ప్రతి వివాహముకు అవసరమైన అతి ప్రాముఖ్యమైన విషయము
ఈ వసంతకాలంలో, పాస్టర్ జాన్ గారు, నేను కలిసి నాష్విల్లేలో ఐదు ఎపిసోడ్లను ప్రత్యక్షంగా రికార్డ్ చేసాము. మీలో చాలా మంది ఆరికార్డింగ్ సెషన్‌లో పాల్గొన్నారు. ఒకానొక సమయంలో పెళ్లి గురించి మాట్లాడుకున్నాం.
హాజరైన వారి నుంచి మాకు వందల ప్రశ్నలు వచ్చాయి. వాటిలో ఎక్కువ శాతం పెళ్లితో ముడిపడి ఉన్నాయి. జీవితం బిజీగా ఉన్నప్పుడు, సంఘ కాపరిగా పరిచర్యలో మరియు పిల్లలను పెంచడంలో బిజీగా ఉన్నప్పుడు, మీ భార్యకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు విలువైన మీ సమయాన్ని ఇవ్వ గలుగుతారా? ఆ రోజుల్లో మీరు నోయల్ ను ఎలా బలపరిచారో దాని గురించి మీకు ఏమి గుర్తుందో చెప్తారా?
భార్య లేదా భర్త తమ జీవిత భాగస్వామిపై పెట్టే అతిపెద్ద పెట్టుబడి వారు తమ స్వంత ఆత్మలపై పెట్టే పెట్టుబడి అని నేను అనుకుంటున్నాను.
మీరు వివాహం చేసుకున్నప్పుడు, అన్నీ అద్భుతంగా ప్రారంభమవుతాయి, మీరు ఒకరిని ఒకరు ప్రేమిస్తారని నా ఉద్దేశం.కానీ కొంతకాలం గడిచిన తరువాత, రకరకాల పుస్తకాలను చదివినప్పుడు – “మీరు మీ భార్యపై ఎలా పెట్టుబడి పెడుతున్నారు? అనే ప్రశ్నను మీరు వింటారు. “నా భార్యపై పెట్టుబడా? దాని అర్థం ఏమిటి?
భార్య లేదా భర్త తమ జీవిత భాగస్వామిపై పెట్టే అతిపెద్ద పెట్టుబడి వారు తమ స్వంత ఆత్మలపై పెట్టే పెట్టుబడి.
అభివృద్ధి చెందుతున్న మీ స్వంత ఆత్మీయ జీవితం నుండి దానిని వేరుచేయడం చాలా సులభం అని నేను అనుకుంటున్నాను. తద్వారా అది ఒక ప్రాజెక్ట్ గా భావించే ఆస్కారం ఉంది: “వివాహం ఒక ప్రాజెక్ట్. మరో పుస్తకం చదవాలి. మరో సెమినార్ కు వెళ్లాలి. సరైన ప్రేమ భాషను నేర్చుకోవాలి.” అవన్నీ మంచివే కావచ్చు, కానీ అంతకంటే ముఖ్యమైనది: నేను ప్రభువు వద్దకు వెళ్లి, “దేవా, నన్ను నూతనమైన వ్యక్తిగా మార్చండి” అని దేవునిలో పెట్టుబడి పెడుతున్నానా? ఇది కేవలం మీ క్రైస్తవ జీవిత ప్రారంభంలో మాత్రమే ప్రార్థించేది కాదు. చాలా కాలం జీవించిన వారికి ఈ రోజు మనం పాపులమని తెలుసు. నేను నా భార్యతో నోరు తెరిచి మాట్లాడినప్పుడు, నేను ఆమెపై పెట్టుబడి పెట్టడమే కాదు, నేను గతంలో ఉన్నదానికంటే ఎక్కువ ప్రేమను ఇవ్వగలిగే వ్యక్తిగా ఎదగడానికి నా మీద నేను పని చేయాలి.
నీ సొంత పరిశుద్ధత కోసం పోరాడు:
అందుకే 73 ఏళ్ల వయసులో కూడా నా పవిత్రత కోసం ప్రతిరోజూ పోరాడడం ద్వారా నా పెళ్లి కోసం పోరాడుతున్నాను. నేను బైబిల్ వద్దకు వెళ్లి దయలేనివాడిగా ఉండకుండా, విమర్శనాత్మకంగా ఉండకుండా చేయమని అడుగుతున్నాను. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహమును నేను కోరుతున్నాను. అదే ఆనందకరమైన వివాహానికి కావలసినది. ప్రధానంగా యుద్ధం నా లోపల జరుగుతుంది. ఒకవేళ గొడవ జరిగినా సరే, అక్కడే ప్రధాన యుద్ధం.
కొలస్సీ. 3:13 చాలా ప్రాముఖ్యమైన వచనం అని నేను అనుకుంటున్నాను: “ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి.” మీరు “భరించడం” అని కూడా అనువదించవచ్చు. సహించడం అనేది నిజంగా వినడానికి అంత ప్రేమ గల పదమేమి కాదు.
