మీ ప్రజలకు అబద్ధ నిశ్చయతనిచ్చే ఆరు విధాలు

మీ ప్రజలకు అబద్ధ నిశ్చయతనిచ్చే ఆరు విధాలు

షేర్ చెయ్యండి:

ఒక సంఘకాపరిగా, రక్షణ నిశ్చయత లేక సతమతమవుతున్న చాలా మందితో నేను మాట్లాడుతుంటాను. బహుశా వారు గతంలో చేసిన పాపం వారి మనస్సును అంటిపెట్టుకొని యుంటుంది, లేదా వారి వైఫల్యాలు ఎల్లప్పుడూ వారి కళ్లముందే కనబడుతుంటాయి. వీరంతా ఆదరణ, కొంత నిశ్చయత అవసరమున్న నమ్మకమైన క్రైస్తవులని నేను దాదాపు ప్రతిసారీ గ్రహిస్తున్నాను.

కాని, అనేకమైన మన సంఘాల్లో ఇంత కంటె ఎక్కువగా చింతించే మరొక గుంపుంది. క్రీస్తునంగీకరించుట గురించి వారికి గట్టి నమ్మకముంది గాని వారు నిజంగా మారారా లేదా అనేది పునాదిలేని నమ్మకమై ఉంది. వారెవరో వారెలాంటివారో, బహుశా మీకు తెలిసే ఉంటుంది. వారికి సరైన మాటలు తెలుసు. అపకీర్తిపాలుజేసే బహిరంగ పాపములో ఉండకుండునట్లు జాగ్రత్తపడతారు. వారు నీతి నిజాయితీగలవారు. కాని వారు నిజంగా ఫలించడం లేదు. మార్పు కలుగజేసే దేవుని ఆత్మ వారిలో పనిచేయుచున్నాడనడానికి రుజువేదీ లేదు. కొన్నిసార్లు  వారిలో విడిచిపెట్టని లేదా దానితో వ్యవహరించని రహస్య పాపముంటుంది.

సంఘ కాపరులు అబద్ధ నిశ్చయతను పెంపొందించే ఆరు విధాలు

ఇటువంటి ప్రజలను సమీపించడం కష్టం. వ్యాధి నిరోధక వ్యాక్సీన్‌ ఇవ్వబడినట్టు, వారికి సువార్త నిరోధక వ్యాక్సీన్‌ ఇవ్వబడిందన్నట్టుంటారు వారు. వారికి అవసరమైన విషయాలన్నీ ఇదివరకే కలిగియున్నారని వారనుకుంటారు. గనుక వారి ఆత్మీయ జీవితానికి అవసరమైన విషయాల కొరకు వారు వెతకరు! వారిలో ఏదైనా పాపం దాగియున్నట్లయితే, వారు దానితో ఏనాడో రాజీ కుదుర్చుకున్నారు.

విచారపడాల్సిన విషయమేంటంటే, ఇలాంటివారు మన మధ్య ఉన్నారంటే, కొంత మేరకైనా మన సంఘాలు నిందింపబడాలి. సంఘ కాపరులమైన మనం ప్రజల్లో అబద్ధ నిశ్చయతను అనుకోకుండా పెంపొందించడానికి గల ఆరు మార్గాలు ఇలా ఉన్నాయి:

1. సువార్తను ఊహించుకుంటాము

మన సంఘ సభ్యులు సువార్తను అర్థంచేసుకున్నారని, నమ్ముతున్నారని ఊహించుకొనడం సులభం. ఎంతైనా, వారు ప్రతి ఆదివారం ఆరాధనకు హాజరవుతుంటారు. కాని వాస్తవమేంటంటే, సువార్తను సంఘస్థులంతా అర్థంచేసుకున్నారని అనేక సంఘాలు భావిస్తున్నాయి. దీని ఫలితంగా, సువార్తను మరియు దాన్ని ఆధారం చేసుకొని, తప్పనిసరిగా పాటించాల్సిన ఆజ్ఞలను కొన్నింటిని (ఉదా॥ మంచి భర్తవై/భార్యవై యుండుట ఎలా; కోపాన్ని నియంత్రించుకొనడమెలా? అలాంటి విషయాలను) అర్థంచేసుకొని, నీతి నిజాయితీగా మంచి ప్రవర్తనతో బ్రతుకుతున్నప్పటికిని, సువార్తను వారి సొంత జీవితాలకు అన్వయించుకొనకుండా జీవిస్తున్నవారితో మన సంఘాలు నిండి ఉన్నాయి.

