మీ కన్నీళ్లతో మాట్లాడండి
“కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని యేడ్చుచుపోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసికొనివచ్చును”.(కీర్తన 126:5-6)
విత్తనమును విత్తడము బాధాకరమైన విషయము కాదు. పంట కోయడం తప్పించి పెద్ద పని ఏమీ ఉండదు. అవి సుందరమైన రోజులు. కోత కాలమును బట్టి గొప్ప నిరీక్షణ కలిగి ఉంటారు.
అయినప్పటికీ ఈ కీర్తన “కన్నీళ్లు విడుచుచు” విత్తడం గురించి మాట్లాడుతుంది. ఇంకా “యేడ్చుచుపోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసికొనివచ్చును.” అని కీర్తన చెప్తుంది. అసలు ఎందుకు ఏడ్వడం?
విత్తడంలో బాధ ఉండదు. అంత కష్టం కూడా కాదు. విత్తడానికి ఏడవడానికి సంబంధమే లేదు. మన జీవితంలోకి ఎన్ని బాధలు వచ్చి మనల్ని ఏడిపించిన విత్తడమనేది జరగాల్సిందే. మన బాధలు పోయి ఏడుపు ఆపేంతవరకు పంట అయితే ఆగదు. వచ్చే చలికాలంలో మనం తినాలంటే ఎన్ని బాధలున్న మనం కచ్చితంగా పొలంకి వెళ్ళాలి. విత్తనాలు విత్తాలి. అలా చేస్తే, మనకి ఈ కీర్తన ఇచ్చే వాగ్ధానం ఏమిటంటే మీరు “సంతోష గానముతో పంట కోసెదరు” మరియు “సంతోష గానము చేయుచు పనలు మోసికొనివచ్చును”. ఏడుస్తూ విత్తితే సంతోషంతో కోస్తామని కాదు. కేవలం విత్తితే చాలు మనము సంతోషంతో కోస్తాము. మీ కన్నీళ్ళు, విత్తకుండా మిమ్మల్ని ఆపేయాలని శోధిస్తుంటే మీరు ఈ విషయం గుర్తించుకోవాలి.
దీని నుంచి నేర్చుకోవాల్సిన పాఠం: సరళమైన సులభమైన పనులు చేయాల్సి వచ్చినపుడు, మీరు చాలా దుఖంలో ఉన్నారు మరియు కన్నీళ్ళు ఊరికే వచ్చేస్తున్నట్లయితే, మీరు ఆ పనిని కన్నీళ్లతోనే చేయండి. వాస్తవ లోకంలో ఉండండి. మీ కన్నీళ్లతో “కన్నీళ్ళు, నేను నిన్ను అర్ధం చేసుకొంటున్నాను. నువ్వు నా జీవితాన్ని వదిలేయమంటున్నావు. కానీ విత్తవలసిన పొలము ఉంది (తోమవలసిన గిన్నెలున్నాయి, కారు బాగుచేయాలి, ప్రసంగం వ్రాయాలి).”తరువాత దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ఇలా చెప్పండి “కన్నీళ్ళు, నీవు నిరంతరము ఉండేదానవు కాదు అని తెలుసు. నిజమేమంటే, ఏదిఏమైనా నేను నా పని చేస్తాను. అంతిమంగా నేను పంట కోస్తాను. కాబట్టి, నీవు తప్పదు అనుకుంటే రా. కానీ నేను ఏమీ నమ్ముతానంటే -నేను ఇప్పుడే చూడనప్పటికి లేదా సంపూర్ణముగా అనుభవించనప్పటికి – నేను విత్తితే పంట కోతలను తెస్తుందని, నా కన్నీళ్లు ఆనందంగా మారుతాయి అని నమ్ముతాను.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Powered By ABNY Web