శుభోదయం, నేటి పాడ్‌కాస్ట్‌వింటునందుకు ధన్యవాదాలు. మనం ఈ వారాన్ని అర్నాల్డో అనే ఒక శ్రోత నుండి వచ్చిన ఒక పదునైన మరియు బలమైన ప్రశ్నతో ప్రారంభిస్తున్నాము. “టోనీ మరియు పాస్టర్ జాన్ గార్లకు నమస్కారం. ఈ పాడ్‌కాస్ట్ కోసం మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు! ఈ ప్రశ్నతో గత రెండు దశాబ్దాలుగా నేను ప్రయాసపడుతున్నాను. అది ఏమిటంటే: నేను మంచి మనస్సాక్షి కలిగి ఎలా జీవించగలను? అపొస్తలుడైన పౌలు తరచుగా మనస్సాక్షి గురించి మాట్లాడుతారు, ప్రత్యేకంగా ‘మంచి మనస్సాక్షి’తో జీవించడం అనేది అతడు క్రైస్తవుడిగా మారడానికి ముందు కూడా ఉన్న విషయమని తెలుస్తోంది (అపొస్తలుల కార్యములు 23:1; 24:16). అలాగే, ‘మంచి మనస్సాక్షి’ క్రైస్తవ నాయకుల కోసం అవసరమైన అర్హత అని మనం చూస్తాము (1 తిమోతికి 3:9). అంతేకాక, ‘మంచి మనస్సాక్షి’ కలిగి ఉండటం అనేది ప్రతి విశ్వాసికి క్రైస్తవ జీవితంలో ఒక ముఖ్యమైన లక్ష్యం (1 తిమోతికి 1:5, 19).

“పౌలు ఈ సందర్భాలలో “మనస్సాక్షి” అనే పదాన్ని ఉపయోగించిన విధానాన్ని నేను చదివినప్పుడు, దాని అర్థం ‘దేవుడు తనకు వెల్లడించిన ప్రతిదానికీ విధేయతతో నడవడం’ అని చెబుతున్నట్లు అనిపిస్తుంది. తన అంతరంగపాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి క్రీస్తు రక్తంలో నమ్మకం ఉంచుతున్నాడని అర్థం కాదు. అంతరంగ పాపం మరియు ప్రగతిశీల పవిత్రీకరణ సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను (సామెతలు 4:18 మరియు రోమ 7:21–23 ప్రకారం). నేను పవిత్రతలో ఎదగడానికి అవసరమైన కొత్త వాటిని, మరియు కొన్నిసార్లు పాత వాటిని దేవుడు ఎప్పటికప్పుడు నాకు వెల్లడిస్తుంటాడు. ఇవి చాలా నిజమైన పాప సమస్యలు, వీటిని నేను కేవలం లైట్ స్విచ్ ఆఫ్ చేసినట్లుగా నేరుగా  ఆపలేను. ఇవి దీర్ఘకాలికమైన, నిరంతర పోరాటం మరియు సంఘర్షణలో నిమగ్నమై ఉన్నవి. కాబట్టి, నేను ప్రతీ రోజు క్షమాపణ కోరుతూ ప్రార్థిస్తాను (1 యోహాను 1:8–10 మరియు మత్తయి 6:12 ప్రకారం). 

నేను ప్రస్తుతం పశ్చాత్తాపపడి మరింత పవిత్రంగా మారాల్సిన ముఖ్యమైన మార్గాల గురించి నాకు ఎల్లప్పుడూ తెలుసు, గనుక నాకు మంచి మనస్సాక్షి లేదని అర్ధం. కాబట్టి మంచి మనస్సాక్షి అనేది క్రైస్తవ జీవితానికి ముఖ్యమైనదైతే, పౌలు ఎప్పుడూ మంచి మనస్సాక్షిని కలిగి ఉన్నాడంటే, అయితే నా జీవితంలో పాపం గురించి నాకు ఎప్పుడూ తెలుస్తూ ఉంటుంది మరియు నేను ప్రతిరోజూ క్షమాపణ కోసం ప్రార్థించాల్సి ఉంటే, నేను లేదా మరి ఏ క్రైస్తవుడైనా మంచి మనస్సాక్షిని ఎలా పొందగలము?”