ఇది ఆధ్యాత్మికంగా చాలా అపాయకరమైనది ఎందుకంటే, ఒకరు నీతిగా జీవిస్తున్నారనేది సువార్తలో వారికిగల విశ్వాసానికి రుజువై యుండవచ్చు. కాని, అది వారి స్వనీతికి మరియు పరిసయ్యుల వలె జీవించడానికి కూడ రుజువై యుండవచ్చు. నీతిమంతునిగా తీర్పు తీర్చే విశ్వాసం ఎన్నడూ ఒంటిగా ఉండదు కానీ, నిజమైన విశ్వాసం ఎల్లప్పుడు క్రియల్లో చూపింపబడుతుంది. కాని, మనం విశ్వాసము చేతనే నీతిమంతులంగా తీర్పు తీర్చబడతామనే విషయాన్ని మనం మొదట నొక్కిచెప్పాలి, పలుమార్లు నొక్కిచెప్పాలి; లేదంటే వాళ్లలో మనం చూచే మంచి పనులు రక్షణ వల్ల వచ్చే క్రియలై ఉండవు. బోధకుని చేత సువార్త స్పష్టంగా చెప్పబడనప్పుడు, పరలోకానికి మార్గం మరియు నరకానికి వెళ్లు దారి స్పష్టంగా సూచింపబడనప్పుడు, వారి నైతికత లేదా వారు ప్రతి ఆదివారం క్రమం తప్పక సంఘారాధనకు హజరవడం వారికి అభయమిస్తుందని విశ్వాసులు భావిస్తుంటారు.

ఒక్క మాటలో చెప్పాలంటే, నైతికతను బోధించవద్దు. ఎప్పుడూ బోధించవద్దు. ప్రతి వారం సువార్తను బోధించు. సువార్త సత్యాలను ఆధారం చేసుకొని, తప్పనిసరిగా పాటించాల్సిన ఆజ్ఞలను బోధించు.

2. పాపము గూర్చి పైపై భావాన్ని వారికి బోధిస్తుంటాము.

పాపమంటే మనం చేసే ఏదో ఒక విషయం కాదు గాని, పడిపోయిన స్థితిలో మనమెవరమై యున్నామో అదే పాపమని బైబిలు మనకు బోధిస్తుంది. మనమందరం చచ్చినవారమై యున్నామనియు (ఎఫెసీ 2:1-2), పాపమునకు దాసులమనియు (యోహాను 8:34), దేవుని ఆజ్ఞలన్నింటిని ఉల్లంఘించిన దోషులమనియు (యాకోబు 2:10), దేవుని న్యాయమైన ఉగ్రతను అనుభవించడానికి ఖండింపబడినవారమై యున్నామనియు (రోమా 1:18) లేఖనాలు మనకు బోధిస్తున్నాయి. మనం సాంతంగా పూర్తిగా పాపులమై యున్నాం.

ఆధారంలేని నిశ్చయత గలవారు తరచుగా పాపాన్ని అపార్థం చేసుకుంటారు. పాపమనేది బయటికి కనపడే నడతలు మాత్రమే అయ్యున్నట్లయితే, వారు ఎంతో కొంత ప్రయాసతో క్రమశిక్షణతో వారి సొంత సమస్యలను పరిష్కరించుకోగలరు. కాని వారు తమ  పాపం గురించి బైబిలు చెప్తున్నట్లుగా క్రమం తప్పక పోరాడండని మనం వారిని ఒప్పించగలిగినట్లయితే, అప్పుడు వారు తిరిగి జన్మించి, వారి మంచి పనులపై ఆధారపడకుండా, యేసు ద్వారా లభించే రక్షణ అవసరతను గ్రహిస్తారు.

