విభజించగలిగిన దేవుని వాక్యపు శక్తి
“ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది”. (హెబ్రీ 4:12)
దేవుని వాక్యమే మనకున్న ఏకైక నిరీక్షణ. దేవుని వాగ్దానాలను గురించిన శుభవార్త, ఆయన తీర్పుకు సంబంధించిన హెచ్చరికలు అనేవి నా హృదయపు అడుగు భాగాన్ని విభజించుకుపోవడానికి మరియు పాపపు అబద్ధాలన్నీ నిజమైన అబద్ధాలేనని నాకు చూపించేంత పదునైనవి, సజీవంగా ఉండేవి, విభజించునంతగా చురుకుగా ఉండేవి.
గర్భస్రావం నాకు అద్భుతమైన భవిష్యత్తును సృష్టించదు. మోసం చేయడమో, రెచ్చగొట్టే దుస్తులు ధరించడమో, నా లైంగిక పవిత్రతను జారవిడుచుకోవడమో, పనిలో నిజాయితీ లేకపోవడమో, విడాకులు తీసుకోవడమో, ప్రతీకారం తీర్చుకోవడమో అనేవి అద్భుతమైన ప్రజ్వల భవిషత్తును సృష్టించి ఇవ్వవు. ఈ మోసము నుండి నన్ను రక్షించేది దేవుని వాక్యమే.
దేవుని వాగ్దానం యొక్క వాక్యం మన హృదయాలలో సంతృప్తికరమైన ఆనందాల ముసుగులో ఉన్న పాపపు పురుగులపై ప్రకాశవంతమైన ఉదయపు సూర్యకాంతిని వెదజల్లే గొప్ప కిటికీని తెరవడం వంటిది. మీ హృదయాన్ని దేవుని నుండి దూరం చేయడానికి మరియు మీ హృదయాన్ని కఠినపరచడానికి మరియు మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నించే లోతైన మోసాలనుండి మిమ్మల్ని సంరక్షించడానికి దేవుడు మీకు ఆయన సువార్తను, ఆయన వాగ్దానాలను, ఆయన వాక్యాన్ని ఇచ్చాడు.
నమ్మడానికి పోరాటం చేయడంలో మీరు మంచి ఉత్సాహంతో ఉండండి. ఎందుకంటే దేవుని వాక్య౦ సజీవమైనది, క్రియాశీలమైనది, రెండు అంచుల ఖడ్గ౦ క౦టే పదునైనది, అది పాపానికి సంబంధించిన ఎటువంటి మోసం కన్నా లోతుగా విభజించుకుపోయి, నిజ౦గా ఏది విలువైనది, ఏది నమ్మదగినది, ఏది ప్రేమి౦చదగినది అని వెల్లడి చేస్తుంది.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web