ఒకరినొకరు సంతోషంగా ప్రేమించండి
“మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతే గదా యెహోవా నిన్నడుగుచున్నాడు”. (మీకా 6:8)
మరొక వ్యక్తిని సంతోషపరచడంలోనే ఒక వ్యక్తి ఆనందం సంపూర్తిచేయబడుతుందని చెప్పినంత మాత్రాన ఏ ఒక్కరూ ప్రేమించబడకుండ ఉండిపోరు. దయగల కార్యం నన్ను సంతోషపెడుతుందని చెప్పినప్పుడు నేను స్వార్థపరునిగా ఎంచబడను. వాస్తవానికి, ప్రేమతో చేసిన పనులు మనస్ఫూర్తిగా చేయబడినప్పుడు మాత్రమే అవి నిజమైనవి.
అహిష్టతకు మంచి ప్రత్యామ్నాయం తటస్థంగానో, బాధ్యతాయుతంగానో ఉండటం కాదు గాని సంతోషంగా ఉండటం. ప్రేమకున్న నిజమైన మనస్సు ఏంటంటే కనికరాన్ని ప్రేమించడం (మీకా 6:8); ఇది కనికరాన్ని మాత్రమే చూపించదు. ఈ సత్యాన్ని పరిగణనలోనికి తీసుకోవాలని క్రైస్తవ సుఖం (Christian Hedonism) బలవంతం చేస్తోంది.
మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దానివలననే యెరుగుదుము. మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టినవారందరును లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. (1 యోహాను 5:2-4).
ఈ మాటల్ని వెనకి నుండి ముందుకి (రివర్స్ ఆర్డర్లో) చదివి, అప్పుడు లాజిక్కును గమనించండి. మొదటిగా, దేవుని ద్వారా పుట్టినవారికి లోకాన్ని జయించే శక్తి ఇవ్వబడి ఉంటుంది. ఇది దేవుని ఆజ్ఞలు భారమైనవి కావనే మాట కోసం ఆధారంగా ఇవ్వబడింది.
కాబట్టి, దేవుని మూలముగా పుట్టడం అనేది దేవుని చిత్తాన్ని జరిగించడానికి లోకాన్ని అసహ్యించుకునే శక్తిని ఇస్తుంది. అప్పుడు ఆయన ఆజ్ఞలు “భారమైనవిగా” ఉండవు మన ఆశలు మరియు హృదయాభిలాషలు భారమైనవిగా ఉంటాయి. ఇదే దేవుని ప్రేమంటే: మనం ఆయన ఆజ్ఞలను పాటించడం మాత్రమే కాదు గాని అవి భారమైనవిగా కూడా ఉండవు.
ఆ తర్వాత, దేవుని పిల్లల కోసం మనం కలిగి ఉండే నిజమైన ప్రేమకు ఆధారం దేవుని ప్రేమయే అని 2వ వచనంలో చెప్పబడింది. దేవుని పిల్లల కోసం మనం కలిగి ఉండే ప్రేమ గురించి ఇది మనకేమి బోధిస్తోంది?
దేవునిపట్ల మనకున్న ప్రేమ, భారంతో కాకుండా ఆయన చిత్తాన్ని స౦తోష౦గా జరిగిస్తుంది కాబట్టి దేవుని పిల్లలపట్ల మనకున్న నిజమైన ప్రేమకు కొలమాన౦ దేవునిపట్ల మనకున్న ప్రేమే కాబట్టి, దేవుని పిల్లలపట్ల మనకున్న ప్రేమను కూడా ఆహిష్టంగా కాకుండా స౦తోష౦గా వ్యక్తపరచాలి.
ప్రేమను వ్యక్తపరిచే సేవలో క్రైస్తవ సుఖం (Christian Hedonism) సమతుల్యంగా నిలుస్తుంది, ఎందుకంటే అది కేవలం సంతోషకరమైన విధేయతను వ్యక్తపరచడానికే ప్రోత్సహిస్తుంది గానీ అయిష్టమైన విధేయతను వ్యక్తపరచడానికి ప్రోత్సహించదు.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web