నీవు మీ సంఘాన్ని విడిచి పెట్టాలనుకుంటున్నట్లయితే …

నీవు మీ సంఘాన్ని విడిచి పెట్టాలనుకుంటున్నట్లయితే …

షేర్ చెయ్యండి:

విడిచిపెట్టాలని నీవు నిర్ణయించుకొనక ముందు … 

1. ప్రార్థించు. 

2. నీవు మరొక సంఘంలో చేరక ముందు లేదా మరొక స్థలానికి వెళ్లాలని నిర్ణయించుకొనక ముందు, ఈ ఆలోచనను మీ సంఘ కాపరికి తెలియజేయు. ఆయన సలహా తీసికో! 

3. నీవు ఎందుకీ పని చేయాలనుకుంటున్నావో మరొకసారి ఆలోచించు. పాపభూయిష్టమైన, వ్యక్తిగత ఘర్షణ లేదా నిరాశ ఇందుకు కారణమా? ఒకవేళ, సిద్ధాంతపరమైన కారణాలైతే, అవి అంత ముఖ్యమా? ఆలోచించు.

4. సంఘంలో ఇతర విశ్వాసులతో నీ సంబంధాలు చెడిపోతే, సమాధానపడటానికి నీ శాయశక్తులా ప్రయత్నించు. 

5. సంఘ జీవితంలో నీవు గమనించిన లేదా అనుభవించిన ‘‘దేవుని కృప గూర్చిన రుజువుల’’ గూర్చి మరొకసారి తప్పక ఆలోచించు. ఇట్టి కృపాకార్యాలు నీకు ఒక్కటైనా కనబడనట్లయితే, మరొక సారి నీ సొంత హృదయాన్ని పరీక్షించుకో  (మత్తయి 7:3-5). 

6. వినయమనసు కలిగి ఉండు: వాస్తవాలన్నీ నీకు తెలియవనే విషయాన్ని గుర్తుంచుకో. గనుక సంఘ సభ్యులనైతేనేమి, పరిస్థితులనైతేనేమి పరోపకార లక్షణంతో మరొకసారి పరిశీలించు. నీవు తెలిసికోవాల్సిన విషయాలు ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూడు.

నీవు సంఘాన్ని విడిచి వెళ్లిపోయినట్లయితే … 

1. సంఘాన్ని చీల్చకు. 

2. నీకు ఎక్కువ దగ్గరగా ఉండే స్నేహితుల మధ్య అసంతృప్తి విత్తబడకుండా మరి ఎక్కువ జాగ్రత్త తీసికొనుము. వారు ఈ సంఘం పట్ల దేవుడు చేయుచున్న కృపాకార్యాల్లో వారు ఎదగడాన్ని నీవు ఆటంకపరచవద్దని జ్ఞాపకముంచుకో! కొండెములు చెప్పొద్దు (గాసిప్ చెయ్యొద్దు). కొన్నిసార్లు ఇది, ‘‘బాధనంతా వెల్లగ్రక్కుట’’ అనీ, ‘‘నీ బాధేంటో నీవు చెప్తున్నావని’’ అంటుంటారు.

3. సంఘం కొరకు, కాపరి కొరకు, నాయకత్వం కొరకు ప్రార్థించుము, దీవించుము. ఈ పనులను ఆచరణాత్మకంగా చేయగల మార్గాలు వెతుకు! ఏ విషయంలోనైనా నీ మనస్సు గాయపడినట్లయితే, నీవు క్షమింపబడినట్లే నీవు కూడ క్షమించుము.

మార్క్‌ డెవర్‌

మార్క్‌ డెవర్‌

మార్క్‌ డెవర్‌ వాషింగ్టన్ D. C.లోని కాపిటల్ హిల్ బాప్టిస్ట్ చర్చి యొక్క సీనియర్ పాస్టర్ మరియు 9మార్క్స్ అధ్యక్షుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...