతను నేను నిన్ను శిక్షింపగా నీ చుట్టునున్న అన్యజనులను నీవు నిందకును ఎగతాళికిని హెచ్చరికకును విస్మయమునకును ఆస్పదముగా ఉందువు; యెహోవాను నేనే ఆజ్ఞ ఇచ్చియున్నాను” (యెహెజ్కేలు 5:5, 14-15) అని యెహోవా ఇశ్రాయేలుతో అన్నాడు. ప్రపంచములో ఉన్న ప్రజలందరి మధ్యన ఆయన తెలియబడడం గురించిన  సత్యము కొరకై, తన స్వంత నామము నిమిత్తమై ఇశ్రాయేలు దేశానికి ఆయన ఏం  చేయాలని తలంచాడో దానినే చేస్తాడని యెహెజ్కేలు గ్రంథములో దేవుడు పదేపదే చెప్పాడు.

ఆయన తన విషయములో స్వయంగా చెప్పుకున్న ఈ బహిరంగ సాక్ష్యమునే క్రొత్త నిబంధనలో సంఘము ద్వారా కూడా దేవుడు ఉద్దేశించాడు. యోహాను 13వ అధ్యాయంలో ఒకరికొరకు ఒకరు కలిగియున్న క్రీస్తు ప్రేమ ద్వారా, మనం క్రీస్తు శిష్యులమని లోకం తెలుసుకుంటుందని యేసు చెప్పాడు. “మీరు పూర్వమందు చీకటియైయుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు” (ఎఫెసీ 5:8) అని పౌలు ఎఫెసీయులకు వ్రాసాడు. చీకటి సంబంధమైన మరియు నిరాశకు గురి చేసే ఈ లోకంలో వ్యక్తిగతంగా మరియు సంఘాలుగా కలిసిన మన జీవితాలలో నిరీక్షణ కలుగజేసే దేవుని వెలుగును మనం క్రైస్తవులుగా కలిగియున్నాం.

క్రైస్తవులుగా మన జీవితాల ద్వారా ఒకరికొకరం అలాగే మన చుట్టూ ఉన్న ప్రపంచానికి దేవుని గూర్చి మనం బోధిస్తున్నాం.

మనం పరస్పరం, ప్రేమకలిగి ఉంటే, దేవుని ప్రేమించడం అంటే ఏమిటన్న విషయాన్ని మనం కొంతమట్టుకు చూపిస్తున్నాం అని అర్థం. మరొక విధంగా చెప్పాలంటే, “ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమించనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు” (1యోహాను 4:20) అని చెప్పవచ్చు. మన పరిశుద్ధతలో, మనం దేవుని పరిశుద్ధతను చూపిస్తున్నాం. పతనమైన మన స్వభావాలు మరియు మన చుట్టూ ఉన్న ప్రపంచం స్వార్థపూరిత నిరాశ జీవితాలను అనుకరించడానికి మనల్ని ప్రోత్సహిస్తుంటే, మరొక జీవన విధానం ఉందనే నిరీక్షణను ప్రజలకివ్వడానికి మనం పిలువబడియున్నాం.

తోటి సంఘ కాపరులారా, మనల్ని జాగ్రత్తగా గమనిస్తున్న ఈ ప్రపంచానికి దేవుని గూర్చి మన సంఘాలు ఏమి బోధిస్తున్నాయి?

దేవుడు కేవలం ఒక జాతికి లేక కులానికే పరిమితమని మనం వారికి బోధిస్తున్నామా? ఆయన పాపమును, ద్రోహమును, నీచత్వం మరియు గొడవలతో నిండియున్న స్వార్థమైన జీవితాలను సహిస్తాడని వారికి బోధిస్తున్నామా? దేవుడు సృష్టించిన తన సృష్టికి మనం దేవుని ప్రవర్తన అనే ప్రకటనగా, అంగడిగా, బహిరంగ ప్రదర్శనగా ఉన్నామనే గొప్ప పనిని మరియు ధన్యతను తీసుకోవడానికి, మనం ఎలాంటి తీవ్రతతో మన ప్రజలను నడిపిస్తున్నాం?

