అంతిమంగా మీరు ఓడిపోరు

అంతిమంగా మీరు ఓడిపోరు

షేర్ చెయ్యండి:

“అందుకు పిలాతు కావలివారున్నారుగదా మీరు వెళ్లి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను”. (మత్తయి 27:65)

యేసు మరణించి సమాధి చేయబడి, ఆ సమాధిని పెద్ద రాయితో కప్పిన తరువాత, పరిసయ్యులు పిలాతు దగ్గరికి వచ్చి ఆ రాయిని బద్రపరచమని అడుగుతారు.

వారు చేయాల్సినదంతా చేశారు కానీ అంత వృధానే.

అప్పడు నిరాశే, ఇప్పుడు నిరాశే, భవిష్యత్తులో కూడా నిరాశే. వారు ఎన్ని ప్రయత్నాలు చేసిన యేసును అక్కడ ఉంచలేరు. వారు ఆ సమాధిలో ఉంచలేరు.

తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు: ఆయనను బలవంతంగా లోపల పెట్టలేదు కాబట్టి ఆయన చాలా సులువుగా బయటికి రాగలుగుతారు. ఆయన తనను తాను దుర్భాషలకు, వేధింపులకు, అపహాస్యానికి మరియు చుట్టూ తిప్పి చంపడానికి అప్పగించుకున్నాడు.

“నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను; ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను.” (యోహాను 10:17-18)

ఎవరూ ఆయనను పడగొట్టలేదు ఎందుకంటే ఆయనను కొట్టి ఎవరూ క్రింద పడేయలేరు. ఆయన సిద్ధ పడినపుడు ఆయనే తనను తాను అప్పగించుకున్నాడు.

ఆయనను సమాధి చేయడం మంచిపని అని అనుకుంటుండగా, యేసు చీకటిలో ఏదో అద్భుతం చేస్తున్నాడు. “మరియు ఆయన ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి, రాత్రింబగళ్లు నిద్రపోవుచు, మేల్కొనుచు నుండగా, వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది.” (మార్కు 4:26-27).

యేసు పని అయిపోయింది అని మనకింక అడ్డు రాడు అని లోకం అనుకుంటుంది కానీ యేసు చీకటి ప్రదేశాలలో పని చేస్తున్నాడు. “గోధుమగింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చిన యెడల విస్తారముగా ఫలించును” (యోహాను 12:24). ఆయన తనను పాతిపెట్టడానికి అనుమతించాడు – “ఎవడును నా ప్రాణము తీసికొనడు” – మరియు ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు అధికారంలోకి రాగలడు – “దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు”.

“మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను.” (అ.కా 2:24). యేసు నేడు “నాశనములేని జీవమునకున్న శక్తినిబట్టి” తన యాజకత్వాన్ని కలిగి ఉన్నాడు (హెబ్రీయులు 7:15).

ఇరవై శతాబ్దాలుగా, లోకము చేయాల్సినదంతా చేసింది కానీ అంత వృధానే. – ఫలించలేదు. వారు ఆయనను పాతిపెట్టలేరు. వారు ఆయనను పట్టుకోలేరు. వారు ఆయన నోరు మూయలేరు లేదా ఆయనను పరిమితం చేయలేరు. యేసు సజీవంగా ఉన్నాడు. ఆయన ఇష్టపడే చోటికి వెళ్ళడానికి మరియు రావడానికి పూర్తిగా స్వేచ్ఛగా ఉన్నాడు. ఏది ఏమైనా ఆయనను నమ్మండి మరియు ఆయనతో వెళ్లండి. మీరు చివరికి ఓడిపోలేరు.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...