ప్రేమను బంధించేది ఏది?

ప్రేమను బంధించేది ఏది?

షేర్ చెయ్యండి:

“పరలోకమందు మీకొరకు ఉంచబడిన నిరీక్షణనుబట్టి, క్రీస్తుయేసునందు మీకు కలిగియున్న విశ్వాసమునుగూర్చియు, పరిశుద్ధులందరిమీద మీకున్న ప్రేమనుగూర్చియు, మేము విని యెల్లప్పుడు మీ నిమిత్తము ప్రార్థనచేయుచు, మన ప్రభువగు యేసు క్రీస్తుయొక్క తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మీయొద్దకు వచ్చిన సువార్త సత్యమునుగూర్చిన బోధవలన ఆ నిరీక్షణనుగూర్చి మీరు ఇంతకుముందు వింటిరి.” (కొలొస్స 1:3-5)

నేటి సంఘంతో ఉన్నటువంటి సమస్య పరలోక ప్రేమలో అనేకమంది పడ్డారనేది కాదు. క్రైస్తవులని చెప్పుకుంటున్నవారు లోకం నుండి వెనుదిరిగి, కొన్ని రోజులను లేఖనాలను చదవడానికి, మరికొన్ని రోజులను పాటలు పాడుతూ దేవునిలో ఆనందించడానికి, లోక అవసరాలను తీర్చుకోవడానికి సమయాన్ని వెచ్చించడం అనేది కూడా సమస్య కాదు. వాస్తవానికి అలాంటివి జరగడమూ లేదు! దేవుని ప్రజలు తమకివ్వబడిన రోజులలో కొన్ని రోజులు సహితం ఆయన వాక్యంలో వెచ్చించేంతగా దేవుని ప్రేమలో లేరన్నది సమస్య.

అసలు సమస్యంతా, క్రైస్తవులమని చెప్పుకునేవారు ఒక రోజులో పది నిమిషాలు లేఖనాలను చదవడానికి వెచ్చించి, కొంత సమయాన్ని డబ్బును సంపాదించుకోవడానికి, మిగిలిన సమయమంతా ఆ డబ్బు ద్వారా కొన్నవాటిని ప్రేమించడానికి, వాటిని సరిచేసుకోవడానికి వెచ్చించడమే.

ఈ లోకంలో బాధనొందిన, నశిస్తున్నవారి కోసం ప్రేమను పంచడానికి అడ్డుకునేది కాదు పరలోకపు మనస్తత్వం. ప్రేమను పంచడాన్ని అడ్డుకునేది ఈ లోకపు మనస్తత్వం, వారాంతంలో చేసే భక్తి ముసుగులో కూడా ఇది ప్రేమను పంచటాన్ని అడ్డుకుంటోంది.

ఈ భూమి మీద ఒక యాత్రికునిగా, పరదేశిగా ఉన్నానని భావించి, వాగ్దానం చేయబడిన పరలోకపు మహిమ యొక్క ప్రేమలో అత్యాసక్తితో కూడిన హృదయం కలిగిన వ్యక్తి ఎక్కడున్నాడు? ఈ లోక సంపదలను అతి చిన్నవిగా ఎంచి, వినోదం వ్యర్థమైనదని తలంచి, నిత్యత్వాన్ని గురించి ఈ లోకపు నైతిక తత్వాలకు ఎటువంటి దృష్టికోణం లేనందున అవి బహు అల్పమైనవని భావించి, రాబోవు అందమైన యుగాన్ని రుచి చూసిన వ్యక్తి ఎక్కడున్నాడు? ఇలాంటి వ్యక్తి ఎక్కడున్నాడు?

ఖచ్చితంగా చెప్పాలంటే, ఇలాంటి వ్యక్తి ఇంటర్నెట్టుకి, నిద్రకు, తినడానికి, త్రాగడానికి, పార్టీలకు, చేపలు పట్టడానికి, పడవ ప్రయాణాలు చేయడానికి, పిచ్చి తిరుగుళ్ళు తిరగడానికి బానిసగా ఉండడు. విదేశంలో అతను స్వతంత్రుడై ఉంటాడు. నేను ఈ భూమి మీద పరదేశిగా ఉన్నప్పుడు నిత్యత్వం కోసం దేవునిలో ఉండే నా ఆనందాన్ని ఎలా ఎక్కువ చేసుకోవాలి? అనే ప్రశ్నను కలిగి ఉంటాడు. ఆ ప్రశ్నకు అతనిచ్చే జవాబు ఏంటంటే ప్రేమ సంబంధమైన పనులను జరిగించుట ద్వారా దేవునిలో తనకుండే ఆనందాన్ని ఎక్కువ చేసుకుంటాడు. ఏది ఏమైనా, దేవునిలో నాకుండే ఆనందాన్ని ఎక్కువ చేసుకోవడం ద్వారా, సాధ్యమైనంతవరకు నేను ఆ ఆనందంలో ఇతరులను చేరుస్తూనే ఉంటాను.

పరలోకానికి సంబంధించిన కార్యాలను జరిగించుట ద్వారానే పరలోకంలో తమ నిధిని కలిగియున్నవారి హృదయాన్ని తృప్తిపరుస్తుంది. పరలోకం అంటే ప్రేమ ప్రపంచం!

ప్రేమను బంధించి, దానిని పనిచేయనికుండ చేసేది పరలోకానికి సంబంధించిన విషయాలు కాదు. ప్రేమను బంధించే స్వార్థపూరితమైన గుణలక్షణాలు ఏంటంటే ధనాపేక్ష (డబ్బు మీద ఆశ), స్వతంత్రం, సుఖం మరియు పొగడ్త. ఈ గుణలక్షణాలను చంపేది ఒక క్రైస్తవ నిరీక్షణ మాత్రమే. “పరలోకమందు మీకొరకు ఉంచబడిన నిరీక్షణనుబట్టి, క్రీస్తుయేసునందు మీకు కలిగియున్న విశ్వాసమునుగూర్చియు, పరిశుద్ధులందరిమీద మీకున్న ప్రేమనుగూర్చియు, మేము విని యెల్లప్పుడు మీ నిమిత్తము ప్రార్థనచేయుచు, మన ప్రభువగు యేసు క్రీస్తుయొక్క తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మీయొద్దకు వచ్చిన సువార్త సత్యమునుగూర్చిన బోధవలన ఆ నిరీక్షణనుగూర్చి మీరు ఇంతకుముందు వింటిరి” (కొలొస్స 1:4-5).

ఈ భూమి మీద ప్రేమకు ఆటంకంగా ఉండేది పరలోకపు మనస్తత్త్వం కాదు గాని ఈ లోకపు మనస్తత్వమేనని నేను మనస్సు పూర్తిగా మరొకమారు చెప్తున్నాను. ఇది లౌకిక మనస్తత్వం. అందుచేత, గొప్పగా ఊరెడి ప్రేమ అంటే క్రైస్తవ నిరీక్షణ యొక్క శక్తివంతమైన, స్వేచ్చతో కూడిన నిశ్చయతయే.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...