ఆయన మనకు ఎంత అద్భుతమైన ఆధిక్యతను ఇచ్చాడు కదా, అయితే దానిని మనం చాలా చిన్న విషయంగా పరిగణిస్తున్నాం కదూ!

మన సంఘంలోకి ఎక్కువ మంది ప్రజలను మనం తీసుకువస్తే, ఇప్పటికే సంఘ సభ్యులుగా వున్న వారిపట్ల మనకున్న బాధ్యతను ఏదోవిధంగా నిరాకరించవచ్చని మనం ఆలోచిస్తాం.

వారిలో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నారు? నిజంగా మార్పు చెందినవారి ద్వారా దేవుడు ఇచ్చే మంచి సాక్ష్యాన్ని, లోకంలో ఉన్న ప్రజలు చూసే క్రమంలో, ఇంతకుముందే వారు కలిగియున్న చెడు సాక్ష్యాన్ని సరిదిద్దడానికి మీరు ఎంతో కృషి చేయాలి.

సంఘ క్రమశిక్షణ పాటించడమనేది ప్రతీకారం తీసుకోవడం లేక న్యాయం తీర్చడం కాదు. అవి దేవునికి ప్రాముఖ్యమైనవి గాని, మనలాగానే క్షమించబడిన పాపులకు కాదు (ద్వితీయో 32:25; రోమా 12:19)! మనమైతే, దేవుడు ఎలాగుంటాడో అనే సాక్ష్యాన్ని ఇతరులకు చూపించేవారముగా ఉన్నాం.

మన జీవితాలలో మరియు మన ప్రవర్తనలో మనం మాదిరిని చూపించవలసినవారమైయున్నాం. అపొస్తలుడైన పౌలు గారు వ్రాసిన కాపరి పత్రికలలో, సంఘానికి  బయట ఉన్నవారితో (అవిశ్వాసులతో) సంఘకాపరి మంచి సాక్ష్యాన్ని కలిగియుండడం  గూర్చి పౌలు ప్రత్యేకమైన శ్రద్ధను చూపించినట్లుగా ఉందని మీరెప్పుడైనా గమనించారా? దీనికి అనేకమైన కారణాలు ఉండవచ్చు, అందులో ఒకటి, సంఘానికి ప్రతినిధిగా సంఘకాపరి తన పాత్రను తప్పనిసరిగా ఈ లోకంలో పోషించాలి. అలాంటప్పుడు, సంఘమంతా కూడా అలాగే ఉండాలి కదా. అందుచేతనే, 1 కొరింథీ 5వ అధ్యాయంలో పౌలు చాలా కోపపడ్డాడు. పౌలు ఆ అధ్యాయంలో ఖచ్చితంగా, ఎవరిమీద కోప్పడ్డాడో మీరు గమనించారా? పాపంతో నిండిన దారుణమైన లైంగిక సంబంధంలో ఉన్న మనిషిని ఆయన తిట్టలేదు; కానీ సంఘ సభ్యుల మధ్య అంత ఘోరమైన పాపం జరుగుతుంటే, దానిని సంఘమెలా భరించి మౌనంగా ఉందని ఆయన ఘాటుగా గద్దించాడు!

మనలో కొంతమంది, తాము మొదట్లో మంచి సాక్ష్యాన్ని కలిగియున్నప్పటికీ, తర్వాతి రోజుల్లో తాము పాపంలో పడి దేవునికి దూరంగా వెళ్ళిపోతారనే చేదు నిజం మనకు తెలుసు. కానీ, వారిలో కనీసం కొంతమందైనా తమ జీవిత కాలంలో పశ్చాత్తాపపడి, మళ్ళీ తిరిగి వస్తారని మనం నమ్ముతున్నాం. అయితే, సంఘము పాపానికి విరుద్ధంగా, పరిశుద్ధత కొరకు నిలువబడడం  ద్వారా దేవునిని మంచిగా చూపించే తన బాధ్యతను మరిచిపోతుందని మనం అనుకోకూడదు. కానీ ఎలాగైతే పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు చేసిన విగ్రహారాధనవల్ల వారు మాదిరిగా ఉండే విషయంలో వైఫల్యం చెందారో, ఇటువంటి వైఫల్యమే పౌలు కొరింథీ సంఘాన్ని గద్దించడానికిగల ఉద్దేశంగా ఉన్నది.