3. సంఘ సభ్యత్వాన్ని మరియు సంఘ క్రమశిక్షణను ఆషామాషీగా ఎంచుతాము

స్థానిక సంఘంలోని సభ్యత్వం, సభ్యులకు వారి రక్షణ గురించిన నిశ్చయతనివ్వడానికి ఉద్దేశింపబడింది. ఒకడు క్రైస్తవుడై ఉన్నాడనడానికి అదొక సామూహిక ఆమోద ముద్ర. ఆ సంఘ సమాజం ఒకరి విశ్వాసపు ఒప్పుకోలును, అతని జీవిత విధానాన్ని పరీక్షించి, అతనికి బాప్తిస్మమిచ్చి, అతడు ప్రభువు బల్లలో పాల్గొనడానికి అనుమతించినప్పుడు, “మేము చెప్పగలిగినంత మట్టుకు, మాకు క్రీస్తు చేత పైనుండి ఇయ్యబడిన అధికారం మరియు జ్ఞానముతో, నీవు కూడా మా అందరిలో ఒక సభ్యుడవని’’ ఆ సంఘం అతనితో చెప్పుతుందని అర్థం. నాణెనికి రెండవ వైపు, ఒక సంఘం ఒక సభ్యుని వెలివేసినప్పుడు, పైన పేర్కొనబడిన అన్ని విషయాలలో ఆమోద ముద్ర అతని నుండి తొలగించినట్టే అవుతుంది. ఆ వ్యక్తి చర్యలు తన విశ్వాసపు ఒప్పుకోలు మరియు వారి నిశ్చయతకి గల ఆధారం యొక్క ప్రతిష్ఠను పాడుచేసి వాటిని బలహీనపరచినవని ఆ సంఘ సమాజం ఆ వ్యక్తితో చెప్తుందని అర్థం.

అయితే ఒక సంఘం దాని సభ్యత్వం విషయంలో వాక్యానుసారంగా ఉండనప్పుడు, తమ సభ్యత్వాన్ని పెంచుకోవడానికి లేదా కాపాడుకోడానికి సంఘారాధనలకు క్రమంగా హాజరుకాని సభ్యులను అనుమతిస్తుంది. తద్వారా ఆ సంఘం అబద్ధ నిశ్చయతని పెంపొందిస్తుంది. గనుక, సంఘం వారి సంఘ సభ్యత్వపు విషయాన్ని సరిగా  పట్టించుకోకపోవడాన్ని బట్టి ఎంత మంది నరకానికి వెళ్లడంలేదు?

4. వారి నిశ్చయతకి గతంలో జరిగిన సంగతులను ఆధారంచేసుకోమని బోధిస్తాము

మనమిప్పటికే గమనించినట్లు, సువార్త మన స్పందనను డిమాండ్ చేస్తుంది. ఒకరు క్రీస్తు కొరకు క్రొత్తగా చేసిన తీర్మానాన్ని బయటికి చెప్పడానికి ఏదైన ఒక పద్ధతి కొన్నిసార్లు సహాయకరంగా ఉన్నట్టు సంఘాలు, సువార్తీకరణ కార్యక్రమాలు కనుగొన్నాయి. ఇలాంటివారికి కొందరు, ‘‘పాపి ప్రార్థనను’’ చేయడానికి అవకాశమిస్తారు. ఇంకొందరు, ఆదివారంనాడు అందరి ముందు నిలువబడిన సాక్ష్యం చెప్పమంటారు, లేదా ప్రతిస్పందన (రెస్పాన్స్‌) కార్డును నింపమంటారు.  వారిలో పరిశుద్ధాత్మ దేవుడు కలుగజేసిన మార్పునకు ఈ వెలుపటి చర్యలు నిజంగా యథార్థమైన ప్రతిస్పందనయై ఉండొచ్చు.

కాని మరొక విధంగా చూస్తే, ఇవి మోసం చేస్తున్నవై కూడా అయ్యుండొచ్చు. వాళ్లు ప్రార్థన చేయొచ్చు, సాక్ష్యం చెప్పొచ్చు, కార్డు నింపొచ్చు; అయినప్పటికిని యింకా పాపములోనే నశించుచుండవచ్చు కూడా. కాబట్టి నూతన జన్మకు వేరుగా చేసే ఏదో ఒక విధమైన కార్యకలాపం మీద ఆధారపడియున్న నిశ్చయతను కలిగియుండాలని వారిని మనం ప్రోత్సహించినట్లయితే, మనం వారిని తీవ్రమైన ఆధ్యాత్మిక అపాయంలో పడవేస్తున్నట్టవుతుంది. ఎప్పుడో చిన్నపుడు వారు చేసిన పాపి ప్రార్థనను బట్టి వారు పరలోకానికి వెళ్తామని ఖచ్చితంగా నమ్ముతూ నరకానికి పరుగులు తీస్తున్నవారు మన చుట్టూ ఎంతమంది లేరు?

