“మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను”. (రోమా 8:30)
శాశ్వత కాలంలో దేవుడు ముందుగా నిర్ణయించిన నాటి నుండి మరియు శాశ్వత కాలంలో దేవుడు మహిమపరచడానికి మధ్యలో ఏదీ కోల్పోము.
కుమారులుగా ముందుగా నిర్ణయించబడిన వారిని దేవుడు పిలిచే విషయంలో విఫలం కాడు. మరియు పిలువబడిన వారిని దేవుడు నీతిమంతులుగా తీర్చే విషయంలో విఫలం కాడు. మరియు నీతిమంతులుగా తీర్చబడిన వారిని దేవుడు మహిమపరచటంలో విఫలం కాడు. ఇది దైవిక నిబంధన విశ్వసనీయత యొక్క విడదీయరాని ఉక్కు గొలుసు లాంటింది.
మరియు పౌలు ఇలా అంటున్నాడు,
మీలో ఈ సత్ క్రియ ఆరంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను (ఫిలిప్పీయులు 1:6)
[ఆయన] మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతమువరకు ఆయన మిమ్మును స్తిరపరుచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. (1 కొరింథీయులు 1:8–9)
అబద్ధమాడలేని మన దేవుని వాగ్దానాలు ఇవి. క్రొత్తగా జన్మించిన వారు దేవుడు ఎంత నమ్మకమైన వాడో అంతే సురక్షితంగా ఉంటారు.