“అర్నాల్డో తన ప్రశ్నను అడిగే ముందు గణనీయమైన పరిశోధన చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన ఆ ప్రశ్నలో ఉల్లేఖించిన వచనాలలోనే సమాధానం దొరికే అవకాశం ఉంది. నేను కూడా కొన్ని వచనాలను జతచేయాలనుకుంటున్నాను, ఇవి ఈ అంశాన్ని మరో కోణంలో చూడటానికి సహాయపడతాయి. ఈ ప్రశ్నను అతడు యాదృచ్ఛికంగా అడగలేదు; గంభీరంగా పరిశీలించి అడిగారు.కాబట్టి, సమాధానం ఎక్కడ ఉందంటే, అతడు చెప్పిన వచనాలలోనే దాన్ని కనుగొనవచ్చు. అయితే, అతడు ఆ వచనాల నుండి కొన్ని తార్కిక నిర్ధారణలు చేసుండవచ్చు, అవి తప్పుగా ఉండే అవకాశం ఉంది.

అంతరంగంలో నివసించే పాపం

ఆ ప్రశ్న యొక్క శక్తి నాకు బాగా అర్థమైంది. అనుభవపూర్వకంగా, నాలో నిరంతరంగా ఉన్న, అంతరంగ పాపం గురించి అర్నాల్డోకు ఉన్న లోతైన అవగాహనను నేను పంచుకుంటున్నాను కాబట్టి, మంచి మనస్సాక్షితో నడవడం నాకు అంత సులభం కాదు. రోమా 7:17, 20, 23 లో పౌలు చెప్పిన మాట అదే. మనందరిలో అవినీతి మరియు అంతరంగంలోఉన్న పాపం మిగిలి ఉన్నాయి. మనం దీని గురించి ఎంత స్పష్టమైన అవగాహన కలిగి ఉంటామో, మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలనే పోరాటం అంత తీవ్రంగా అనిపిస్తుంది.

“ఈ జీవితంలో ఎవరూ పాపం లేని పరిపూర్ణతను పొందుకోలేరని కొత్త నిబంధన చెబుతుంది.”

నాకు ఒక విషయం అర్థమైంది. నా ఉద్దేశ్యం ప్రకారం అది చాలా తీవ్రమైన ప్రశ్న అని నేను అనుకుంటున్నాను. ఈ జీవితంలో ఎవరూ పాపరహిత పరిపూర్ణతను పొందలేరని మొత్తం కొత్త నిబంధన సూచిస్తుంది. మనం దానిని పరిష్కరించుకోవాలి. అది ఒక ప్రాథమిక విషయం. ఈ జీవితంలో ఎవరూ  పాపం లేని పరిపూర్ణతను పొందలేరు.

“మా ఋణములు క్షమించుము” అని ప్రార్థించమని యేసు చెప్పాడు, “మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము” (మత్తయి 6:11,12). అవి పక్క పక్కనే కలిసి ఉంటాయి. ప్రతి రోజు, ఆ రెండింటినీ గూర్చి ప్రార్థించాలి. పౌలు ఇలా అన్నాడు, “ఇదివరకే  [పరిపూర్ణతను] నేను గెలిచితిననియైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిననియైనను నేను అనుకొనుటలేదు గాని, నేను దేనినిమిత్తము క్రీస్తు యేసుచేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తు చున్నాను” (ఫిలిప్పీయులు 3:12). తనలో నివసించే పాపాన్ని ప్రస్తావించి, “అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?” (రోమా 7:24) అని నిరుత్సాహంగా రోదించాడు. తనకు స్పష్టమైన మంచి మనస్సాక్షి ఉందని, నాకు పశ్చాత్తాపం అవసరం లేదు అని దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్న పరిసయ్యుడికి వ్యతిరేకంగా, “దేవా, పాపినైన నన్ను కరుణించు!” అని చెప్పిన పన్ను వసూలు చేసే సుంకరి వైపు యేసు చూపిస్తూ తన పాపం గురించి కరుణ కోసం కేకలు వేసినవాడు నీతిమంతుడిగా తీర్పు తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడని ఆయన చెప్పాడు (లూకా 18:10–14). అతను తన పాపాలను అంగీకరించడం మంచిది, “నాలో పాపం లేదు. నాకు స్పష్టమైన మంచి మనస్సాక్షి ఉంది.  పశ్చాత్తాపపడటానికి నా దగ్గర ఏ పాపం లేదు అని చెప్పడం కాదు. మనం ఆ శక్తిని అనుభవిస్తున్నాము. 