క్షమాగుణం ఆశ్చర్యమైన, అద్భుతమైన విషయం. ప్రతి జీవిత భాగస్వామికి క్షమించమని అడగడం మరియు క్షమించడం ఒక అలవాటుగా ఉండాలి. ఇది దాదాపు ప్రతిరోజూ జరగాలని నేనంటాను. కానీ ఇక్కడ నేను చాలా త్వరగా నేర్చుకున్న విషయం ఒకటి ఉంది. నన్ను బాధపెట్టేది పాపం అని ఆమె అనుకోదు. ఆమె పశ్చాత్తాపపడటానికి ఏమీ లేదు. అందువల్ల, నేను క్షమించడానికి ఏమీ ఉండదు. అది నాకు కోపం వచ్చేలా చేస్తుంది. ఇప్పుడు ఏమి చేయాలి? అది హాస్యంగా అనిపించవచ్చు, కానీ అది నిజంగా ఒక గంభీరమైన సమస్య.
పెంటకుప్పను వదిలించుకోండి:
బైబిల్ చాలా ప్రశస్తమైన గ్రంథం. ఇది చాలా మంచి పుస్తకం. ఇది గొప్ప వివాహ పుస్తకం, ఉత్తమ వివాహ పుస్తకం. “ఒకరినొకరు సహించండి” అని చెబుతుంది. దీనిని వివరంగా చూద్దాం. దాని అర్థం ఏమిటి? పెళ్లి గురించి ఒక పుస్తకం రాశాను. బహుశా ఆ పుస్తకంలో అతి ముఖ్యమైన విషయం పెంటకుప్ప ఉదాహరణ. ప్రతి పెళ్లికి ఒక పెంటకుప్ప అవసరం.
పెంటకుప్ప అంటే ఏమిటో మీకు తెలుసా? మీకు విశ్రాంతి తీసుకోడానికి చాలా అనువైన అందమైన ఆకుపచ్చ పెరటిని కలిగి ఉండడం లాంటిది. ఇది ఒక గొప్ప ప్రదేశం. వివాహ బంధంలో మీరెవరూ పాపంగా పరిగణించని అసహ్యమైన, గందరగోళమైన, హానికరమైన విషయాలు ఉన్నాయి. మీరు ఆ విషయంలో తప్పు అవ్వచ్చు.
ప్రతి జీవిత భాగస్వామికి క్షమించమని అడగడం మరియు క్షమించడం ఒక అలవాటుగా ఉండాలి.
కాబట్టి మీరు ఒక మూలన పెంటకుప్పను నిర్మించుకుంటారు, మరియు మీరు మీ జీవిత భాగస్వామి యొక్క ఆ అలవాటును కనిపించకుండా పెంటకుప్పలో విసిరేస్తారు.
ఇప్పుడు, మీరు పెంటకుప్ప వద్ద బస చేస్తూ రాత్రంతా దుర్వాసనతో కూడిన వస్తువులను వాసన చూడవచ్చు. లేదా దాని చుట్టూ కర్టెన్ లాగి మీరు వివాహం చేసుకున్న మహిళతో కలిసి పచ్చని గడ్డిపై పిక్నిక్ టేబుల్ వద్ద పిక్నిక్ చేయవచ్చు. మీ సమస్యలు మరియు ఆమె సమస్యలు అంతా పెంటకుప్పలో ఉండగా, అవి అక్కడ ఉన్నాయని మీ ఇద్దరికీ తెలుసు, కానీ మీరు వాటిని ప్రస్తుతానికి పక్కన పెట్టారు. అక్కడ ఒక పెంటకుప్ప ఉందని మీకు తెలుసు. మీరిద్దరూ ఒకరి కళ్ళలోకి మరొకరు చూస్తూ “మేము దాని గురించి ఇప్పుడే మాట్లాడబోము. మనవరాళ్లను ఆస్వాదిద్దాం, బార్బెక్యూ చేద్దాము” అని ఒకరితో ఒకరు చెప్పుకుంటారు.
మీ స్వంత పాపాన్ని అంగీకరించి దానిని ఒప్పుకోండి.
ప్రవర్తనలు తరువాత వస్తాయి. ముందు అంతరంగములోని విషయాలు: వైఖరులు, భావాలు, కోపాలు, ఆనందాలు. అక్కడే యుద్ధం జరుగుతుంది – యేసు సహాయంతో, బైబిల్ ను ఉపయోగిస్తూ – తద్వారా మీరు ఉదయాన్నే లేచి, యేసుతో అరగంట తర్వాత మీ స్వంత పాపాన్ని అంగీకరించి, ఒప్పుకున్న తర్వాత అల్పాహారం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు, మీరు గొప్ప విషయాలు మాట్లాడగలుగుతారు.
సంబంధాల విషయానికి వస్తే ఇది నా భార్యకు ఇష్టమైన వచనం అని నేను అనుకుంటున్నాను: “వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడి.” (ఎఫెసీ. 4:29). “నువ్వు ఆ విషయంలో ఇంకా బాగా ఎదగాలి” అని ఆమె నన్ను ఎప్పుడూ తప్పుపట్టేది అదే.

జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Powered By ABNY Web