నాకున్న వినోదపు అలవాట్లు నా ఆత్మ గూర్చి ఏమి వెల్లడిస్తున్నాయి?

నాకున్న వినోదపు అలవాట్లు నా ఆత్మ గూర్చి ఏమి వెల్లడిస్తున్నాయి?

షేర్ చెయ్యండి:

ఇది అంటువ్యాధి సోకినప్పుడు అందరికీ వేరుగా ఉన్నప్పటి స్థితికి సంబంధించిన ప్రశ్న. ఈ సంవత్సరం మనమందరం చాలా సమయాన్ని ఇంట్లోనే గడిపాము. ఇది ఒక యౌవనస్థురాలి యొక్క హృదయాన్ని పరిశోధిస్తున్న ప్రశ్న. ఈమె క్వారంటైన్లో ఉండినప్పుడు అంటే ఇతరులకు వేరుగా ఉండినప్పుడు, వినోదసంబంధ విషయాల్లో తన సమయం గడపడం వలన, అది తన ఆత్మ యొక్క స్థితి (పరిస్థితి) గూర్చి ఏమి చెబుతున్నాయో తెలిసికోవాలని ఆశిస్తున్నది. ఆమె పంపిన ఇమెయిల్‌లో ఇలా వ్రాసింది: ‘‘హల్లో, పాస్టర్‌ జాన్‌ గారూ! ఈ ‘కోవిడ్‌’ మహమ్మారి వ్యాపించిన దినాల్లో ‘లాక్‌డౌన్‌’ విధింపబడింది. ఆ సమయంలో, నాలో ఒత్తిడి ఎక్కువైనప్పుడు నేను బైబిల్‌ చదవలేదనీ, ప్రార్థించలేదనీ నేను తెలుసుకున్నాను. ఈ ‘లాక్‌డౌన్‌’ సమయంలో నేను, తినడం, నిద్రపోవడం, ఒత్తిడి కలిగిన సమయమంతా చలన చిత్రాలు చూడటంలోనే గడిపాననే విషయాన్ని నేను ఎన్నడూ గమనించలేకపోయాను. ఈ ‘లాక్‌డౌన్‌’ సమయం లోని మొదటి రెండు వారాలు నేను సరిగ్గా ఇలాగే గడిపాను. ‘లాక్‌డౌన్‌’ ఎత్తివేయబడిన తరువాత నేను మారుతాననీ, నా అలవాట్లను మార్చుకుంటాననీ అనుకున్నాను. గాని లాక్‌డౌన్‌ ఎత్తివేయబడి ఇన్ని నెలలు గడిచినా, నేను దేవునితో మాట్లాడడంలో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను. ఇది నాకెంతో భయాన్ని, బాధను కలిగిస్తుంది. నేను నిజంగా సంతోషంగా లేను, విసుగెత్తిపోయి యున్నాను. నా ప్రశ్నేమంటే, లాక్‌డౌన్‌ సమయంలో నేనెదుర్కొన్న ఆందోళన సందర్భంలో, నేను ఎక్కువ కాలం దేవుని ప్రార్థించలేకపోయాను కదా, అలాగైతే, నేను నిజంగా దేవుని ప్రేమించడంలేదని లేదా నేను నిజంగా దేవుని నమ్మడంలేదని అర్థమా?’’   

నేను (పాస్టర్‌ జాన్‌గారు) ఈ ప్రశ్నను రెండు భాగాలుగా చేస్తున్నాను. నీవు దేవుని ప్రేమించాల్సిన విధంగా ప్రేమించలేదని, నమ్మాల్సిన విధంగా నమ్మలేదని, గత రెండు నెలల్లోని నీ అనుభవం నీకు చూపించింది. ఇప్పుడు నా ప్రశ్న ఏమంటే, నేనిలా ఎందుకంటున్నాను? తినడం, నిద్రపోవడం, సినిమాలు చూడడానికి, నీవు దేవుని ప్రేమించాల్సిన విధంగా ప్రేమించలేదని మరియు దేవుని నమ్మాల్సిన విధంగా నమ్మలేదని చెప్పడానికి, మధ్య ఎందుకు సంబంధమున్నది? కాబట్టి, నా మొదటి ప్రశ్న ఏమంటే, అసలు అలా ఎందుకు అడుగుతున్నావు? ఆ అవసరమేమున్నది? ఇక రెండవ ప్రశ్న ఏమంటే, నీవు నిజంగా దేవుని ఏమాత్రమును ప్రేమించడంలేదనీ, నమ్మడంలేదనీ, గనుక నీవొక క్రైస్తవ విశ్వాసివి, తిరిగి జన్మించిన వ్యక్తివి కావని ఎలా వివేచిస్తాము? ఈ అభిప్రాయానికి ఎలా వస్తాము? ఈ రెండు ప్రశ్నలు నిజముగా ముఖ్యమైనవే – పరలోకం మరియు నరకమంత ముఖ్యమైనవి – కాబట్టి ఒక్కొక్క దాని గూర్చి ఆలోచిద్దాం. 

