దేవా, మా హృదయాలను ప్రేరేపించండి 

దేవా, మా హృదయాలను ప్రేరేపించండి 

షేర్ చెయ్యండి:

“సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్లిపోయెను. దేవునిచేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్లిరి”. (1 సమూయేలు 10:26)

ఈ వాక్యంలో ఏమి చెప్పబడుతుందో ఒక్కసారి ఆలోచించండి. దేవుడు వారిని ప్రేరేపించాడు. భార్య కాదు. పిల్లవాడు కాదు. తల్లిదండ్రులు కాదు. కౌన్సిలర్ కాదు. కానీ దేవుడే వారిని ప్రేరేపించాడు.

విశ్వంలో అనంతమైన శక్తి కలవాడు. అనంతమైన అధికారం, అనంతమైన జ్ఞానం, అనంతమైన ప్రేమ, అనంతమైన మంచితనం, అనంతమైన స్వచ్ఛత మరియు అనంతమైన న్యాయం కలిగిన వ్యక్తి. ఆయనే వారి హృదయాన్ని ప్రేరేపించాడు.

గురు గ్రహం చుట్టుకొలత అణువు యొక్క అంచుని ఎలా తాకుతుంది మరియు దాని కేంద్రకంలోకి అది మాత్రమే చొచ్చుకుపోయేలా చేసింది?

కేవలం దేవుడు ప్రేరేపించాడు అని కాదు గాని అది ప్రేరేపణ అయినందున దేవుని ప్రేరేపణ అద్భుతమైనది. ఇది నిజమైన సంబందం. ఇది హృదయానికి సంబంధించింది అనేది అద్భుతం. అది దేవుని ప్రమేయం కలిగి ఉండటం అద్భుతం. మరియు ఇది నిజమైన టచ్ కలిగి ఉండటం అద్భుతం.

శూరులుతో కేవలం మాట్లాడలేదు. వారు కేవలం దైవిక ప్రభావంతో ఊగిపోలేదు. వారిని కేవలం చూడటం  మరియు తెలిసికోవడమే కాదు. దేవుడు, అనంతమైన దయతో, వారి హృదయాలను హత్తుకున్నాడు. దేవుడు అంత దగ్గరగా ఉన్నాడు. మరియు వారు నాశనం కాలేదు.

ఆ ప్రేరేపణ నాకు చాలా ఇష్టం. నాకు అది మరింత ఎక్కువ కావాలి. నా కోసం మరియు మీ అందరి కోసం. దేవుడు తన మహిమతో మరియు తన మహిమ కోసం నన్ను మళ్లీ తాకాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆయన మనందరినీ ప్రేరేపించాలని నేను ప్రార్థిస్తున్నాను.

దేవుని స్పర్శ కోసం! అది నిప్పుతో వస్తే, అలాగే వచ్చును గాక! అది నీళ్లతో వస్తే, అలాగే వచ్చును గాక!. గాలితో వస్తే అలాగే వచ్చును గాక!. ఉరుములు, మెరుపులతో వస్తే దాని ముందు తలవంచుదాం.

ఓ ప్రభువా, రండి. దగ్గరికి రండి. మౌనంగా మరియు చిన్నగా రండి. ఎంత దూరమైన రండి. మా హృదయాలను తాకండి.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...