దేవుడు మీ కోసం పనిచేస్తాడు
“కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడనుండి వచ్చును? యెహోవావలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు”. (కీర్తన 121:1-3)
మీకు సహాయం కావాలా? అవును, నాకు సహాయం కావాలి. అయితే, ఆ సహాయం కోసం మీరు ఎక్కడ వెదుకుతారు?
కీర్తనాకారుడు కొండల వైపు తన కన్నులెత్తి చూసి, “నాకు సహాయం ఎక్కడ నుండి వస్తుంది?” అని అడిగినప్పుడు, “యెహోవావలననే నాకు సహాయము కలుగును” అని చెప్పాడు, అంటే నాకు సహాయం కొండల దగ్గర నుండి రాదు గాని కొండలను సృష్టించిన దేవుని దగ్గర నుండి వస్తుందని చెప్పాడు. “భూమిని ఆకాశములను సృష్టించిన ప్రభువు నుండే నాకు సహాయం వస్తుంది.”
అందుచేత, కీర్తనాకారుడు రెండు గొప్ప సత్యాలతో జ్ఞాపకం చేసుకున్నాడు: వాటిలో ఒకటి, జీవితములో ఎదురయ్యే సమస్త సమస్యలన్నిటి పైన దేవుడు సర్వ శక్తిమంతుడైన సృష్టికర్త; రెండవది, దేవుడు కునుకడు (నిద్రపోడు). “నిన్ను కాపాడువాడు కునుకడు.”
దేవుడు అలుపెరుగని శ్రామికుడు. ఆయన ఎప్పుడూ అలసిపోడు. మీ జీవితంలో ఒక శ్రామికుడిగానే దేవుని గురించి ఆలోచించండి. అవును, ఇది అద్భుతమైన విషయం. దేవుని జీవితంలో మనం శ్రామికులమన్నట్లుగా మనల్ని గురించి మనం ఆలోచిస్తుంటాం. అయితే, మన జీవితాలలో దేవుడు ఒక శ్రామికుడని చెప్పడంతో మొదటిసారిగా మనం ఆశ్చర్యపోవాలని బైబిల్ కోరుకుంటోంది: “తనకొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలముచేయు మరి ఏ దేవునిని ఎవడు నేకాలమున చూచియుండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు” (యెషయా 64:4).
ఇరవై నాలుగు గంటలు దేవుడు మన కోసం శ్రమిస్తూనే ఉన్నాడు. ఆయన ఎప్పుడూ సెలవు తీసుకోడు, ఆయన ఎప్పుడూ నిద్రపోడు. వాస్తవానికి, ఆయనను విశ్వసించే ప్రజల కోసం మరింత ఎక్కువగా శ్రమించాలని (పని చేయాలని) మన కోసం పని చేయడానికి ఎంతగానో ఆతృతను కలిగి ఉంటాడు. “తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది; యీ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును” (2 దిన. 16:9).
దేవుడు తనను విశ్వసించిన ప్రజల కోసం అలుపెరుగని శక్తిని, జ్ఞానాన్ని, మంచితనాన్ని చూపించాలని ఆయన ఇష్టపడుతాడు. ఆయన తన కుమారుడైన యేసును పంపించడమనేది తండ్రి చూపించిన అతి ప్రాముఖ్యమైన మార్గమైయుండెను: “మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను” (మార్కు 10:45). యేసు తనను వెంబడించువారి కోసం పని చేస్తాడు (శ్రమిస్తాడు). ఆయన వారికి సేవ చేస్తాడు. సువార్త అనేది “సహాయాన్ని కోరుకునే” సంకేతం కాదు. సువార్త అనేది “సహాయం అందుబాటులో ఉంది” అని చెప్పే సంకేతమైయున్నది.
దీనినే మనం, “ఎల్లప్పుడు ఆనందించి” (1 థెస్స 5:16), “ప్రతి విషయంలోను కృతజ్ఞతలు చెల్లించి” (ఎఫెసీ 5:20), “సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం” (ఫిలిప్పీ 4:7) కలిగి, “దేనిని గురించి చింత పడకుండా” (ఫిలిప్పీ 4:6), “ఈ లోకంలో” మన జీవితాలను ద్వేషిస్తూ (యోహాను 12:25) మరియు “[మనవలె] [మన] పొరుగువారిని ప్రేమిస్తూ” (మత్తయి 22:39) ఉండే క్రమంలో తప్పకుండా నమ్మాలి, నిజంగా నమ్మాలి.
ఎంత గొప్ప సత్యమో కదా! ఎంత గొప్ప నిజమో కదా! దేవుడు తనను కనిపెట్టుకొనువారి కోసం రాత్రంతా పగలంతా శ్రమించువాడైయున్నాడు.

జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Powered By ABNY Web