యేసును ఆనందింపజేసేది ఏది?
“ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి – తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను; అవును తండ్రీ, ఆలాగు నీ దృష్టికి అనుకూలమాయెను”. (లూకా 10:21)
యేసు ఆనందించాడని సువార్త పుస్తకాలలో చెప్పబడిన రెండు సందర్భాలలో ఈ వచనం కూడా ఒక సందర్భం. డెబ్బై మంది శిష్యులు సువార్తను ప్రకటించడానికి వెళ్లి, తిరిగి వచ్చి, తమ విజయాన్ని యేసుకు నివేదించారు.
త్రిత్వంలో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు కూడా ఇక్కడ ఆనందించటాన్ని గమనించండి: యేసు ఆనందిస్తున్నాడు, అయితే ఆయన పరిశుద్దాత్మలో ఆనందిస్తున్నాడని చెప్పబడింది. పరిశుద్ధాత్ముడు ఆయనను నింపి, ఆనందించడానికి యేసును ప్రేరేపిస్తున్నాడని నేనిక్కడ ఆర్థం చేసుకుంటున్నాను. ఈ వచనం చివరి భాగంలో తండ్రి దృష్టికి అనుకూలమాయెనని వ్రాయబడియున్నది. ఈ వాక్యాన్ని NIV బైబిల్ ఇలా తర్జుమా చేస్తోంది, “అవును తండ్రి, ఇదే మీకు ఆనందాన్ని కలిగించింది,” అంటే ఇలా చేయడానికే మీరు ఆనందించారు!
ఇప్పుడు, ఈ వాక్యములో త్రియేక దేవునిలో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు ఆనందించడానికి కారణం ఏమిటి? ఇది, జ్ఞానులకు ఈ సంగతులను మరుగుచేసి, పసి బాలురకు బయలుపరిచే స్వేచ్చతో కూడిన, దేవుడు ఎన్నుకునే ప్రేమ. “తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను”.
తండ్రి కొందరికి మరుగు పరిచి, మరికొందరికి బయలుపరిచేవి ఏమిటి? “కుమారుడు ఎవడో, తండ్రి తప్ప మరెవడును ఎరుగడు” అని లూకా 10:22 వచనం జవాబు చెప్తోంది. కాబట్టి, కుమారుని నిజమైన ఆధ్యాత్మిక గుర్తింపు గురించి తండ్రియైన దేవుడు తప్పనిసరిగా బయలుపరచాలి.
డెబ్బై మంది శిష్యులు సువార్తీకరణ నుండి వెనుదిరిగి వచ్చి, రిపోర్టును యేసుకు ఇచ్చినప్పుడు, తండ్రియైన దేవుడు జ్ఞానులకు తన కుమారుణ్ణి మరుగు పరిచి, పసిబాలురకు బయలుపరచడానికి తన ఇష్టాన్నిబట్టి, తన ఆనందాన్నిబట్టి ఎన్నుకున్నాడని యేసు మరియు పరిశుద్ధాత్ముడు ఆనందించారు.
దేవుని ద్వారా ఎన్నుకోబడిన కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే ఉన్నారని ఆయన ఈ విషయాన్ని ఎత్తి చూపడం లేదు. దేవుడు తన కృప కోసం అర్హత లేని వారిని ఎన్నుకునే స్వేచ్చను కలిగియున్నాడని ఈ విషయం తెలియజేస్తోంది.
మానవ యోగ్యత దేనిని నిర్దేశిస్తుందో దానికి దేవుడు విరుద్ధంగా ఉంటాడు. స్వయం-సమృద్ధిని కలిగియున్న జ్ఞానవంతులకు ఆయన మరుగై, నిస్సహాయులకు, అసంపూర్ణులకు ఆయన తననుతాను బయలుపరచుకుంటాడు.
తండ్రియైన దేవుని ఉచిత కృపను మాత్రమే తమ నిరీక్షణగా పెట్టుకున్న ప్రజలను వెలిగించి, రక్షించుటను యేసు చూసినప్పుడు, ఆయన పరిశుద్ధాత్మునిలో ఆనందించి, తండ్రి యొక్క ఎన్నికలో సంతోషాన్ని పొందుకుంటాడు.
అందుచేత, మనమిది చూసినప్పుడు, వాస్తవానికి, ఎన్నుకోబడిన పిల్లల మధ్య మనం కూడా ఉన్నామని మనం తెలుసుకున్నప్పుడు, మనం ఆయనతోపాటు ఆనందిస్తాం.

జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Powered By ABNY Web