చలన చిత్రాలు ఏమి చేయలేవు? 

మొదటి ప్రశ్న: ఒక యౌవనస్థురాలు, తన సమయాన్ని ఖచ్చితంగా బైబిలు చదవడం, ధ్యానించడం, దేవుని వాక్యము మరియు జ్ఞానముగల రచయితలు రచించిన పుస్తకాలు చదవడం, ఇతర ఆరోగ్యకరమైన పనుల కొరకు ప్రార్థించడానికి వివేచించి వాడుకొనాల్సి యుండగా, ఆమె తన సమయాన్ని, ముఖ్యంగా ఒత్తిడి కలిగే సమయాలను, తినడానికి, నిద్రపోడానికి మరియు చలన చిత్రాలు చూడటానికి కేటాయించింది. అందువల్ల ఆమె  దేవుని ప్రేమించాల్సిన విధంగా ప్రేమించడంలేదనీ, ఆయనను నమ్మవలసిన విధంగా నమ్మడంలేదనీ నేనెందుకంటున్నాను? 

‘‘నీవు ప్రేమించే, ఎక్కువగా ఇష్టపడే విషయంలో నీవు హద్దులేకుండ నిమగ్నమై (మునిగిపోయి) యుండవచ్చునని చెప్పబడటం ఒక భారం కాదు.’’ 

నేనడిగిన మొదటి ప్రశ్నకు జవాబు: దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుడు మన హృదయంలో విలువైన స్థానాన్ని కలిగియుండడం అని అర్థం, అది మనము ఆయనను ఇంకా శ్రేష్టంగా తెలుసుకోవాలని, ఎక్కువగా ఆస్వాదించాలని మరియు స్నేహం మరియు సహవాసంలో ఆయనకు దగ్గరగా ఉండాలని కోరుకునేలా చేస్తుంది. సినిమాలు ఈ పని చేయలేవు, అలా చేయాలని అవి రూపింపబడలేదు. వాస్తవానికి, 99.9% చలన చిత్రాలు ఆయనను తెలుసుకోవాలి, ఆయనను ఆనందంగా అనుభవించాలి మరియు ఆయనకు సన్నిహితంగా ఉండాలనే వాటిని ఆటంకపరుస్తూ మనల్ని అణచివేయడానికి రూపింపబడినవి. సినిమాలు ఇటువంటి ప్రభావం కలిగియుండవు. 

కాబట్టి, ప్రతి రోజూ సినిమాలు చూడటంలో తప్పనిసరిగా నిమగ్నమవుతున్నావంటే, దేవుని పట్ల నీకుండాల్సిన ప్రేమ బలహీనంగా ఉన్నదని, అది రోజు రోజుకూ మరింత బలహీనమవుతున్నదనటానికి సంకేతమై ఉంది. 

లోబడుటకుగల స్వాతంత్య్రము

1 యోహాను 5:3-4, 

     ‘‘మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టినవారందరును లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే.’’

ఈ వాక్యభాగము ఈ స్త్రీ అడుగుతున్న రెండు విషయాలను ఒక్క చోటికి తెస్తున్నది: దేవుని యెడల ప్రేమ మరియు దేవుని యందలి నమ్మిక, ప్రేమ మరియు విశ్వాసము. 

