సువార్త ప్రకటించడమంటే ఏంటి?
సువార్త ప్రకటించడమంటే, పాపులను రక్షించడానికి యేసు క్రీస్తు చేసిన పనిని ఇతరులకు తెలియజెప్పడమే. సువార్త ప్రకటించడమంటే ఈ క్రింది విషయాలను నీవు వారికి తెలియజెప్పాలి ;
1. దేవుడు పరిశుద్ధుడు (1 యోహాను 1:5). లోకంలో ఉన్న సర్వమును ఆయననే సృష్టించాడు (ఆది 1:1).
2. మనుష్యులందరు పాపులు. గనుక వారు దేవుని యొక్క నీతిమంతమైన, శాశ్వతమైన ఉగ్రతకు పాత్రులై యున్నారు (రోమా 3:10-19, మార్కు 9:48, ప్రకటన 14:11).
3. పూర్తిగా దేవుడు మరియు పూర్తిగా మానవుడైయున్న యేసు క్రీస్తు, ఏ పాపమూ చేయక, లేకుండా, ఎరుగక జీవించినవాడు. ఆయన యందు విశ్వాసముంచు వారందరి బదులుగా దేవుని ఉగ్రతను భరించడానికి సిలువ మీద మరణించాడు. వారందరికి నిత్య జీవమునిచ్చుటకు ఆయన సమాధిలో నుండి లేచాడు (యోహాను 1:1, 1 తిమోతి 2:5, హెబ్రీ 7:26, రోమా 3:21-26, 2 కొరింథీ 5:21, 1 కొరింథీ 15:20-22).
4. శాశ్వతమైన శిక్ష నుండి తప్పించబడి, దేవునితో సమాధానపరచబడాలంటే, మారుమనస్సు పొంది, రక్షింపబడుటకు యేసు క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే మార్గమై యున్నది (మార్కు 1:15, అపొ 20:21).
సువార్త ప్రకటించడమంటే, ఇతరులకు ఈ ప్రాథమిక విషయాలను తెలియజెప్పడమే.

9 మార్క్స్
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Powered By ABNY Web
One comment
Amen hallelujah to God be the glory