5. నీతిమంతులుగా తీర్పుతీర్చబడుట మరియు పరిశుద్ధ పర్చబడుట మధ్య ఉన్న సంబంధాన్ని విశ్వాసులకు భోధించకుండా ఉండటం

దేవుని ఉచిత కృపను గొప్పచేయాలన్న సదుద్దేశంతో, క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా మాత్రమే నీతిమంతులముగా తీర్పు తీర్చబడుతామన్న సత్యాన్ని ఇతర ఆధారిత సత్యాలకు కనెక్ట్ చేయకుండా మన శ్రోతలకు బోధించడం సాధ్యమే. కాని నేనింతకు ముందు చెప్పినట్లు, నీతిమంతులనుగా తీర్పు తీర్చుటకు క్రీస్తు చేసిన కార్యం, విశ్వాసుల జీవితాల్లో నీతి ఫలాలను ఎల్లప్పుడు ఫలిస్తుందనేది బైబిల్ బోధ (ఉదాహరణకు, రోమా 6:1-14వచనాల్లోని వాదనను చూడండి).

నీతిమంతులుగా తీర్పు తీర్చబడుటకునూ పరిశుద్ధులుగా చేయబడుటకునూ మధ్య సంబంధం లేనట్లయితే, అది విశ్వాసులకు చాలా ప్రమాదకరం. వారు వ్యక్తిగతంగా పరిశుద్ధులై ఉండాలని మరియు దేవుడు చెప్పినట్టు చేయడం ద్వారా ఆయనను ప్రేమించుటకు వారికి కావాల్సిన ప్రేరణను అది బలహీనపరుస్తుంది. అయితే అబద్ధ నిశ్చయతగలవారికి ఇది రెట్టింపు ప్రమాదకరం. ఎందుకంటే, దేవునికి వ్యతిరేకంగా బాహాటంగా తిరుగుబాటు చేస్తూ కూడా ఆయన దృష్టికి నీతిమంతులుగా బ్రతకడం సాధ్యమే అని వారు ఆలోచించడానికి అది వారిని ప్రోత్సహిస్తుంది.

6. బైబిల్ హెచ్చరికలను పట్టించుకోనవసరం లేదని బోధించుట

పాపాన్ని హత్తుకొని మరియు/లేదా విశ్వాసాన్ని విడిచిపెట్టువారికి బైబిల్ నిండా బహు భయంకరమైన హెచ్చరికలున్నాయి (ఉదా॥ మత్తయి 5:27-30, హెబ్రీ 6:1-6). దేవునికి తన ప్రజల పట్ల గల సార్వభౌమ శ్రద్ధ గురించి స్పష్టంగా బోధించడానికి మనం పడే ప్రయాసలలో, ఇవేవీ కూడ విశ్వాసులకు వర్తించవనే అభిప్రాయాన్ని వారిలో కలిగించుట వలన ఈ హెచ్చరికల బలాన్ని బలహీనపరుస్తాం.

కాని ఒక్క విషయం. ఈ హెచ్చరికలు బైబిలులో ఊరకనే వ్రాయబడలేదు, వాటి వెనుక ఒక ఉద్దేశముంది. అవన్నీ నిజమైనవి. ఆయన ప్రజలు త్రోవ తప్పి తిరుగులాడకుండునట్లు వారిని కాపాడుటకు దేవుడు అమలుచేయు ఒక మార్గమై ఉన్నవి. ఒక జ్ఞానవంతుడైన పాస్టర్, పాపం మరియు విశ్వాసభ్రష్టత ఎంత భయంకరమైనవో తన శ్రోతలకు స్పష్టంగా తెలుపుతూ వారు విశ్వాసంలో స్థిరంగా ఉండాలని హెచ్చరిస్తాడు.

మైక్‌ మెక్‌కిన్లీ

మైక్‌ మెక్‌కిన్లీ

మైక్ మెక్‌కిన్లీ ఒక రచయిత మరియు వర్జీనియాలోని స్టెర్లింగ్‌లోని స్టెర్లింగ్ పార్క్ బాప్టిస్ట్ చర్చి పాస్టర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...