మొదటిదిగా, దేవుని పట్ల మనకుగల ప్రేమ మనం దేవున్ని సంతోషపరుస్తూ ఆయనకు సన్నిహితంగా ఉండేంతగా ఆనందింపజేస్తుందని, కాబట్టి మనం ఆయన ఆజ్ఞలకు లోబడడం మనకు భారంగా ఉండదని యోహాను చెబుతున్నాడు. ఆ తరువాత, భారం తొలగిపోయి దేవుని ఆనందంగా అనుభవింపగల భావాన్ని, మనము లోకాన్ని జయించియున్నామనే వాస్తవానికి ఆపాదిస్తున్నాడు. అనగా, ఇకమీదట మన జీవితంపై లోకాశలు పెత్తనం చెలాయించవు,  మన జీవితాన్ని నియంత్రించే శక్తి వాటికి యుండదు, ఎందుకంటే అవి నలుగగొట్టబడ్డాయి, జయింపబడ్డాయి అని మరొక మాటలో చెప్పొచ్చు. అప్పుడు, లోకాన్ని జయించిన విజయం ఇదే,  అనగా, మన విశ్వాసమే అని యోహాను వివరిస్తున్నాడు. కాబట్టి, యోహాను ఆలోచిస్తున్న విధానం ప్రకారం, విశ్వాసమనేది దేవుని అంగీకరించే వాస్తవమై యున్నదని చెప్పవచ్చు. విశ్వాసం దేవుని అంగీకరిస్తుంది, క్రీస్తులో  దేవుడు మనకు ఏమయ్యున్నాడనే సమస్తమును అంగీకరిస్తుంది. ఆయనను అమూల్యమైన విడుదలనిచ్చేవాడిగా, సహాయంగా మరియు నిధిగా అంగీకరిస్తుంది. దాని ఫలితంగా మన జీవితాల్లో లోకం అత్యంత ఆకర్షణీయమైన విషయంగా ఉండే తన శక్తిని కోల్పోతుంది.  

గనుక, యోహాను మనస్సులో, దేవుని పట్ల గల ప్రేమ మరియు దేవుని యందున్న విశ్వాసం, ఒకదానితో మరొకటి పెనవేసుకొనియున్న వాస్తవములై యున్నవి. ఒకటి, మరొక దానిలో భాగమైయున్నది. 

ప్రేమ మరియు విశ్వాసం అనే ఈ రెండింటి యొక్క రెట్టింపు ప్రభావం ఈ క్రింది విధంగా ఉంటుంది: 

1. మనలను నియంత్రించే నిధిగా ఉండే లోకము యొక్క శక్తి నలుగగొట్టబడింది, జయింపబడింది, మరియు 

2. లోబడడం లేదా విధేయత చూపడం ఏ విధంగానూ భారమనిపించదు.

నీవు చేయడానికి ద్వేషించే పని చేయుమనిగాని, చేయకూడదనిగాని చెప్పబడటం భారం కాదు. నీవు ప్రేమించే పని, నీవు ఎక్కువగా ఇష్టపడే పని చేయడంలో నిమగ్నమై యుండుమని చెప్పబడటం భారం కాదు. ఇదొక భారం కాదు, ఇది స్వాతంత్య్రం. 

కాబట్టి, ఇప్పుడు ఈ యౌవనస్థురాలు దేవుని వాక్యమనే నిధి నుండి పొందే దాని కంటె, సినిమాలు చూచే ఉత్సాహంలో ఎక్కువ ఆహ్లాదంతో మునిగిపోతున్నప్పుడు, ఆమెకు దేవుని యెడల గల ప్రేమలోను, దేవుని యందున్న విశ్వాసంలోను లోపముందని యోహాను చెప్పుతున్నాడు. ఈ యౌవనస్థురాలు అడుగుతున్న మొదటి ప్రశ్నకు నా జవాబు ఇదే: ఈ యౌవనస్థురాలు తన సమయమంతటిని కేవలము తినడంలో, నిద్రపోవడంలో, సినిమాలు చూడడంలో గడుపుతున్నట్లయితే, విశ్వాసం మరియు ప్రేమ విషయంలో లోపమున్నదని మేమెందుకు సలహా ఇస్తున్నాము? 

విశ్వాసముతో ముందుకు సాగుము 

ఇక్కడ ఈ యౌవనస్థురాలు వాస్తవంగా అడుగుతున్న అతి ముఖ్యమైన ప్రశ్న ఉందని నేననుకుంటున్నాను. ‘‘నాలో ఆందోళనలో నేను చాలా కాలం వరకు దేవునితో మాట్లాడకుండా అనగా, ప్రార్థన చేసుకోకుండా గడిపాను. అలాంటప్పుడు, నేను దేవుణ్ణి నిజంగా ఎన్నడూ ప్రేమించలేదు, నమ్మలేదని దీని అర్థమా?’’ అని ఆమె అడుగుతున్నట్టనిపిస్తుంది. ఇదే ప్రశ్నను నేను మరొక విధంగా అడుగుతున్నాను: ఒకరు దేవున్ని ఏమాత్రమును నిజముగా ప్రేమించడంలేదని, నమ్మడంలేదని మనము ఎలా వివేచించగలము? ఒకరు యథార్థ క్రైస్తవుడు కాడని, యథార్థంగా తిరిగి జన్మించలేదని నీవెలా నిర్ణయిస్తావు? 

