మహారాజు గారి ద్రాక్షారసం

మహారాజు గారి ద్రాక్షారసం

షేర్ చెయ్యండి:

“మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను”. (హెబ్రీయులు 4:15)

“అన్నీ బాగున్నపుడు నా జీవితంలో లోతైన పాఠాలు నేర్చుకున్నాను” అని చెప్పడం నేను ఎప్పుడూ వినలేదు. కానీ బలంగా వాడబడిన పరిశుద్దులు ఇలా చెప్పడం నేను విన్నాను, “దేవుని ప్రేమ యొక్క లోతులను అర్ధము చేసుకోవడం మరియు ఆయనలో లోతుగా ఎదగడం శ్రమల ద్వారానే సాధ్యమయింది.”

ఇది గంభీరమైన బైబిల్ సత్యం. ఉదాహరణకు: “క్రీస్తును సంపాదించుకొని…సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను.”(ఫిలిప్పీ 3:9,11). కష్టము లేనిదే ఫలితము లేదు లేదా క్రీస్తును నేను మరింత ఎక్కువ పొందుకుంటానంటే, ఇప్పుడే అన్ని అర్పించుకోవడానికి అనుమతిస్తాను.

మరొక ఉదాహరణ: “ఆయన, కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను.” (హెబ్రీ 5:8). అదే పుస్తకం ఆయన ఎప్పుడూ పాపం చేయలేదని కూడా చెప్పింది (హెబ్రీయులు 4:15).

కాబట్టి విధేయత నేర్చుకోవడం అంటే అవిధేయత నుండి విధేయతకు మారడం కాదు. విధేయత యొక్క అనుభవంలో దేవునిలో లోతుగా మరింత లోతుగా ఎదగడం దీని అర్థం. దేవునికి లొంగిపోయే లోతులను అనుభవించడం అంటే శ్రమ లేకపోతే అది సాధ్యమయ్యేది కాదు. ఇది శ్రమ ద్వారా వచ్చినది. కష్టే ఫలి.

శామ్యూల్ రూథర్‌ఫోర్డ్ మాట్లాడుతూ, తనను శ్రమల సెల్లార్లో పడవేసినప్పుడు, గొప్ప రాజు తన వైన్‌ను ఎల్లప్పుడూ అక్కడే ఉంచాడని గుర్తు చేసుకున్నాడు. చార్లెస్ స్పర్జన్ ఇలా అన్నాడు, “బాధల సముద్రంలో మునిగిపోయే వారు అరుదైన ముత్యాలను తెస్తారు.”

క్యాన్సర్ వలన గొప్ప నొప్పిని మీరు అనుభవించినప్పుడు మీరు మీ ప్రియమైన వారిని ఎక్కువగా ప్రేమిస్తారా లేదా? మనం నిజంగా వింత జీవులం. ప్రేమించడానికి మనకు ఆరోగ్యం, సమాధానం మరియు సమయం ఉంటే, మన ప్రేమ తొందరపాటుగా ఉంటుంది. కానీ మనం మరణ శయ్యపై ఉన్నప్పుడు, ఆ ప్రేమ లోతైనదిగా, వివరించలేని ఆనందంగా మారుతుంది మరియు దానిని వదులుకోవడాన్ని మనం భరించలేము.కాబట్టి సహోదర సహోదరీలారా, “మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి.” (యాకోబు 1:2).

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...