కొంత మంది “సువార్త” అని తప్పుగా బోధించే కొన్ని సందేశాలు ఏమిటి?

1. దేవుడు మనలను ఐశ్వర్యవంతులనుగా చేయాలని ఆశిస్తున్నాడు మనము ఆయన్ని అడగాలేగాని, దాచుకోడానికి స్థలం, చాలనంతటి ధనం, అమ్మితే అంతే ధనాన్ని తెచ్చిపెట్టే ఆస్తిపాస్తులతో మనలను ఆశీర్వదించాలని దేవుడు కోరుతున్నాడంటూ ఈనాడు కొందరు బోధకులు చెప్తుంటారు! కాని సువార్త ఆత్మసంబంధమైన ఆశీర్వాదముల గూర్చిన సందేశమై యున్నది (ఎఫెసీ 1:3). మనము నీతిమంతులముగా తీర్చబడునట్లు, దేవునితో సమాధానపరచబడునట్లు,…