‘‘కృపాకనికరములుగల ప్రభువైన యేసు క్రీస్తు వైపు మరియు భవిష్యత్తు వైపు మళ్లుకొని, ఆయనతో కూడ ధైర్యముతోను, సంపూర్ణ సంతోషంతోను ఆ భవిష్యత్తులోనికి సాగుము.’’ 

సాధారణమైన నా జవాబు వినండి: గత రెండు నెలల కాలంలోని వైఫల్యాలను లేదా అంత కంటె ఎక్కువ కాలం క్రితం క్రీస్తునంగీకరించిన సమయంలోని జ్ఞాపకాలను గురించి తలుచుకుంటూ, అది నిజమైనదై ఉండిందా లేదా అనే విషయాన్ని విశ్లేషించడంలో నేను ఎక్కువ సమయం గడపను. ఇలాంటి ఆత్మపరిశీలన మరియు గతానుభవాల విశ్లేషణ, మొత్తంగా, ఆశించిన ఫలితాన్నివ్వదని నేననుకుంటున్నాను. ఏంటి ఆ ఆశించిన ఫలితం – నా రక్షణ గూర్చిన హామీ మరియు మనశ్శాంతి. మన హృదయాలు కేవలం మోసపూరితమైనవై ఉన్నాయి. మన జ్ఞాపకాలు మరియు గత అనుభవాలను అంచనావేసే మన శక్తి, కూడా పరిమితమైనవే.  

కాబట్టి, నా జవాబేమంటే, గతంలోని వైఫల్యాల గూర్చి తీవ్రంగా మారుమనస్సు పొందు, నీకు తెలిసిన మరియు జ్ఞాపకమున్న పాపములను మరియు సమస్యలను పేర్కొంటూ, వాటి గూర్చి నీవేమనుకుంటున్నావో ప్రభువుకు చెప్పు. నీ అపనమ్మకాన్ని, ప్రేమలేనితనాన్ని, అవిధేయతను మరియు లోకాశలను విడిచిపెట్టు. ఆ తరువాత నిర్ణయాత్మకంగా గతం నుండి భవిష్యత్తులోనికి మళ్లుకో. ఈ భవిష్యత్తనేది తరువాతి 5 నిమిషాలు కావచ్చు, 5 నెలలు కావచ్చు, 5 సంవత్సరాలు, 5 దశాబ్దాలు మరియు 5 శతాబ్దాలు కావచ్చు – ఆ భవిష్యత్తు దిశగా మళ్లుకో. ఇప్పటి నుంచి దేవుని యందు నమ్మకముంచు, ధీమాతో ఆయన యందు విశ్వాసముంచు మరియు ఆయనను ప్రేమించు.               

నేనిప్పుడు దీనికి సంబంధించిన స్ఫూర్తిని 2 పేతురు 1:10-11 నుండి తీసుకుంటున్నాను: 

‘‘సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసికొనుటకు మరి జాగ్రత్తపడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే (పేతురు, ఇప్పుడు మరియు ఇప్పటి నుండి భవిష్యత్తులో చేయాల్సి వున్న దాని గూర్చి మాటలాడుతున్నాడు), ఎప్పుడును తొట్రిల్లరు. ఆలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును.’’ 

అనగా, మనము నిజముగా పిలువబడ్డాం, నిజముగా ఎన్నికచేయబడ్డాం, నిజంగా దేవుని పిల్లలమై యున్నాము, నిజముగా క్రైస్తవులమై యున్నామనేది, భవిష్యత్తులోనికి విశ్వాసము మరియు విధేయతతో అడుగుపెట్టడం ద్వారా నిర్ధారింపబడుతుందని మరొక మాటలో చెప్పుకొనవచ్చు. మన రక్షణ గూర్చిన హామీ ప్రాథమికంగా గతాన్ని విశ్లేషించుట వలన కాదు గాని ప్రస్తుత మరియు భవిష్యత్‌ విశ్వాసము మరియు విధేయత గూర్చి దేవుడిచ్చిన ఆసక్తి వలన కలుగుతుంది.  

