“యెహోవా” అంటే అర్ధం చేసుకోవడానికి 10విషయాలు
“మరియు దేవుడు మోషేతో నిట్లనెను మీ పితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము”. (నిర్గమకాండము 3:15)
ఆంగ్ల బైబిల్‌లో దేవుని పేరు దాదాపు ఎల్లప్పుడూ లార్డ్ (అన్ని క్యాపిటల్ లెటర్స్ LORD) అని అనువదించారు. కానీ హీబ్రూలో “యావే” అని ఉంటుంది మరియు ఈ పదం “నేను ఉన్నవాడును” అనే పదం మీద నిర్మించబడింది.
కాబట్టి మనం యెహోవా అనే పదాన్ని విన్న ప్రతిసారీ లేదా మీరు ఆంగ్ల బైబిల్‌లో లార్డ్‌ని చూసిన ప్రతిసారీ, మీరు ఆలోచించాలి: ఇది పేరు (పేతురు లేదా యోహాను వంటిది) ” నేను ఉన్నవాడును” అనే పదం నుండి నిర్మించబడిందని దేవుడు ఖచ్చితంగా ఉన్నవాడని ప్రతిసారీ మనకు గుర్తుచేస్తుంది.
యెహోవా, “నేను ఉన్న వాడను” అనే పేరు దేవుని గురించి కనీసం 10 విషయాలు చెబుతుంది:
1. ఆయనకు ‘ఆది’ లేదు. “దేవుడిని ఎవరు సృష్టించారు?” అని ప్రతి పిల్లవాడు, అడుగుతాడు. మరియు ప్రతి తెలివైన తల్లిదండ్రులు ఇలా అంటారు, “ఎవరూ దేవుణ్ణి చేయలేదు. దేవుడు కేవలం ఉన్నవాడు. మరియు ఎల్లప్పుడూ ఉన్నాడు. ప్రారంభమనేది ఆయనకు లేదు.”
2. దేవునికి అంతం లేదు. ఆయన ఉనికిలోకి రాలేదు కాబట్టి ఉనికి కోల్పోయే అవకాశం లేదు ఎందుకంటే ఆయన ఉన్నవాడు.
3. దేవుడే సంపూర్ణ వాస్తవం. ఆయనకి ముందు ఏ వాస్తవం లేదు. ఆయన ఉద్దేశిస్తే మరియు చేస్తే తప్ప ఆయనకు బయట ఏమీ లేదు. నిత్యత్వంలో ఏమై ఉన్నడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఉపరితలం లేదు, విశ్వం లేదు, శూన్యం లేదు. దేవుడు మాత్రమే.
4. దేవుడు పూర్తిగా స్వతంత్రుడు. ఆయన ఉనికిలోకి రావడానికి లేదా మద్దతు కొరకు లేదా సలహా కొరకు లేదా ఆయన ఆయనలా ఉండడానికి ఆయన దేనిపై ఆధారపడడు.
5. దేవుడు కాని ప్రతిదీ పూర్తిగా దేవునిపై ఆధారపడుతుంది. విశ్వం మొత్తం పూర్తిగా తక్కువ స్థాయికి చెందినది. ఇది దేవుని ద్వారా ఉనికిలోకి వచ్చింది మరియు ఉనికిలో ఉండడానికి దానిని ఉనికిలో ఉంచాలా వద్దా అనే దేవుని నిర్ణయంపై క్షణక్షణం ఆధారపడి ఉంటుంది.
6. దేవునితో పోలిస్తే విశ్వమంతా శూన్యం. నీడకు వాస్తవానికి ఎంత తేడా ఉందో ఆధారపడేదానికి స్వతంత్రమైనదానికి అంతే తేడా ఉంది. పిడుగుపాటుకు దాని నుండి వచ్చే ప్రతిధ్వనికి ఉన్న సంబందం లాంటిది. ప్రపంచంలో మరియు గెలాక్సీలలో మనం ఆశ్చర్యపోయేవన్నీ, దేవునితో పోల్చితే, ఏమీ కాదు.
7. దేవుడు స్థిరంగా ఉంటాడు. ఆయన నిన్న, నేడు మరియు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మెరుగుపరచబడడు. ఆయన ఒక స్థితి నుండి ఇంకో స్థితికి మారడు. ఆయన ఏమైఉన్నాడో అలాగే ఉంటాడు.
8. సత్యమునకు, మంచితనముకు మరియు అందమునకు సంపూర్ణ ప్రమాణం దేవుడే. ఏది సరైనదో తెలుసుకోవడానికి ఆయన చూసే చట్టములకు సంబంధించిన పుస్తకమే లేదు. వాస్తవాలను స్థాపించడానికి పంచాంగం లేదు. ఏది అద్భుతమైనది లేదా అందమైనది అని నిర్ణయించడానికి సంస్థ లేదు. ఏది సరైనది, ఏది నిజం, ఏది అందమైనది అనేదానికి ఆయనే ప్రమాణం.
9. దేవుడు తనకు నచ్చినది చేస్తాడు మరియు అది ఎల్లప్పుడూ సరైనది మరియు ఎల్లప్పుడూ అందంగా ఉంటుంది మరియు ఎల్లప్పుడూ సత్యానికి అనుగుణంగా ఉంటుంది. ఆయనకు బయట ఉన్న అన్ని వాస్తవాలను సృష్టించే, రూపొందించే మరియు పరిపాలించే సంపూర్ణ వాస్తవికత ఆయనే. కాబట్టి తన స్వచిత్తం నుండి ఉద్భవించని ఎటువంటి పరిమితులైన వాటి నుండి ఆయన పూర్తిగా స్వతంత్రుడు.
10. విశ్వంలో అత్యంత ముఖ్యమైన మరియు అత్యంత విలువైన వాస్తవికత మరియు వ్యక్తి ఎవరంటే దేవుడే. విశ్వంతో సహా మొత్తం అన్ని ఇతర వాస్తవాల మీద కంటే ఆయనపై ఆసక్తి, శ్రద్ధ, ప్రశంసలు మరియు ఆనందం చూపించడానికి ఆయన అర్హుడు.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web