ఇప్పుడు, 1 యోహాను 1 ప్రత్యేకంగా ప్రకాశవంతం వెలుగును ఇవ్వడమే కాకుండా, మంచి మనస్సాక్షితో పాటు పరిష్కారాన్ని అందించే ఒక సత్యాన్ని కూడా మనకు ఇస్తుందని నేను భావిస్తున్నాను.

వెలుగులో నడవడం

1 యోహాను 1:6,7 వచనాలు నేను ఇక్కడ చదువుతున్నాను.

“ఆయనతోకూడ సహవాసముగలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినయెడల మనమబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల, మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.”

ఇప్పుడు, అది ఆశ్చర్యకరంగా అద్భుతమైనది. “మనం వెలుగులో నడిచినయెడల… యేసు రక్తము… మనలను పవిత్రులనుగా చేయును.” అద్భుతం. 1 యోహాను 1:8 ఇలా చెబుతోంది: “మనము పాపములేనివారమని చెప్పుకొనినయెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్యముండదు.” ఇప్పుడు అతను దాన్ని తిరిగి చెబుతూ , “‘వెలుగులో నడుచుకోండి’ అని నేను చెప్పినప్పుడు,నా ఉద్దేశ్యం పాపరహితమని అనుకోకండి” అని అంటున్నాడు. మొదటి యోహాను 1:9–10 ఇలా చెబుతోంది ” మన పాపములను మనము ఒప్పుకొనినయెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనినయెడల, ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము; మరియు ఆయన వాక్యము మనలో ఉండదు.”

ఇప్పుడు, ఈ వాక్యభాగంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, యేసు రక్తం మన పాపాల నుండి మనల్ని శుద్ధి చేయడానికి మనం వెలుగులో నడవాలి అని అది చెబుతుంది. తరువాత అతను ఈ వెలుగులో నడవడం అంటే పాపరహితం కాదు అనిచెబుతాడు. అలా చెబితే మనం అబద్ధికులం. తర్వాత అతను వివరిస్తూ మనం వెలుగులో నడిస్తే, మనం పాపాన్ని గుర్తించడానికి, పాపం ఏమిటో తెలుసుకోవడానికి, దానిని ద్వేషించడానికి మరియు ఒప్పుకోవడానికి మనకు తగినంత స్పష్టత ఉంటుందని గమనిస్తాము. అప్పుడు మనం నిరంతర శుద్ధీకరణను మరియు క్షమాపణను అనుభవిస్తాము.

“మంచి మనస్సాక్షి కలిగి ఉండడం అంటే వెలుగులో నడవడం లాంటిదే.”

ఈ వాక్యభాగాన్ని వివరించడానికి నేను మనస్సాక్షి శ్రేణిని ఉపయోగిస్తే దీని నుండి నేను ఏమి నేర్చుకుంటాను: మంచి మనస్సాక్షి అంటే వెలుగులో నడవడం లాంటిదే. క్రైస్తవులు “నేను వెలుగులో నడుస్తున్నాను” “నేను మంచి మనస్సాక్షితో నడుస్తున్నాను” అని చెప్పగలగాలి. అంటే మనం చెడు మనస్సాక్షిని కలిగి ఉండటాన్ని అంతరంగంలోఉన్న పాపంతో సమానం చేయకూడదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు, నేను చెప్పే అతి ముఖ్యమైన విషయం అదే కావచ్చు, టోనీ. మళ్ళీ చెప్పనివ్వండి.

1 యోహాను 1 లో నేను చెప్పిన దాని నుండి, చెడు మనస్సాక్షి కలిగి ఉండటం అంటే అంతర్లీనంగా ఉన్న పాపం కలిగి ఉండటం లాంటిది కాదని నేను భావిస్తున్నాను. అవి ఒకేలా ఉండవు.

మన నిర్మలమైన మనస్సాక్షి

అర్నాల్డో ఇచ్చిన ప్రశ్నకు నా ప్రాథమిక సమాధానం అదే. రోమా 7 లో ఉన్నట్లుగా, అంతర్లీనంగా ఉన్న పాపం యొక్క వాస్తవికత గురించి తనకు తెలిసినంత వరకు, తనకు మంచి మనస్సాక్షి ఉండదని అతను భావిస్తున్నాడు. ఇప్పుడు అది నిజమైతే, పౌలుకు ఎప్పటికీ మంచి మనస్సాక్షి ఉండదని నేను అనుకుంటున్నాను, కానీ తనకు మంచి మనస్సాక్షి ఉందని అతను స్పష్టంగా చెబుతున్నాడు.

