శ్రమల యొక్క అర్థం
“మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని, … అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టియుంచెను”. (హెబ్రీ 11:26)
మనం శ్రమలు అనుభవించాలని చెప్పినందువలన మనం శ్రమలను అనుభవించడాన్ని ఎన్నుకోం గాని ఈ శ్రమలు నిత్య ఆనందానికి మార్గంగా ఉన్నాయని మనకు విశదీకరించి చెప్పినందున మనం శ్రమలను అనుభవించడాన్ని ఎన్నుకున్నాం.
కర్తవ్యం పట్ల మన భక్తి యొక్క బలాన్ని ప్రదర్శించడానికో, లేదా మన నైతిక సంకల్పం యొక్క శక్తిని ప్రదర్శించడానికో, లేదా శ్రమలో మన సహనం యొక్క ఔన్నత్యాన్ని నిరూపించడానికో కాకుండా, పిల్లలవంటి విశ్వాసాన్ని కలిగి ఉండటంలో ఆయన సంతృప్తికరమైన వాగ్దానాల అనంతమైన అమూల్యతను, అంటే వాటన్నిటి నెరవేర్పుగా ఆయన మహిమ యొక్క సంపూర్ణ గొప్పతనాన్ని మరియు సౌందర్యాన్ని వ్యక్తం చేయడానికి ఆయన మనల్ని శ్రమల యొక్క విధేయతలోకి ఆహ్వానిస్తాడు.
“అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని [మోషే] యోచించి, …….. అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి యుంచెను” (హెబ్రీ 11:25-26). అందుచేత, ఆయన విధేయత బహుమానాన్ని మహిమపరిచింది, అంటే క్రీస్తునందు దేవుడు తన కోసం ఉన్నాడు గాని శ్రమలు అనుభవించేందుకుగల తీర్మానం కోసం కాదు.
ఇదే క్రైస్తవ సుఖ సంతోషం (Christian Hedonism) యొక్క సారాంశం. శ్రమల గుండా ఆనందాన్ని కలిగియుండడంలో మన ఆనందానికి మూలమైన సర్వ సంతృప్తికరమైన విలువను మనం హెచ్చిస్తాం. మన శ్రమల కొలిమి అంతిమ భాగంలో ప్రకాశమానంగా దేవుడే తేజోమయుడై ప్రకాశిస్తాడు.
శ్రమలలో మన ఆనందానికున్న ఆయన లక్ష్యాన్ని మరియు నేపద్యాన్ని మనం గ్రహించకపోతే, మన శ్రమలకున్న పరమార్థాన్ని కోల్పోతాం.
శ్రమలకు అర్థం ఏంటంటే దేవుడే లాభకరం, దేవుడే లాభదాయకం, దేవుడు తానే ఆ లాభకరంగా ఉన్నాడు. ఇదే మన శ్రమలకు అర్థం, పరమార్థం.
దేవుణ్ణి మహిమపరచడమే మనిషికున్న ప్రధాన లక్ష్యం. దేవునిలో మనం అత్యంత తృప్తిని కలిగియున్నప్పుడు ఆయన మనలో అత్యంత మహిమను పొందుతాడనేది శ్రమలలో తప్ప మరెక్కడా ఉండదనేది సత్యం.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web