కాబట్టి, మన యౌవన స్నేహితురాలికి నేనిచ్చే సలహా ఏమంటే, గత రెండు నెలల్లోని వైఫల్యాలను మర్చిపో. దేవుని యెడల నీకున్న ప్రేమగాని విశ్వాసంగాని ఎప్పుడైనా నిజమైనదై యుండినదో లేదో అనే ఊహాగానాలను మానుకో. కృపాకనికరములను కుమ్మరించు ప్రభువైన యేసు క్రీస్తు వైపు మళ్లుకో. భవిష్యత్తు వైపు మళ్లుకో. ఆయనతో కూడ కలిసి ధైర్యంగా, సంపూర్ణ సంతోషంతో, ఆయనను మనస్ఫూర్తిగా నమ్ముతూ, పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమిస్తూ ఆ భవిష్యత్తులోనికి ముందుకు సాగిపోతూ ఉండు.  

దేవుడులేని ప్రపంచ దృష్టికోణం 

చాలా బాగా చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించిందే మరో విషయం – పాస్టర్‌ జాన్‌గారూ, ఇది నేను మీ నుండి నేర్చుకున్న విషయం. వినోదం గూర్చి మనం మాట్లాడుతున్నప్పుడు నాకు నిజంగా చాల సహాయకరంగా ఉన్న విషయం. మీరు దీనిని ఈ ఎపిసోడ్ ప్రారంభంలో ప్రస్తావించారు. చలనచిత్రాలు, టివి ప్రసారాలు వాటంతట అవే స్వాభావికంగా పాపముతో కూడినవై ఉన్నాయనేది లేదా అవి పాపమును సెలబ్రేట్ చేసుకుంటాయని  లేదా పాపము వలన వచ్చు పరిణామాలను ఏమాత్రము చూపించవనేది వినోద కార్యక్రమాలతో వచ్చిన సమస్యయై యుండనవసరం లేదు. ఇదంతా కూడా ఒక పెద్ద సమస్య. అయితే, దేవుడు లేడనే ప్రపంచ దృష్టికోణాన్ని ప్రదర్శించడం లేదా  ఆయనకు మన జీవితాలతో సంబంధం లేదన్నట్టుగా ప్రదర్శించడం వినోదం (entertainment) యొక్క సమస్యగా ఉంది.   

ఔను, నిజమే. దీన్నే యింకా ఖచ్చితంగా చెప్పాలంటే, వినోద సంబంధ కార్యక్రమాల్లో దేవుడు ప్రదర్శింపబడుట లేదు. ఇది బొత్తిగా, సంపూర్ణ శూన్యమై యున్నది. ఆ రోజుల్లో నేను అందరికీ చెప్పుతూ ఉండేవాడిని – వార్తా పత్రిక తెరిచి, పేజీ వెంబడి పేజీ చదువుతుంటాము. ఈ పుటల్లో రాజకీయాలు, వ్యాపారాలు, వినోద కార్యక్రమాలు, ప్రయాణాలు, క్రీడలు మొ॥ చాలా విషయాలుంటాయి గాని దేవుని గూర్చి ఏమీ ఉండదు, కనీసం ఒక్క పేరాగ్రాపైనా ఉండదు. ఈ విశాల విశ్వంలో, వార్తాపత్రికల్లో ఏమాత్రమును శ్రద్ధవహింపబడని అతిముఖ్యమైన వాస్తవం – దేవుడు. చలన చిత్రాల విషయంలో కూడ ఇది నిజం. లేదా, టోనీ, నీవు చెప్పినట్లు, దేవుడు ప్రదర్శింపబడినప్పటికిని, ఆయన వాస్తవంగా ఉన్నాడనే విషయాన్ని, ఆయన వలన కలుగు ప్రయోజనాన్ని ప్రశ్నిస్తుందేగాని, ఆయన యెడల మన ప్రేమ మండిపోవునట్లు ప్రదర్శించదు.                                                                                  

ఔను, నిజమే. జాన్‌ న్యూటన్‌ చెప్పినట్టు, ప్రతి రోజు, ప్రతి వార్తాపత్రికలోని ప్రధానాంశం, ‘‘దేవుడు ఏలుచున్నాడు!’’ అనేదై యుండాలి. ఆమేన్‌.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...