కుమ్మరి మన పక్షమునన్నప్పుడు

కుమ్మరి మన పక్షమునన్నప్పుడు

షేర్ చెయ్యండి:

“మంటికుండ పెంకులలో ఒక పెంకై యుండి తన్ను సృజించినవానితో వాదించువానికి శ్రమ. జిగటమన్ను దాని రూపించువానితో నీవేమిచేయుచున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా?”. (యెషయా 45:9)

గొప్పగా కనిపిస్తుంది. ఆయన శూన్యమును ఆజ్ఞాపించినప్పుడు, ఆ శూన్యం ఆయనకు విధేయత చూపి, సృష్టిగా మారింది.

ఆయన శూన్యంలోనుండి మంటిని చేశాడు, ఆ మంటి నుండి మనల్ని చేశాడు. మనం ప్రభువు చేసిన మంటి కుండలం అన్నమాట (యెషయా 45:9), అంటే మనం ఆయన సొత్తు, ఆయన మహిమ కోసం నియమించబడినవారం, ఆయన మీద పూర్తిగా ఆధారపడినవారం.“యెహోవాయే దేవుడని తెలిసికొనుడి! ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొఱ్ఱెలము” (కీర్తన 100:3). ఒక వ్యక్తికి సంబంధించిన ఒక గొర్రెగా, ఒక కుండగా ఉండడం అనేది వాటికి ఎంతో గర్వించదగ్గ విషయం.

ఈ రోజు ఉదయం నేను యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు, దేవుని గొప్పతనం గురించి నేను మరొక మాటను చూశాను. సృష్టికర్తగా దేవుని ఖచ్చితమైన శక్తిని, ఆయన హక్కులను కలిపి చూసినప్పుడు, నా హృదయంలో జ్వాలలు చెలరేగాయి.

“అచ్చట యెహోవా ప్రభావముగలవాడై మన పక్షముననుండును…!” అని యెషయా 32:21వ వచనం చెప్తోంది.

సృష్టికర్త మన పక్షమున ఉంటాడు! మన పక్షమున ఉంటాడు! మనకు విరుద్ధంగా ఉండడు. ఆయన సృష్టించిన వాటితో ఆయన చేయాలనుకున్న వాటిని చేయడానికి విశ్వంలో ఉన్నటువంటి శక్తి అంతటితో, ఖచ్చితమైన హక్కుతో ఆయన మన కోసం ఉంటాడు!

తనకొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలముచేయు మరి ఏ దేవునిని ఎవడు నేకాలమున చూచియుండలేదు…”(యెషయా 64:4). “…దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధియెవడు?”(రోమా 8:31).

దేవుడు శక్తిగలవాడై మీ కోసం ఉన్నాడనే దానికంటే ఎక్కువగా ఆదరించేది, హామి ఇచ్చేది మరియు సంతోషాన్ని కలిగించేది ఏమైనా (మరింకా ఏదైనా) ఉందేమో మీరు ఆలోచించగలరా?

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...