స్నేహితులారా, మీ సంఘాన్ని గురించి, మా సంఘాన్ని గురించి అపొస్తలుడైన పౌలు ఏమి చెబుతాడో? ఎన్ని సార్లు ప్రేమ అనే పేరుతో సంఘ సహవాసానికి హాజరవ్వనివారిని మనం వదిలేస్తున్నాం? మన సంఘాలలో ఎన్ని సార్లు వ్యభిచార సంబంధాల గురించి లేక వాక్యానుసారం కాని విడాకుల గురించి మాట్లాడకుండా ఉండిపోయాం? వీటన్నిటి ద్వారా, “మీకంటే మేమేమి ప్రత్యేకమైనవారం కాము” అని ప్రపంచానికి అరచి చెప్తున్నాం. చిన్న చిన్న సమస్యలను ఆధారం చేసుకొని సంఘాన్ని చీల్చడానికి మనలో ఎంతమంది సంఘాన్ని విభజించేవారిని అనుమతించాం, లేక సంఘములో ఎన్ని తప్పుడు సువార్తలను బోధించడానికి మనం అనుమతించాం?

ప్రియ సహోదరులారా, ఒక సంఘ కాపరిగా, ఒక నాయకుడిగా, ఒక ఉపదేశకునిగా లేక సంఘములో ఒక సభ్యుడిగా ఈ వ్యాసాన్ని చదివే ప్రతి ఒక్కరూ,  మనకున్న గొప్ప బాధ్యతను గురించి ఆలోచించండి.

మనం ఈ లోకానికి దేవుని గురించి మంచి సాక్ష్యాన్ని ఎలా ఇవ్వగలమో ఆలోచించండి, మన మధ్యనుండే పాపాన్ని, నిర్లక్ష్యం చేయడం ద్వారానా లేక గలతీ 6:1 వ వచనంలో పౌలు గారు చెప్పినట్లుగా, పాపములో చిక్కుకున్నవారిని బైటికి తీసుకురావడానికి సాత్వికంగా కృషి చేయుట ద్వారానా?

మనం ఆరాధించే దేవుణ్ణి ఎలాంటి సాక్ష్యం, చక్కగా ప్రతిబింబించగలదు? దేవుని వాక్యంలో ఎప్పుడైనా, దేవుని దయ, ఆయన పరిశుద్ధత విషయంలో ఆయనతో రాజీ పడేలా చేస్తుందా? అలాంటప్పుడు ఆయన సంఘ పరిస్థితి ఏంటి? ఈ విషయములో మన గృహనిర్వాహకత్వం (బాధ్యత) ఏమిటి?

మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి ఎటువంటి మాదిరి చూపించాలనుకుంటున్నారో,  ఆ విషయములో శ్రద్ధ వహించండి. దేవుడు తన ప్రజల కొరకు మరియు ఆయన ప్రపంచం కొరకు గొప్ప ప్రణాళికను కలిగియున్నాడు; దానిని మన జీవితాల ద్వారా మరియు మన మాటల ద్వారా చూపించాలని ఆయన మనల్ని పిలుస్తున్నాడు. మీరు దానిని చేస్తున్నారా?

ఆయన మనకిచ్చిన గొప్ప పిలుపులో నమ్మకంగా ఉండడానికి మనలోని ప్రతి ఒక్కరికి దేవుడు సహాయము చేయునుగాక.

మార్క్‌ డెవర్‌

మార్క్‌ డెవర్‌

మార్క్‌ డెవర్‌ వాషింగ్టన్ D. C.లోని కాపిటల్ హిల్ బాప్టిస్ట్ చర్చి యొక్క సీనియర్ పాస్టర్ మరియు 9మార్క్స్ అధ్యక్షుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...