నాపితురాచారప్రకారమునిర్మలమైనమనస్సాక్షితోనేనుసేవించుచున్నదేవునియెడలకృతజ్ఞడనైయున్నాను” (2 తిమోతి 1:3). సంఘ పెద్దలు కూడా అలాగే చేయాలని పౌలు ఆశిస్తున్నాడు: “విశ్వాసమర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారై యుండవలెను” (1 తిమోతి 3:9). అదే క్రైస్తవులందరి లక్ష్యం. 1 తిమోతి 1:5 ప్రకారం, “ఉపదేశసారమేదనగా, పవిత్ర హృదయమునుండియు, మంచి మనస్సాక్షినుండియు, నిష్కపటమైన విశ్వాసము నుండియు కలుగు ప్రేమయే.” మనం ఈ జీవితంలో మంచి మనస్సాక్షిని పాపరహిత పరిపూర్ణతతో సమానం చేయాలి లేదా చెడు మనస్సాక్షిని అంతర్లీనంగా ఉన్న పాపం లేదా మిగిలిన అవినీతి ఉనికితో సమానం చేయాలి అని నేను అనుకోవడం లేదు. బదులుగా స్పష్టమైన లేదా మంచి మనస్సాక్షి అంటే వెలుగులో నడవడం లాంటిది.

అయితేఆయనవెలుగులోనున్నప్రకారముమనమునువెలుగులోనడిచినయెడల, మనముఅన్యోన్యసహవాసముగలవారమైయుందుము; అప్పుడుఆయనకుమారుడైనయేసురక్తముప్రతిపాపమునుండిమనలనుపవిత్రులనుగాచేయును. మనముపాపములేనివారమనిచెప్పుకొనినయెడల, మనలనుమనమేమోసపుచ్చుకొందుము; మరియుమనలోసత్యముండదు. మనపాపములనుమనముఒప్పుకొనినయెడల, ఆయననమ్మదగినవాడునునీతిమంతుడునుగనుకఆయనమనపాపములనుక్షమించిసమస్తదుర్నీతినుండిమనలనుపవిత్రులనుగాచేయును.  (1 యోహాను 1:7–9)

దావీదు యొక్క ఉదాహరణ

అంతర్గతంగా నివసించే పాపం నిరంతరగా ఉన్నప్పటికి అదేసమయంలో మంచి మనస్సాక్షి కూడా కలిగియుండగలం అనే అంశాన్ని పౌలు మరియు యోహాను పాత నిబంధనలోని కీర్తనల నుండి స్వీకరించారని నేను అనుకుంటున్నాను 

ఉదాహరణకు, 25వ కీర్తనలో దావీదు తాను పాపినని మూడుసార్లు ఒప్పుకున్నాడు. “తన మార్గమునుగూర్చి ఆయన[దేవుడు] పాపులకు ఉపదేశించును” (8వ వచనం); “యెహోవా, నా పాపము బహు ఘోరమైనది నీ నామమునుబట్టి దానిని క్షమింపుము” (11వ వచనం); “నా పాపములన్నిటిని క్షమింపుము” (18వ వచనం). ఈ కీర్తన 21వ వచనంలో ఇలా ముగుస్తుంది: “నీకొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక”. 

దావీదు దేవుని ప్రేరణతో ఇది వ్రాస్తున్నాడు. కీర్తనలలో ఇది ఒక్కటే కాదు; నీతిమంతులను, దుష్టులను వేరుచేసే కీర్తనలు చాలా ఉన్నాయి. నీతిమంతులు నిజంగా నీతిమంతులు: వారు వెలుగులో నడుస్తున్నారు; వారికి మంచి మనస్సాక్షి ఉంటుంది. తనలో యథార్థత, నిర్దోషత్వము ఉన్నప్పటికీ అంతరంగంలో ఉన్న పాప స్వభావాన్ని బట్టి పాపం కొన్ని సార్లు తనలో నుండి బయటపడుతుందని దావీదుకు తెలుసు. అది జరుగుతుంది. అయితే అంతరంగంలో ఉన్న ఆ పాప స్వభావం దావీదు తన యథార్థత మరియు నిర్దోషత్వము అని పిలిచే దానిని రద్దు చేయలేదు.

