మారుమనస్సు పొందడం అంటే ఏమిటి?

మారుమనస్సు పొందడం అంటే ఏమిటి?

షేర్ చెయ్యండి:

మారుమనస్సు పొందడం అనేది ఒకరు వారి జీవితంలో తీసుకున్న ఒక యూ-టర్న్‌ లాంటిదని చెప్పవచ్చు. అంటే ఒకరు రక్షణ కొరకు తన వ్యక్తిత్వమంతటిని పాపము నుండి క్రీస్తు వైపునకు పూర్తిగా మళ్లించడమే. ఉదాహరణకు, విగ్రహాలను ఆరాధించుట నుండి దేవుని ఆరాధించుట, లేదా స్వయం సమర్థింపు నుండి క్రీస్తు సమర్థింపునకు మళ్లడం, లేదా స్వయం పాలన నుండి దేవుని పాలన వైపు మళ్లుట లాంటివన్నమాట.

ఆధ్యాత్మికంగా చచ్చియున్నవారిని దేవుడు మేల్కొల్పి, వారు తమ పాపముల విషయమై మారుమనస్సు పొంది క్రీస్తులో విశ్వసించేలా చేసినప్పుడు జరిగేదే మారుమనస్సు పొందడమై యుంది. 

  • మనం మారుమనస్సు పొంది విశ్వసించాలని యేసు పిలిచినప్పుడు, మనం మార్పునొందాలని ఆయన పిలుస్తున్నాడు. ఇది మనం నమ్మేదానిలో చేసేదానిలో జరిగే సమగ్ర మార్పైయుంది (మార్కు 1:15).
  • మనం మన సిలువనెత్తుకొని ఆయన్ను వెంబడించాలని యేసు పిలిచినప్పుడు, మనం మార్పు చెందాలని ఆయన పిలుస్తున్నాడు (లూకా 9:23).
  • మనం మారుమనస్సు పొందడానికి, దేవుడు మనకు క్రొత్త జీవితాన్ని, క్రొత్త హృదయాన్ని, మరియు క్రొత్త విశ్వాసాన్ని ఇవ్వాలి (ఎఫెసీ 2:1, రోమా 6:17, కొలస్సీ 2:13, యెహె 36:26, ఎఫెసీ 2:8, 2 తిమోతి 2:25).

మారుమనస్సు గురించి మనలో చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇక్కడ చూద్దాం.

1. మారుమనస్సు పొందడం అనేది మనం జీవించే విధానంలో ఎటువంటి మార్పు లేకుండా ఉండేట్లు ప్రోత్సాహించే ఒక్క సారే జరిగే సంఘటన కాదు. ఔను, మారుమనస్సు పొందడం ఒక్క క్షణంలో జరుగుతుంది, మరియు అది సమగ్ర మార్పు జరిగే క్షణమైయుంది. అప్పట్నుంచి జీవితం పూర్తిగా భిన్నమైనదై యుండాలి. అంతే కాకుండా ఆ క్షణం నుండి ఒక కొత్త పోరాటం మొదలవుతుంది.

2. మారుమనస్సు పొందడం గమ్యంలేని ప్రయాణం కాదు. కొందరి విషయంలో మారుమనస్సుకి ముందు ఒక సుదీర్ఘ ప్రక్రియ వారిలో జరుగుతుంది. కాని పాపము గురించి మారుమనస్సు పొంది క్రీస్తునందు విశ్వాసముంచుట, ఎల్లప్పుడు క్రీస్తుకోసం జీవించాలనే కట్టుబాటుతో కూడిన నిర్ణయంగా ఉంటుంది. ఇది దేవుడు ఆత్మసంబంధంగా చచ్చిన పాపికి ఇచ్చిన క్రొత్త జీవితం యొక్క తక్షణ ఫలితమై ఉంది.

3. మారుమనస్సు పొందడం ఐచ్ఛికము (ఆప్షనల్) కాదు. ఇష్టముంటే ఎంచుకోవచ్చు, లేదంటే లేదన్నట్టు ఒకని ఇష్టానికి విడిచిపెట్టబడిన ఎంపిక కాదు. అంతటను, అందరును మారుమనస్సు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడని అపొ. కార్య 17:30 చెప్తుంది. మారుమనస్సు పొందడం ఎప్పుడు బలవంతం చేయడం వలన జరగదు, కానీ రక్షించబడాలంటే ఇది తప్పనిసరియైయుంది.

4. మారుమనస్సు పొందడం ఒక సంభాషణ కాదు. క్రైస్తవులు సువార్తను వినయంతో పంచుకోవాలి. కానీ అది ఇతరులని సంతోషపెట్టాలనే గురితో ఇచ్చిపుచ్చుకొనే సమాచారమై యుండాలనేది మన గురి కాదు. ప్రతి ఒక్కరు రక్షించబడాలి గనుక ప్రతి ఒక్కరు వారి పాపముల గురించి  మారుమనస్సు పొంది క్రీస్తునందు విశ్వాసముంచాలని మనం చెప్పాలి.

5. మారుమనస్సు పొందడం ఒక ప్రార్థనను వల్లించడం కాదు. మారుమనస్సు పొందినప్పుడు తప్పనిసరిగా ప్రార్థిస్తాము, ప్రార్థించాలి; కానీ, వాళ్లు ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా ఇవే పదాలను లేదా ఈ వాక్యాలనే పలకాలని వారిని శోధించకుండా మనం జాగ్రత్తపడాలి.

బ్రాడ్ వీలర్

బ్రాడ్ వీలర్

బ్రాడ్ వీలర్ అర్కాన్సాస్‌లోని ఫాయెట్‌విల్ లోని యూనివర్శిటీ బాప్టిస్ట్ చర్చి యొక్క సీనియర్ పాస్టర్.

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...