క్షమాపణ యొక్క శక్తి

క్షమాపణ యొక్క శక్తి

షేర్ చెయ్యండి:

“నీ పాపములు క్షమింపబడియున్నవి.” (లూకా 7:48)

ఒక స్త్రీ పరిసయ్యుని ఇంట్లో ఏడుస్తూ, యేసు పాదాలు కడుగుతూ ఆయన దగ్గరకు వచ్చింది. ఈ స్త్రీ పాపాత్మురాలని, యేసును ఆమె తాకడానికి ఆయన ఒప్పుకోడని సీమోను తన కళ్ళతో అక్కడున్న వారందరికీ తెలియజేసినప్పుడు, ఆమె అవమానంగా భావించింది అనడంలో సందేహం లేదు.

నిజానికి ఆమె పాపాత్మురాలు. నిజముగా సిగ్గుపడాల్సిన విషయాలున్నాయి. కానీ ఎక్కువ కాలం కాదు.

“నీ పాపాలు క్షమించబడ్డాయి”(లూకా 7:48) అని యేసు చెప్పాడు. అక్కడున్న అతిథులు దీని గురించి సణుగుతున్నపుడు, ఆయన, “నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్లుమని” (లూకా 7:50) చెప్పి ఆమె విశ్వాసాన్ని బలపరిచాడు.

అవమానం నుండి వచ్చే చెడు ప్రభావాలతో పోరాడటానికి యేసు ఆమెకు ఎలా సహాయం చేశాడు? ఆయన ఆమెకు ఒక వాగ్దానం ఇచ్చాడు: “నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్లుమని ఆ స్త్రీతో చెప్పెను.” గతములో దేవుని క్షమాపణ భవిష్యత్తులో శాంతినిస్తుందని ఆయన చెప్తున్నారు.

కాబట్టి, ఆమె దేవుని భవిష్యత్ దయపై, క్షమించే యేసుక్రీస్తు అధికారంపై మరియు విడుదలనిచ్చే వాక్యం పై విశ్వాసం ఉంచాలి. మనలో ప్రతి ఒక్కరూ అనవసరమైన విషయాలలో సిగ్గుపడడం గూర్చి కాదు గాని నిజంగా సిగ్గు పడాల్సిన, చాలా కాలం మనల్ని కుంగదీసే, బలహీన పరిచే అవమానంతో పోరాడవలసిన మార్గం ఇది.

మన అవమానకరమైన కార్యాలను క్షమించడం వలన వచ్చే భవిష్యత్ కృపా మరియు సమాధాన వాగ్దానాలను గట్టిగా పట్టుకొని మనలను బలహీన పరిచే అవమానం వలన వచ్చే అవిశ్వాసంతో పోరాడాలి.

  • “అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీయొద్ద క్షమాపణ దొరుకును..” (కీర్తన 130:4)
  • “యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడు కొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెను వారు యెహోవావైపు తిరిగినయెడల ఆయన వారి యందు జాలిపడును వారు మన దేవునివైపు తిరిగినయెడల ఆయన బహుగా క్షమించును. (యెషయా 55:6-7)
  • “మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.” (1 యోహాను 1:9)
  • “ఆయనయందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్త లందరు ఆయననుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నారనెను.” (అ.కా 10:43)

మనందరికీ క్షమాపణ అవసరం. రేపు కూడా మనకు ఇది అవసరం. ఈ రోజు మరియు రేపు క్షమాపణను అందించడానికి యేసు మరణించాడు. నేడు లేదా రేపు కూడా ఇదే వాస్తవం: దేవుని క్షమాపణ మన మంచి భవిష్యత్తు కోసం మనల్ని విముక్తి చేస్తుంది. ఇది కుంటికాలుగా  చేసే అవమానం నుండి మనల్ని విడిపిస్తుంది. క్షమాపణ భవిష్యత్తు దయతో నిండి ఉంది.

భవిష్యత్తు కృపపై విశ్వాసంతో మనం జీవించినప్పుడు, దేవుని క్షమాపణలో నాటబడిన వారుగా ఉంటాము. మనం అనుభవించాల్సిన అవమానం నుండి వచ్చే దీర్ఘకాల, పక్షవాతం కలిగించే ప్రభావాల నుండి మనం విముక్తి పొందుతాము. క్షమాపణ అంటే ఇదే.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...