ఆయన కీర్తి కోసం ప్రార్థించండి

షేర్ చెయ్యండి:

“కాబట్టి మీరీలాగు ప్రార్థించండి: ‘పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక.” (మత్తయి 6:9)

దేవుడు “తన నామము నిమిత్తము” పనులు చేస్తాడని పదుల సంఖ్యలో లేఖనాలు చెబుతున్నాయి.

తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించు చున్నాడు. (కీర్తన 23:3)

యెహోవా, నా పాపము బహు ఘోరమైనది నీ నామమునుబట్టి దానిని క్షమించుము. (కీర్తన 25:11)

“అయినను తన మహా పరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమునుబట్టి వారిని రక్షించిరి” (కీర్తన 106:8)

నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాము. (యెషయా 48:9)

ఆయన నామమునుబట్టి మీ పాపములు క్షమింపబడినవి (1 యోహాను 2:12)

ఆ ప్రకటనలన్నింటిలో (మరియు అలాంటివి అనేకం) దేవుని హృదయాన్ని నిజంగా కదిలించేది ఏమిటని మీరు అడిగితే, దేవుడు తన పేరును తెలుసుకోనెలా చేయడం మరియు ఘనపరిచేలా చేయడంలో సంతోషిస్తాడనేది సమాధానం.

ప్రార్థించదగిన మొదటి మరియు అతి ముఖ్యమైన ప్రార్థన, “నీ నామము పరిశుద్ధపరచబడుగాక”. ఇది ఒక ప్రశంస అని నేను అనుకునే వాడిని. ఉదాహరణకు, “హల్లెలూయా! ప్రభువు నామము పరిశుద్ధపరచబడుగాక!” కానీ ఇది ప్రశంస కాదు. ఇది ఒక ప్రార్థన. నిజానికి ఒక రకమైన ఆదేశం. ప్రభువా, అలా జరిగేలా అనుమతించండి! అలా జరిగేలా చేయండి. నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఇది నా విన్నపం, నా ప్రార్థన. నేను మిమ్మల్ని ఇలా కోరుతున్నాను: ప్రజలు మీ పేరును పరిశుద్ధ పరిచేలా చేయండి. నీ పేరును నేను పరిశుద్ధ పరిచేలా చేయండి.

ఎక్కువ మంది ప్రజలు తన పేరును “పవిత్ర” పరచడాన్ని దేవుడు ఇష్టపడతాడు. అందుకే ఆయన కుమారుడు క్రైస్తవులకు అలా ప్రార్థన చేయమని బోధించాడు. నిజానికి, దానిని మొట్టమొదటిది మరియు ప్రధానమైన ప్రార్థనగా యేసు చెప్పాడు. ఎందుకంటే ఇది తండ్రి యొక్క మొట్టమొదటి మరియు గొప్ప అభిరుచి.

“ప్రభువా, మీ పేరును ఎక్కువ మంది ప్రజలు పరిశుద్ధ పరిచేలా చేయండి,” అంటే మీ పేరును గౌరవించడం, ఆరాధించడం, పైకెత్తడం, ఘనపరచడం, భయపడటం, ఆనందించడం మరియు స్తుతించడం. ఎక్కువ మంది వ్యక్తులు! కాబట్టి, ఇది ప్రాథమికంగా మిషనరీ ప్రార్థన అని మీరు చూడవచ్చు.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...