కొంత మంది “సువార్త” అని తప్పుగా బోధించే కొన్ని సందేశాలు ఏమిటి?

కొంత మంది “సువార్త” అని తప్పుగా బోధించే కొన్ని సందేశాలు ఏమిటి?

షేర్ చెయ్యండి:

1. దేవుడు మనలను ఐశ్వర్యవంతులనుగా చేయాలని ఆశిస్తున్నాడు

మనము ఆయన్ని అడగాలేగాని, దాచుకోడానికి స్థలం, చాలనంతటి ధనం, అమ్మితే అంతే ధనాన్ని తెచ్చిపెట్టే ఆస్తిపాస్తులతో మనలను ఆశీర్వదించాలని దేవుడు కోరుతున్నాడంటూ ఈనాడు కొందరు బోధకులు చెప్తుంటారు!  కాని సువార్త ఆత్మసంబంధమైన ఆశీర్వాదముల గూర్చిన సందేశమై యున్నది (ఎఫెసీ 1:3). మనము నీతిమంతులముగా తీర్చబడునట్లు, దేవునితో సమాధానపరచబడునట్లు, సదాకాలము దేవునితో ఉండడానికి నిత్యజీవము నిచ్చుటకును మన కొరకు మరణించి, తిరిగి లేచుటకు దేవుడు యేసు క్రీస్తును పంపించాడు (రోమా 3:25-26; 6:23; 2 కొరింథీ. 5:18-21). అంతమాత్రమేగాక, క్రైస్తవులు ఈ జీవితంలో భౌతిక శ్రేయస్సు కొరకు కాదు గాని, ఒకానొక దినాన చెప్పశక్యముకాని మహిమను ఇచ్చే వాటన్నిటి కొరకు  (2 కొరింథీ 4:18; రోమా 8:18), అనేక శ్రమలను (అపొ 14:22) మరియు హింసను (2 తిమోతి 3:12) కలిగియుంటారని బైబిలు వాగ్దానమిస్తుంది.

2. దేవుడు ప్రేమయై యున్నాడు గనుక మనము ఎలా ఉన్న పర్వాలేదు

దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు గనుక మనం ఎలా ఉన్నా అంగీకరిస్తాడనేది సువార్తయై యున్నదని కొందరనుకుంటారు. కాని మనుష్యులు దేవుని ఉగ్రతను ఎదుర్కొనుచున్న పాపులైయున్నారని బైబిలు ప్రకారమైన సువార్త సెలవిస్తూ (రోమా 3:23; యోహాను 3:36), దేవుని సమగ్రమైన పరిష్కారము గూర్చి ప్రజలకు తెలియజేస్తుంది. అదేమంటే, మానవాళి పాప ప్రాయశ్చిత్తం కోసం యేసు సిలువలో మరణించాడు. ఇలా పరిష్కారాన్ని చూపిస్తున్న సువార్త, అదే రీతిగా సమగ్రంగా మనం ప్రతిస్పందించాలని  పిలుపునిస్తుంది. ఆ పిలుపేమంటే, వారు తమ పాపముల గూర్చి మారుమనస్సు నొంది రక్షణ కోసం క్రీస్తునందు విశ్వసించాలి. 

3. మనము సరిగా జీవించాలి

సువార్త అనేది మనం మంచిగా జీవించి దాని ద్వారా మనలను మనం దేవునితో సరిచేసుకోవచ్చని మనకు తెలియజెప్పుతున్న సందేశం కాదు. వాస్తవానికి, సువార్త సరిగ్గా ఇందుకు వ్యతిరేకమైన విషయాన్ని తెలియజేస్తుంది. ఏమని అంటే, దేవునికిష్టమైన దానిని మనము చేయజాలము గనుక ఆయన మనలను అంగీకరించేట్టు మనలను మనము ఎన్నడూ చేసుకోలేము (రోమా 8:5-8). కాని, మనకై మనం ఎప్పటికీ చేయజాలని దానిని యేసు చేశాడనేది శుభవార్త. ఆయన పరిపూర్ణమైన జీవితం జీవించి, సిలువలో దేవుని ఉగ్రతను భరించడం ద్వారా వారి పాపములను విడిచిపెట్టి ఆయన యందు విశ్వసించు వారందరికి రక్షణ తెచ్చుటతో దానిని చేశాడు (రోమా 5:6-11; 8:31-34).

4. యేసు మన సమాజాన్ని మార్చడానికి వచ్చాడు

యేసు సమాజాన్ని మార్చి, రాజకీయ విప్లవం ద్వారా అణగద్రొక్కబడుతున్నవారికి న్యాయం చేయాలనే పెద్ద పని మీదనే వచ్చాడని కొందరు నమ్ముతున్నారు. కాని, యేసు మళ్లీ వచ్చి, క్రొత్త ఆకాశమును, భూమిని సృష్టించినప్పుడే ఈ లోకం సరిచేయబడుతుందని బైబిలు బోధిస్తున్నది (2 థెస్స 2:9-10; ప్రకటన 21:1-5). సువార్త అనేది ప్రధానంగా క్రీస్తులో నమ్మకముంచుట ద్వారా దేవుని ఉగ్రత్త నుండి దొరికే రక్షణ సందేశమై యున్నది. అంతేగాని, ఈ యుగంలో సమాజాన్ని మార్చడం కాదు.

మార్క్‌ డెవర్‌

మార్క్‌ డెవర్‌

మార్క్‌ డెవర్‌ వాషింగ్టన్ D. C.లోని కాపిటల్ హిల్ బాప్టిస్ట్ చర్చి యొక్క సీనియర్ పాస్టర్ మరియు 9మార్క్స్ అధ్యక్షుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...