మనకందరికి సహాయం అవసరం

షేర్ చెయ్యండి:

మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. (హెబ్రీ 4:16)

మనలో ప్రతి ఒక్కరికి సహాయం అవసరం. మనము దేవుళ్ళము కాము. మనకు బలహీనతలున్నాయి. మనకు గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. మనకు అన్ని విషయాలలో పరిధిలు ఉన్నాయి. మనకు సహాయం కావాలి. 

అయితే, మనలో ప్రతి ఒక్కరం ఎదో ఒకటి కలిగి ఉన్నాం: మనం పాపాలను కలిగి ఉన్నాం. కాబట్టి మనకు అవసరమైన సహాయాన్ని పొందుకోవడానికి మనం అర్హులం కాదని మన హృదయంతరంగంలో మనకు బాగా తెలుసు. అందుచేత, మనం చిక్కుకుపోయినట్లు భావిస్తాం. 

నా జీవితాన్ని జీవించడానికి, మరణాన్ని ఎదుర్కోవడానికి, నిత్యత్వ విషయంలో సహకరించడానికి నాకు సహాయం అవసరం, అంటే నా కుటుంబానికి, నా జీవిత భాగస్వామికి, నా పిల్లలకు, నా ఒంటరితనానికి, నా ఉద్యోగానికి, నా ఆరోగ్యానికి, నా ఆర్థిక పరిస్థితులకు సహాయం అవసరం. నాకు సహాయం కావాలి గాని నాకు అవసరమైన సహాయానికి నేను అర్హుడిని కాను.

కాబట్టి నేనేమి చేయగలను? వాటన్నిటినీ తిరస్కరించి, ఎలాంటి సహాయం అవసరంలేని సూపర్ మ్యాన్ గా లేదా సూపర్ వుమన్ గా ఉండటానికి నేను ప్రయత్నిస్తాను. లేదా వాటన్నిటినీ ముంచివేసి, నా జీవితాన్ని ఇంద్రియ సుఖాల కొలనులో పడేయడానికి ప్రయత్నిస్తాను. లేదా నిరాశ అనే పక్షవాతానికి దారితీసే విధంగా ఉంటాను. 

అయితే, నిరాశ నిస్పృహలను చెదరగొట్టి నిరీక్షణ కల్పించడానికి, సూపర్ మ్యాన్ లేదా సూపర్ వుమన్ అని చెప్పుకుంటున్నవారిని తగ్గించుకొనునట్లు చేయడానికి మరియు మునిగిపోతున్న దుర్మార్గులను రక్షించడానికి యేసు ప్రధాన యాజకుడిగా మారాడు. 

అవును, మనకందరికి సహాయం అవసరం. నిజమే, మనకు అవసరమైన సహాయాన్ని పొందడానికి మనమెవరం అర్హులం కాదు. అయితే, నిరాశ నిస్పృహలు, అహంకారం మనకు వద్దు. దేవుడు ఏమంటున్నాడో చూడండి. మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు కాబట్టి దేవుని సింహాసనం కృపాసనమయ్యింది. కృపాసనం వద్ద మనం పొందుకునే సహాయం ఏంటంటే అవసరమైన సమయంలో సహాయం పొందడానికి కావలసిన కరుణ, కనికరములే. సహాయం పొందడానికి కృప అవసరం! అర్హతగల సహాయం కాదు గాని కృపగల సహాయం. అందుచేతనే, ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తు తన రక్తాన్ని చిందించాడు. 

మీరిక చిక్కుకొనరు. ఇక ఆ అబద్ధానికి స్వస్తి చెప్పండి. మనకు సహాయం అవసరం. ఆ సహాయాన్ని పొందడానికి మనం అర్హులం కాము. అయితే ఆ సహాయాన్ని మనం పొందుకోవచ్చు. దేవుని కుమారుడైన యేసు మీ ప్రధాన యాజకునిగా నమ్మి, ఆయనను మీరు పొందుకున్నట్లయితే, ఆయన ద్వారా దేవుని వద్దకు సమీపించినప్పుడు వెంటనే మీరు శాశ్వతంగా ఆ సహాయాన్ని పొందుకుంటారు.  

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...