డబ్బును ప్రేమించడమంటే ఏంటి?
“ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము…” (1 తిమోతి 6:10)
పౌలు ఈ విధంగా వ్రాసినప్పుడు ఆయనకున్న ఉద్దేశమేంటి? మీరు పాపం చేసినప్పుడంతా మీ మనస్సులో డబ్బు ప్రేమ ఉంటుందని, మనం డబ్బు గురించి ఆలోచించనప్పుడు కూడా పాపం జరుగుతూనే ఉంటుంది ఆయన చెప్పడం లేదు.
నా సలహా ఏంటంటే ఈ లోకంలో సమస్త కీడులన్నీ డబ్బును ప్రేమించే ఒక విధమైన, ఒక నిర్దిష్ట హృదయం నుండి వస్తాయని ఆయన చెప్తున్నాడు.
మరి అలాంటప్పుడు, డబ్బును ప్రేమించడం అంటే ఏంటి? ఆకుపచ్చ కాగితాన్ని, రాగి నాణేలను, వెండి దేనారములను ఆరాధించడం కాదు. డబ్బును ప్రేమించడం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే డబ్బు అంటే ఏంటి అని మీరు అడగాలి. ఆ ప్రశ్నకు, డబ్బు అనేది మానవ వనరులకు ఉపయోగించుకునే ఒక ప్రతీక మాత్రమే అని నేను జవాబిస్తాను. డబ్బు అంటే మీరు దేవుడి నుండి పొందుకునేందుకు బదులుగా ఇతర మనుష్యుల నుండి పొందుకోగలిగినదానిని సూచిస్తుంది.
దేవుడు కృపా కరెన్సీలో నడుచుకుంటాడు గాని డబ్బులో కాదు: “దప్పిగొనినవారలారా, నీళ్లయొద్దకు రండి రూకలులేనివారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి” (యెషయా 55:1). డబ్బు అనేది మానవ వనరుల కరెన్సీ. కాబట్టి, డబ్బును ప్రేమించే హృదయం దాని ఆశలను నెరవేర్చే, దాని నుండి కలిగే సుఖాలను కొనసాగించే మరియు మానవ వనరులు అందించగలిగే వాటిపై తనకున్న నమ్మకాన్ని ఉంచే హృదయమై ఉన్నది.
అందుచేత, డబ్బును ప్రేమించడం అనేది దాదాపు డబ్భుపై ఉంచిన నమ్మకానికి సమానంగానే ఉంటుంది, అంటే డబ్బు మీ అవసరాలను తీర్చి, మిమ్మల్ని సంతోష పెట్టే నమ్మకంగానే (నమ్మకం, నిశ్చయత, భరోసా) ఉంటుంది.
డబ్బును ప్రేమించడం అనేది దేవుని భవిష్యత్తు కృపలో విశ్వాసముంచడానికి ప్రత్యామ్నాయం. ఇది భవిష్యత్తులో కావాల్సిన మానవ వనరులలో విశ్వాసముంచడం, అంటే మీరు డబ్బుతో దేనినైనా సంపాదించుకోవచ్చు, లేక భద్రత కలిగియుండవచ్చనే నమ్మకాన్ని కలిగియుండడం. అందుచేత, డబ్బును ప్రేమించడం, లేక డబ్భులో నమ్మకం ఉంచడం అనేది దేవుని వాగ్దానాలలో అపనమ్మకానికి మూలం అవుతుంది. అందుకేనేమో యేసు, “ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించి యొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు” అని మత్తయి 6:24లో చెప్పాడు.
మీరు ఒకే సమయంలో దేవుణ్ణి, డబ్బును నమ్మలేరు. ఒకదాన్ని నమ్మి, మరొకదాన్ని నమ్మలేరు. డబ్భును ప్రేమించే హృదయం, అంటే సంతోషం కోసం డబ్బు మీద ఆధారపడే హృదయం, మన ఆత్మలను (అంతరంగాన్ని) తృప్తిపరిచే యేసులోనే మనకు దేవుడున్నాడనే దాని మీద ఆధారపడదు.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Powered By ABNY Web