దేవుడు 100% మన పక్షాన ఉంటే

షేర్ చెయ్యండి:

“వారితో కలిసి మనమందరమును శరీరముయొక్కయు మనస్సుయొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి”. (ఎఫెసీ 2:3)

దేవుని ఉగ్రత మరియు మనకు రావలసిన శిక్ష అంతా యేసు మీద కుమ్మరించబడింది. పరిపూర్ణ నీతి నిమిత్తమై దేవుని ఆజ్ఞలన్నీ క్రీస్తు నెరవేర్చాడు. మనం ఈ నిధిని (దేవుని కృపతో!) చూడగలిగి, దానిని స్వీకరించిన వెంటనే, క్రీస్తు మరణం మన మరణంగా పరిగణించబడుతుంది, ఆయన పొందిన శిక్ష మన శిక్షగా మరియు ఆయన నీతి మన నీతిగా పరిగణించబడుతుంది. ఆ క్షణం నుండి తిరుగు లేకుండా దేవుడు 100% మన పక్షం అవుతాడు.

“దేవుడు ఎన్నుకున్న మనపై తన అనుగ్రహాన్ని నిత్యత్వంలోనే ఉంచాడని బైబిలు బోధించలేదా?” అనేది సమాధానం చెప్పని ప్రశ్నగా ఉంది.

మరో మాటలో చెప్పాలంటే, ఆలోచనాపరులు ఇలా అడుగుతారు, “క్రీస్తును విశ్వసించినపుడు, క్రీస్తుతో ఏకమైనపుడు, మరియు నీతిమంతులగా తీర్చబడినపుడే దేవుడు మనకు 100% అయ్యాడా? జగత్తుపునాదికి ముందే ఎన్నుకున్నపుడు దేవుడు మనకు 100% కాలేదా?”ఎఫెసీ 1:4-5లో పౌలు ఇలా అంటున్నాడు, “తన చిత్త ప్రకారమైన దయాసంకల్పముచొప్పున,యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన [దేవుడు] క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.”

దేవుడు నిత్యత్వంలో ఎన్నుకోబడిన వారికి 100% కాదా? దీనికి సమాధానం “100%” అనే దాని అర్థంపై ఆధారపడి ఉంటుంది.

“100%” అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా నేను లేఖనాలలోని అనేక భాగాలలో కనిపించే బైబిలు సత్యాన్ని కాపాడటానికి ప్రయత్నిస్తున్నాను. ఉదాహరణకు, ఎఫెసీ 2:3లో, క్రైస్తవులు క్రీస్తుయేసులో సజీవులు కాకమునుపు  “ఉగ్రత పిల్లలము” అని పౌలు చెప్పాడు: “వారితో కలిసి మనమందరమును శరీరముయొక్కయు మనస్సుయొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై [ఉగ్రత పిల్లలమై] యుంటిమి.”

మనము క్రొత్తగా జన్మించక ముందు అనగా మనలను క్రీస్తుతోకూడ బ్రతికించడానికి ముందు దేవుని ఉగ్రత మనపై ఉంది అని పౌలు చెబుతున్నాడు. ఎన్నికైనవారు ఉగ్రత క్రింద ఉండేవారు. దేవుడు మనలను క్రీస్తుయేసులో బ్రతికించినప్పుడు, క్రీస్తు యొక్క సత్యాన్ని మరియు అందాన్ని చూడడానికి మనల్ని మేల్కొల్పినప్పుడు ఈ పరిస్థితి మారిపోయింది. తద్వారా యేసుతో మనము ఐక్య పరచబడడం కారణంగా క్రీస్తు మన కోసం చనిపోయిన వ్యక్తిగా, ఆయన నీతి మనదిగా పరిగణించబడుతుంది. ఇది మనకు జరగకముందు, మనం దేవుని ఉగ్రతకు గురయ్యాము. తరువాత, క్రీస్తుపై విశ్వాసం మరియు ఆయనతో ఏకమైన కారణంగా, దేవుని ఉగ్రతంతా తొలగించబడింది.ఈ దృక్పథముతో చూస్తే మనం రక్షించబడిన తరువాత, మనకు ఆయన 100% మన పక్షం అయ్యాడు.

కాబట్టి, దేవుడు నిన్ను కాపాడుకుంటాడనే సత్యంలో సంతోషించు. క్రీస్తులో దేవుడు 100% మీ కోసం ఉన్నాడు కాబట్టి ఆయన మిమ్మల్ని అంతం వరకు కాపాడతాడు. అందువల్ల, అంతం వరకు కాపాడబడటం వల్ల దేవుడు మీ కోసం 100% ఉన్నాడు అని కాదు గాని, దేవుడు ముందుగా మీ కోసం 100% ఉన్నారనే వాస్తవం యొక్క పర్యవసానమే, మనంఅంతం వరకు కాపాడబడటం.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...