మనకు లోతైన రెండు అవసరాలు 

 మనకు లోతైన రెండు అవసరాలు 

షేర్ చెయ్యండి:

మన తండ్రియైన దేవునియందును ప్రభువైన యేసు క్రీస్తునందును ఉన్న థెస్సలొనీకయుల సంఘమునకు. (2 థెస్స 1:1)

ఒక సంఘంగా మనం తండ్రి”యందును” మరియు ప్రభువు”నందును” ఉన్నాము. అంటే ఏమిటి?

“తండ్రి” అనే పదం సంరక్షణ, పోషణ, భద్రత, సదుపాయం మరియు క్రమశిక్షణను సూచిస్తుంది. కాబట్టి, తండ్రి”యందు” ఉండడం అంటే ప్రధానంగా మన పరలోకపు తండ్రియైన దేవుని సంరక్షణలో మరియు భద్రతలో ఉండడం.

మరొక హోదా ప్రభువు: మనము ప్రభువైన యేసుక్రీస్తునందు ఉన్నాము. “ప్రభువు” అనే పదం ప్రధానంగా అధికారం, నాయకత్వం మరియు యాజమాన్యాన్ని సూచిస్తుంది. కాబట్టి, ప్రభువు”లో” ఉండడమంటే ప్రధానంగా సర్వోన్నత ప్రభువైన యేసు ఆధీనంలో ఉండడం, అధికారం కింద ఉండడం మరియు ఆయన సొత్తుగా ఉండడం.

కాబట్టి, థెస్సలొనీక సంఘం వారు ఒక కుటుంబమని (తండ్రి సంరక్షణలో ఉన్నారని) మరియు సేవకులు అని (ప్రభువు ఆధీనంలో ఉన్నారని) వారికి గుర్తుచేసే విధంగా పౌలు వారిని పలకరించాడు. దేవుణ్ణి తండ్రిగా, ప్రభువుగా మరియు సంఘమును కుటుంబంగా, సేవకులుగా వర్ణించే వర్ణన మన లోతైన అవసరాలకు చాలిన వర్ణనలుగా ఉన్నాయి.

మనలో ప్రతి ఒక్కరికి ఒకవైపు రక్షణ మరియు సహాయం  అవసరం, మరోవైపు ఉద్ధేశ్యం మరియు అర్థం అవసరం.

1. మనపై జాలి చూపడానికి, పాపం మరియు దుఃఖం నుండి మనలను రక్షించడానికి మనకు పరలోకపు తండ్రి అవసరం. మనకు అడుగడుగునా ఆయన సహాయం కావాలి, ఎందుకంటే మనం చాలా బలహీనులుగా మరియు దాడికి అనువైన వారముగా ఉన్నాము.

2. మనకు జీవితంలో మార్గనిర్దేశం చేసేందుకు, జ్ఞానయుక్తమైన వాటిని చెప్పడానికి, దేవుడు మనలను సృష్టించిన ఉద్ధేశ్యాలను నెరవేర్చడానికి మరియు ఉనికికి కారణాన్ని అందించడానికి మనకు గొప్ప, అర్థవంతమైన బాధ్యతను ఇవ్వడానికి కూడా మనకు పరలోక ప్రభువు అవసరం. మనం తండ్రి సంరక్షణలో సురక్షితంగా ఉండాలని కోరుకోవడం మాత్రమే కాదు – అది విలువైనది మరియు అవసరమైనది. మనం జీవించడానికి అద్భుతమైన కారణం కూడా కావాలి.

దయగల తండ్రి మన రక్షకునిగా ఉండాలని మనం కోరుకుంటున్నాము. సర్వశక్తిమంతుడైన ప్రభువు మన విజేతగా మరియు మన కమాండర్‌గా మరియు ఏదైనా గొప్ప పనిలో మన నాయకుడిగా ఉండాలని మనం కోరుకుంటున్నాము. కాబట్టి, పౌలు 1వ వచనంలో, మీరు “తండ్రియైన దేవునియందును ప్రభువైన యేసు క్రీస్తునందును” ఉన్న సంఘమని అని చెప్పినపుడు, దేవుడు మన తండ్రి కాబట్టి మనం విశ్రాంతి తీసుకోవచ్చు మరియు ఆయన నుండి సహాయం పొందవచ్చు. యేసు మన ప్రభువు కాబట్టి మనం ఆయన నుండి ధైర్యం మరియు అర్థాన్ని తీసుకోవచ్చు. 

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...