సువార్తను ప్రకటించడానికి కొన్ని ఆచరణాత్మకమైన సూత్రాలు

సువార్తను ప్రకటించడానికి కొన్ని ఆచరణాత్మకమైన సూత్రాలు

షేర్ చెయ్యండి:

1. ప్రార్థించాలి

‘‘నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడని’’ యేసయ్య సెలవిచ్చాడు (యోహాను 6:44). రక్షణ కార్యాన్ని చేసేది, దేవుడు గనుక ఆయన ఈ కార్యాన్ని చేయునట్లు మనం ఆయనను వేడుకోవాలి.

2. ప్రశ్నిస్తూ వినాలి

ఇతరులు తమ జీవితాలను, నమ్మకాలను మరియు నీవు నొక్కిచెప్పుతున్న విషయాల గురించి లోతుగా ఆలోచించేటట్టుగా వారిని మంచి ప్రశ్నలడగాలి. అప్పుడు వారిచ్చే జవాబులను వినాలి. ఇలా చేసినపుడు వారిని, వారి చింతలను, బాధలను అర్థంచేసుకోడానికి అది నీకు సహాయపడుతుంది.

3. బైబిల్ ఉపయోగించాలి

ఇతరులకు సువార్త చెప్పేటప్పుడు నీవు నీ సొంత అభిప్రాయాలు లేదా ఆలోచనలు వారికి చెప్పడం లేదు గాని దేవుని గురించి, మన పాపం గురించి మరియు ఆయన కుమారుడైన యేసును గురించి బైబిలులో చెప్పిన సంగతులనే చెప్పుతున్నావని వినేవారికి నమ్మకం కలిగించగలవు.

4. స్పష్టంగా చెప్పాలి

మనం ‘‘దేవుడు’’ లేదా ‘‘పాపం’’ మొ॥ పదాలు చెప్పినప్పుడు, ఈ మాటల గురించి ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం లేదా అవగాహన ఉండవచ్చు. కాబట్టి ‘‘పాపం,’’ ‘‘విశ్వాసం’’ మొ॥ మాటలు స్పష్టంగా విడమర్చి చెప్పాలి. నీవు చెప్తున్న విషయాన్ని ఎదుటి వ్యక్తి అర్థంచేసుకున్నాడో లేదో అడిగి తెలిసికోవాలి.

5. సంఘం గురించి చెప్పాలి

నీవు సువార్త చెప్పిన వ్యక్తిని ఆదివారపు ఆరాధనకు రమ్మని ఆహ్వానించుట మంచిది. అప్పుడతడు విన్న సువార్త యింకా ఎక్కువ స్పష్టమవుతుంది. అతడు యింకా ఎక్కువ విషయాలు తెలుసుకుంటాడు. ‘‘మీరు ఒకని యెడల ఒకడు ప్రేమగలవారైన యెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురని’’ యేసు ప్రభువు చెప్పాడు (యోహాను 13:35). సంఘం ద్వారా పరలోకములో ఉన్నవారికి సయితం దేవుని జ్ఞానము తెలుపబడుతున్నదని పౌలు చెప్తున్నాడు (ఎఫెసీ 3:8-11). సంఘమనేది నీవు చెప్తున్న సందేశానికి సజీవ సాక్ష్యంగా నిలిచేది గనుక వారు స్వయంగా దానిని చూడాలంటే మీ సంఘానికి ఆహ్వానించండి.

మార్క్‌ డెవర్‌

మార్క్‌ డెవర్‌

మార్క్‌ డెవర్‌ వాషింగ్టన్ D. C.లోని కాపిటల్ హిల్ బాప్టిస్ట్ చర్చి యొక్క సీనియర్ పాస్టర్ మరియు 9మార్క్స్ అధ్యక్షుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...