మీ జీవితాన్ని ఎలా ద్వేషించాలి
“గోధుమగింజ భూమిలో పడి చావకుండినయెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చినయెడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించు వాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను”.
(యోహాను 12:24-25)
“ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవము కొరకు దానిని కాపాడుకొనును” అనే ఈ మాటకు అర్థం ఏమిటి?
ఈ మాటకు అర్థం ఏంటంటే ఈ లోకములో మీ జీవితం గురించి పెద్దగా ఆలోచించవద్దని అర్థం. మరొక విధంగా చెప్పాలంటే, ఈ లోకంలో మీ జీవితానికి జరిగేది అంత ప్రాముఖ్యం కాదని చెప్పవచ్చు.
మనుష్యులు మీ గురించి మంచిగా మాట్లాడినా, అది అంత పెద్ద విషయం కాదు.
వారు మిమ్మల్ని ద్వేషించినా, అది అంత పెద్ద విషయం కాదు.
మీరు ఎన్నో సంగతులను కలిగి ఉన్నా, అది అంత పెద్ద విషయం కాదు.
మీకు తక్కువ కలిగియున్నా, అది అంత పెద్ద విషయం కాదు.
మీరు హింసించబడినా లేక మీ గురించి అబద్ధముగా చెప్పబడినా, అది అంత పెద్ద విషయం కాదు.
మీరు ప్రఖ్యాతి చెందినా లేక మీరు ఎవ్వరికీ తెలియకపోయినా, అది అంత పెద్ద విషయం కాదు.
మీరు క్రీస్తుతోపాటు చనిపోయినా, ఈ విషయాలన్నీ అంత పెద్ద విషయాలు కావు.
అయితే, యేసు మాటలు మరింత తీవ్రమైనవి. మనం ఎన్నుకోనటువంటి అనుభవాలను సహించడానికి మాత్రమే ఆయన మనల్ని పిలవడం లేదు గాని ఆయనను ఎంపిక చేసుకొని వెంబడించడానికి ఆయన మనల్ని పిలుస్తున్నాడు. “ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడింపవలెను;….” (యోహాను 12:26). ఎక్కడికి వెళ్తున్నాడు? ఆయన గెత్సెమనెలోనికి వెళ్తూ, సిలువ వైపుకు వెళ్తున్నాడు.
నువ్వు నాతోపాటు చనిపోయావు గనుక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు, కోపం తెచ్చుకోవద్దని మాత్రమే యేసు చెప్పడం లేదు. నాతో చనిపోవడానికి ఎంపిక చేసుకొమ్మని, నేను సిలువను ఎన్నుకున్నట్లుగా ఈ లోకములో నీ జీవితాన్ని ద్వేషించడానికి ఎంపిక చేసుకొమ్మని ఆయన చెప్తున్నాడు.
ఆయన చెప్పినప్పుడు ఆయన మాటలకు అర్థం ఇదే, “ఎవడైనను నన్ను వెంబడింపగోరినయెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను” (మత్తయి 16:24). సిలువను ఎంపిక చేసుకోవడానికి ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ప్రజలు సిలువపైన ఒకే ఒక పనిని మాత్రమే చేశారు. దానిపైన వారు చనిపోయారు. “నీ సిలువను ఎత్తుకొని” అనే మాటకు, “గోధుమ గింజ భూమిలో పడి, చనిపోతుంది” అని అర్థం. దీనినే మీరు ఎన్నుకోండి.
అయితే, ఎందుకు ఎన్నుకోవాలి? ఎందుకంటే, సేవ కోసం తీవ్రమైన నిబద్ధత కలిగి ఉండానికి: “అయితే దేవుని కృపాసువార్తనుగూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసువలన పొందిన పరిచర్యను, తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు” (అపొ. కార్య 20:24). “నేను దేవుని కృపా మహిమ కోసం జీవించగలిగితే, నాకు ఏమి జరిగినా పరవాలేదు” అని పౌలు చెప్పడం వింటున్నానని నేననుకుంటున్నాను.

జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Powered By ABNY Web