మన మంచి కూడా ఆయన మహిమ కోసమే
“నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును.” (మత్తయి 6:6)
క్రైస్తవ సుఖ భోగానికి (Christian Hedonism) ఒక సాధారణ అభ్యంతరం ఏంటంటే ఇది దేవుని మహిమకంటే మానవ అభీష్టాలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం, అంటే ఇది దేవుని గౌరవించుటకంటే నా సంతోషం అనే దానికి ప్రాధాన్యతనివ్వడం. అయితే క్రైస్తవ సుఖ భోగం (Christian Hedonism) ఇలాంటివి చేయదు.
ఖచ్చితంగా చెప్పాలంటే, క్రైస్తవ సుఖ భోగస్తులుగా మనం మన ఆసక్తిని, మన సంతోషాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. యువకుడైన జోనాథన్ ఎడ్వర్డ్స్ చేసిన తీర్మానాన్ని మేము సమర్ధిస్తున్నాము, అదేంటంటే, నాకు సాధ్యమైనంతగా నా పూర్ణ శక్తితో బలంతో తీవ్రతతో ఏ విధంగానైనా పరలోకంలో వీలైనంత అధిక సంతోషాన్ని పొందాలని తీర్మానించుకున్నాను.
అయితే, దేవునికున్న ఆసక్తి ఏంటంటే ఆయన అవసరం ఎంతో ఎక్కువగా ఉన్నటువంటి పాపులమైన మనపట్ల ఆయన కరుణామృతం ప్రవహించడం ద్వారా ఆయన మహిమ యొక్క పరిపూర్ణతను ఘనపరచడమేనని బైబిలు నుండి (మరియు ఎడ్వర్డ్స్ గారి నుండి!) నేర్చుకున్నాం.
అందుచేత, మన ప్రాణాలు పోయినప్పటికీ మన ఆసక్తిని, మన సంతోషాన్ని నెరవేర్చుకోవడమనేది దేవుని ఆసక్తికి, దేవుని సంతోషానికి, దేవుని మహిమకు మించిపోకుండా, అది ఎల్లప్పుడూ దేవునిలోనే ఉండాలి. బైబిలు గ్రంథంలో ఉన్నటువంటి అత్యంత శ్రేష్టమైన సత్యాలలో ఒకానొక శ్రేష్టమైన సత్యం ఏంటంటే, ఆయనయందు మాత్రమే పాపులను సంతోష పెట్టడం ద్వారా దేవుడు తన కృపా సంపదను మహిమపరచడమే దేవునికున్న గొప్ప ఆసక్తి.
మనం చిన్నపిల్లల్లా మనల్ని మనం తగ్గించుకొని, స్వబుద్ధిని ప్రదర్శించకుండ, మన తండ్రి కౌగిలి ఆనందంలోనికి సంతోషంగా పరిగెత్తినప్పుడు, ఆయన కృపా మహిమ ఘనపరచబడుతుంది మరియు మన ఆత్మ దాహం తీరుతుంది. మన అభిరుచి మరియు ఆయన మహిమ ఒకటవుతాయి.
మత్తయి 6:6లో “రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును” అని యేసు వాగ్దానం చేసినప్పుడు, ఈ ప్రతిఫలం కోసం మనం ఎదురు చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం కలిగియుండకూడని ఆనందంతో ఆయన మనల్ని ఆకర్షించడు! కానీ ఈ ప్రతిఫలంతో, ఈ ఆనందంతో మానవ ప్రశంసలకు అతీతంగా పొంగిపొర్లేలా చేస్తుంది మరియు దేవుణ్ణి వెదకడానికి మన గదిలోకి వెళ్ళునట్లుగా చేస్తుంది.
అందుచేత, క్రైస్తవ సుఖ భోగులు తమ సంతోషం విషయంలో దేవుని మహిమకు మించి ఎక్కువ ప్రాధాన్యతనివ్వరు. వారు తమ ఆనందాన్ని దేవునిలోనే ఉంచి, మనము ఆయనలో ఎంత ఎక్కువగా తృప్తి చెందితే అంత ఎక్కువగా దేవుడు మనలో మహిమపరచబడతాడనే మహిమాన్వితమైన సత్యాన్ని కనుగొంటారు.

జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Powered By ABNY Web