దేవుడు మీ అవసరతలన్నీ తీరుస్తాడు

దేవుడు మీ అవసరతలన్నీ తీరుస్తాడు

షేర్ చెయ్యండి:

“కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును”. (ఫిలిప్పీ 4:19)

ఫిలిప్పీ 4:6వ వచనంలో “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి” అని పౌలు చెప్తున్నాడు. ఆ తర్వాత ఫిలిప్పీ 4:19వ వచనంలో (13 వచనాల తర్వాత), “కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును” అని భవిష్యత్ కృపకు సంబధించిన వాగ్దానం గురించి వ్రాస్తున్నాడు.

ఈ భవిష్యత్ కృప అనే వాగ్దానంలో విశ్వాసంతో మనం జీవిస్తే, మనలో ఆందోళన బ్రతికి ఉండడం చాలా కష్టం. దేవుని “మహిమైశ్వర్యాలు” తరిగిపోనివి. మన భవిష్యత్తు కాలమును గూర్చి చింతించకూడదని ఆయన నిజంగా కోరుకుంటున్నాడు.

మన కోసం పౌలు చెప్పిన ఈ నమూనాను మనం అనుకరించాలి. భవిష్యత్ కృపకు సంబంధించిన వాగ్దానాలను ఆధారం చేసుకొని చింత (కలవరం) అనే అవిశ్వాసానికి విరుద్ధంగా మనం పోరాటం చేయాలి.

ఏదైనా ప్రమాదకరంగా ఉండే క్రొత్త పని గురించి గాని, లేదా సమావేశ౦ గురి౦చి నేను కలవరపడుతున్నప్పుడు (చింత కలిగి ఉన్నప్పుడు), నేను తరచుగా ఉపయోగించే యెషయా 41:10 అనే వాగ్దానానికి సంబంధించిన వచనాన్ని ఆధారం చేసుకొని అవిశ్వాసంతో పోరాడుతాను.

నేను అమెరికా వదిలి జర్మనీలో 3 సంవత్సరాలు ఉన్న సమయంలో చాలా దూరం నుండి మా నాన్న ఫోన్ చేసి, ఈ క్రింది వాగ్దానం చెప్పాడు. విపరీతమైన ఒత్తిడి గుండా వెళ్తున్న నేను దాని నుండి బయట పడటానికి, “నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనైయున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును” అనే ఈ వాగ్దానాన్ని నాకు నేను సుమారు ఐదు వందలసార్లు అన్వయించుకొని ఉంటాను.

ఈ వాగ్దానం ద్వారా నేను అనేక సార్లు ఆందోళనతో పోరాటం చేశాను, అంటే నా మనస్సు తటస్థంగా (న్యూట్రల్‌గా) ఉన్నప్పుడు యెషయా 41:10వ వచనం గేర్లు శబ్దంలాగా ప్రతిధ్వనించేది.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...