గర్వానికి నివారణ.

గర్వానికి నివారణ.

షేర్ చెయ్యండి:

నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొనువారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే. కనుక – ప్రభువు చిత్తమైతే మనము బ్రదికి యుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబములయందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది.” (యాకోబు 4:13-16)

యాకోబు భక్తుడు గర్వం, అహంకారాల గురించి మాట్లాడుతూ, అవి మనకు తేటగా కనిపించకుండా ఉంటాయని చెబుతున్నాడు. “మీ డంబములయందు అతిశయపడుతున్నారు, ఇట్టి అతిశయమంతా చాలా చెడ్డది.”

జ్ఞానము, శక్తి మరియు ఐశ్వర్యములు అనే వాటిలో మీపై మీరు ఆధారపడుటకు శోధించబడినప్పుడు, అవి, నాస్తికత్వం అనే అత్యంత తీవ్రమైన అహంకారం వైపుకు మనలను ప్రలోభానికి గురి చేస్తాయి. మన సొంత అంచనాలో అత్యున్నతంగా ఉండటానికి మనకున్న సురక్షితమైన మార్గం ఏంటంటే, మనకు పైన ఉన్న దేనినైనా  తృణీకరించడమే. 

ఇందుచేతనే, గర్విష్ఠులు ఇతరులను చిన్నచూపు చూస్తుంటారు. సి. ఎస్. లూయిస్ గారు “గర్వమున్న వ్యక్తి ఇతరులను, విషయాలను తక్కువ చూపు చూస్తుంటారు: మీరు తక్కువ చూపు చూస్తున్నంత కాలం మీ పైన ఏముందో మీరు చూడలేరు” అని చెప్పారు.

కానీ, అహంకారాన్ని కాపాడుకోవడానికి, మన పైన పరిగణించాల్సిన విషయం ఏమీ లేదని చెప్పడం సులభమనిపించవచ్చు. “దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొందురు “దేవుడు లేడని” వారెల్లప్పుడు యోచించుదురు” (కీర్తన 10:4). అంతిమంగా, దేవుడు లేడని గర్విష్ఠులు తమను తామే ప్రోత్సహించుకుంటూ ఉంటారు.

ఇలా ఉండటానికిగల ఒకానొక కారణం ఏంటంటే, దేవుని ఉనికి జీవము యొక్క ప్రతి పార్శ్వమును గణనీయంగా ప్రభావితం చేయడమే. విశ్వమును నడిపించుటలో దేవుని సన్నిహిత ప్రమేయమును గర్వం సహించదు, అంతేకాదు జీవితం యొక్క సాధారణ విషయాలలో కూడా దేవుని ప్రమేయాన్ని గర్వం అనుమతించదు.

గర్వం దేవుని సార్వభౌమాధికారాన్ని ఇష్టపడదు. అందుచేత, దేవుడు సార్వభౌమాధికారి గనుక గర్వం దేవుని ఉనికిని కూడా. ఈ గర్వం “దేవుడు లేడని” చెప్తుంది. లేదా “నేను క్రిస్మస్ కోసం పలానా వూరికి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను” అని అహంకారంగా చెప్తుంది.

“ఇలానే ఖచ్చితంగా జరుగుతుంది అని అనుకోకండి. “ప్రభువు చిత్తమైతే మనం బ్రతుకుతాం, క్రిస్మస్ కోసం మనం పలానా వూరికి వెళ్దాం” అని చెప్పాలని యాకోబు భక్తుడు ఇక్కడ చెబుతున్నాడు.

మీరు పలానా వూరికి వెళ్తారో లేదో, ఈ సంవత్సరం ఆఖరి వరకు జీవిస్తారో లేదో అనేది దేవుడు చూసుకుంటాడని ఇక్కడ యాకోబు భక్తుడు చెప్తున్న ముఖ్యాంశం. ఇది ఎటువంటి అనారోగ్యం సంభవించకుండా ఈ సంవత్సరం ఆఖరి వరకు జీవించగలమా లేదా అనేదానిపైన కూడా నియంత్రణలేని స్వీయ సామర్థ్యమనే గర్వానికి అత్యంత ఆయాసకరమైన విషయం!

మీ భవిష్యత్తులో జరిగే సంగతుల విషయములో దేవుని సార్వభౌమాధికారముపై నమ్మకముంచకపోవడమే అహంకారమని (గర్వమని) యాకోబు భక్తుడు చెప్తున్నాడు.

ఈ గర్వానికి వ్యతిరేకంగా పోరాడటానికి గల మార్గం ఏంటంటే, ఈ అహంకారాన్ని ఎదుర్కోవడానికి, జీవితంలోని ప్రతి విషయంలో దేవుని సార్వభౌమాధికారానికి లోబడాలి.మన తరపున తనను తాను శక్తిమంతునిగా చూపించుకొనుట (2 దిన 16:9) మరియు ప్రతి దినము కృపా సత్యములతో మనలను వెంబడించుట (కీర్తన 23:6) వంటి ఆయన వాగ్దానములలో విశ్రమించుట అహంకారంతో పోరాడడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, దేవుడు తన కొరకు ఓపికగా ఎదురుచూసే వారి కొరకు పనిచేస్తాడని గుర్తించుట (యెషయా 64:4) మరియు ఆయన మహిమ కొరకు మనం జీవించాల్సిన విషయాలలో సిద్ధంగా ఉండుట (హెబ్రీయులు 13:21) కూడా అహంకారంతో పోరాడడంలో మరింత సహాయపడుతుంది.

మరొక విధంగా చెప్పాలంటే, గర్వానికి నివారణ ఏంటంటే దేవుని సార్వభౌమాధికార భవిష్యత్తు కృపలో అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండడమే.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...