పౌలు మరియు యోహాను ఈ విషయాన్ని గ్రహించారని నేను అనుకుంటున్నాను. వారు పాత నిబంధనలో మునిగిపోయి ఆ విధంగా భాషను ఉపయోగించారు. మనం అపరిపూర్ణులమైనప్పటికీవెలుగులో నడవడం అనే భాషను యోహాను ఉపయోగించాడు. మనం అపరిపూర్ణులమైనప్పటికీ మంచి మనస్సాక్షితో నడవడం అనే భాషను పౌలు ఉపయోగించాడు. దావీదు, పౌలు, మరియు యోహాను ఈ విధంగా ఆలోచించడానికి వీలు కల్పించిన కీలక అంశం ఏమిటంటే, వారి పాపాలన్నీ తొలగిపోవడానికి దేవుడు గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడని వారికి తెలుసు . ఇలా  దేవుడు చేయబోతున్నాడనిదావీదుకు తెలుసు, మరియు పౌలు, యోహానులకు అది దేవుడు చేసాడని తెలుసు. 

విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడటం అంటే మంచి మనస్సాక్షితో నడవడం, వెలుగులో నడవడం లేదా యదార్థత కలిగి ఉండటం లాంటిది అని అర్నాల్డో చెప్పడం సరైనదని కాదని నేను భావిస్తున్నాను. అవి గుణానికి సంబంధించిన లక్షణాలు, ఆరోపించబడిన నీతి కాదు. అయినప్పటికీ, యేసు రక్తం ద్వారా వారి పాపాలన్నింటినీ కప్పివేయడం వలన వారు తమ మనస్సాక్షిని, నడకను, యథార్థతను కృతజ్ఞతతో మరియు నమ్మకంతో చూడటానికి వీలు కల్పిస్తుంది, అది అసంపూర్ణమైనప్పటికీ దేవుడు నిజంగా అది మంచిదని అంగీకరిస్తాడు.

యదార్థత గల వ్యక్తులు

ఇక్కడ చివరిగా ఒక అర్థం ఉంది. ప్రజలు “సరే, ఇది ఎలా ముఖ్యం?” అని అనుకోవచ్చు, ఇది ఎలా ముఖ్యమో ఇక్కడ ఒక నిర్దిష్ట ఉదాహరణ ఉంది. ఒక పాస్టర్ తన భార్యకు నమ్మకద్రోహం విషయంలో తప్పుగా ఆరోపించబడ్డాడని అనుకుందాం. సంఘంలో ఎవరో ఒకరు అతన్ని ద్వేషించి, అతనిని తొలగించాలని కోరుకుంటున్నారు కాబట్టి అతనిపై ఆరోపణలు చేసారు. తన పిల్లలు అక్కడ ఉండగా, భార్య చూస్తుండగా, సంఘం లేదా పెద్దల ముందుకు సత్యాన్ని చెప్పడానికి వచ్చినప్పుడు, “సరే, అవును నేను అందరిలాగే పాపిని. నేను వ్యభిచారుల కంటే గొప్పవాడిని కాదు. ప్రతి ఒక్కరూ అంతరంగంలో పాప స్వభావాన్ని కలిగి ఉంటారు, అది అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటుంది. “నన్ను ఎవరూ పెద్దగా పట్టించుకోకూడదు. నేను ఎవరికన్నా గొప్పవాడిని కాదు” అని సంఘానికి చెప్పడానికి అతనికి సమయం కాదు.

కాదు, కాదు, కాదు. మీ పిల్లలు వింటూ ఉండగా, మీ భార్య చూస్తూ ఉండగా, సంఘం మొత్తం ఆశ్చర్యపోతుంటే అలా చెప్పడానికి ఇది సమయం కాదు.  ఆ సమయంలో మీరు చెప్పాల్సింది ఇది: “నా మనస్సాక్షి స్పష్టంగా మంచిగా ఉంది. నేను నిజాయితీపరుడిని. నేను వెలుగులో నడిచాను. “నేను నా భార్యను తప్ప ఆ స్త్రీని గాని మరే స్త్రీనిగాని  లైంగికంగా తాకలేదు. ఈ ఆరోపణ నిజం కాదు” అని చెప్పాలి.

సంఘ పెద్దలకుమరియు మిగిలిన వారికి మనం మంచి మనస్సాక్షితో నడవాలని పౌలుచెప్పినప్పుడు, యోహాను వెలుగులో నడుచుకోవాలని చెప్పినప్పుడు దానియొక్క ఒకానొక భావం ఇదే అని నేను అనుకుంటున్నాను.  

Author

  • జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

జాన్ పైపర్
జాన్ పైపర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *