“నేను మీ ఉపదేశాలను వెదికాను కాబట్టి నేను స్వతంత్రంగా నడవగలుగుతున్నాను”. (కీర్తన 119:45 స్వేచ్చానువాదం)
ఆనందానికి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే స్వతంత్రం (స్వేచ్చ). మనం ద్వేషించే దాని నుండి విముక్తి పొందకపోతే మరియు మనం ప్రేమించిన దాని కోసం స్వేచ్ఛగా ఉండకపోతే మనలో ఏ ఒక్కరు సంతోషంగా ఉండరు.
నిజమైన స్వేచ్ఛ మనకు ఎక్కడ దొరుకుతుంది? “నేను మీ ఉపదేశాలను వెదికాను కాబట్టి నేను స్వతంత్రంగా నడవగలుగుతున్నాను” అని కీర్తన 119:45 చెప్తోంది.
ఈ సాదృశ్య చిత్రం బహిరంగ ప్రదేశాలలో ఒకటి. ఈ మాట మనల్ని సంకుచితమైన మనస్సు నుండి విడుదల కలుగజేస్తుంది. “దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచనగల మనస్సును సొలొమోనునకు దయచేసెను” (1 రాజులు 4:29). ఈ మాట బెదిరింపుతో కూడిన నిర్బంధాల నుండి మనల్ని విడుదల చేస్తుంది “విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను…” (కీర్తన 18:19).
“సత్యమును గ్రహించెదరు; సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును” (యోహాను 8:31,32) అని యేసు చెప్పాడు. ఆయన మనస్సులో ఉండే ఈ స్వతంత్రత (స్వేచ్చ) అనేది పాప బానిసత్వము నుండి కలిగే స్వతంత్రతయైయున్నది (యోహాను 8:34). లేదా, దీన్ని మనం సానుకూలంగా చెప్పుకోవాలంటే, ఇది పరిశుద్ధత కొరకైన స్వతంత్రత (స్వేచ్చ) అని చెప్పుకోవచ్చు.
దేవుని కృపా వాగ్దానాలు భయాన్ని మరియు నిర్భంధాన్ని కలుగజేయుటకంటే దేవుని పరిశుద్ధతకు సంబంధించిన డిమాండ్లను నెరవేర్చగల శక్తిని కలుగజేస్తుంది. దేవుని వాగ్దానాల స్వతంత్రపు శక్తి గురించి పేతురు ఈ విధంగా అభివర్ణించాడు, “[ఆయన అమూల్యమైన మరియు గొప్ప వాగ్దానముల మూలముగా] దురాశను అనుసరించుటవలన లోకమందున్న భ్రష్టత్వమును మీరు తప్పించుకొని, దేవస్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను” (2 పేతురు 1:4).
మరొక విధంగా చెప్పాలంటే, మనం దేవుని వాగ్దానాలను నమ్మినప్పుడు, అత్యున్నత వాగ్దానపు శక్తి ద్వారా పాపభూయిష్టమైన కోరికను మరియు భ్రష్టత్వపు మూలాన్ని పెకిలించివేద్దాం!
నకిలీ ఆనందాల శక్తిని సమూలంగా తీసివేసే వాక్యం ఎంత ప్రాముఖ్యమో! దేవుని వాక్యముతో మన మార్గాలను వెలిగించడానికి, మన హృదయాలను నింపుకోవడానికీ మనమెంత జాగ్రత్త కలిగి ఉండాలో కదా!
“నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునైయున్నది” (కీర్తన 119:105).
“నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను” (కీర్తన 119:11).