అనుభవపూర్వకమైన కీలకాంశము.
“మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీయెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు.” (2 కొరింథీ 9:8)
తన భవిష్యత్తు కృపలో దేవుడు మనకు ఇవ్వబోయే బహుమానం మీద విశ్వాసం ఉంచడం ద్వారా, ప్రస్తుతం మనం దాతృత్వ హృదయన్ని కలిగియుండగలం అనే సంగతి మనకు తెలుసు, ఎందుకంటే 2 కొరింథీ 9:8లో, “మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీయెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడని చూస్తున్నాం. ఈ అద్భుతమైన వాగ్దానం గురించి పౌలు గట్టిగా చెబుతున్నాడు .
మరొక విధంగా చెప్పాలంటే, మీరు మీ డబ్భును దాచుకునే అలవాటు నుండి విడిపించబడాలనుకుంటే, ప్రతి మంచి పనికి ఫలితంగా సమృద్ధితో నింపబడాలనుకుంటే, భవిష్యత్తులో దేవుడు మనకి ఇవ్వబోయే కృపమీద మీ విశ్వాసాన్ని ఉంచండి.”దేవుడు మీ పట్ల, సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు” అనే వాగ్దానాన్ని భవిష్యత్తులోని ప్రతి క్షణంలో నమ్మండి.
దేవుడు మనకు ఇవ్వబోయే బహుమానం మీద విశ్వాసం ఉంచడం ప్రస్తుతం మన దాతృత్వ హృదయానికి “అనుభవపూర్వకమైన కీలకాంశం” అని నేను పిలవడం జరిగింది, చారిత్రాత్మకమైన అంశం కూడా ఉందనే విషయాన్ని కాదనలేం. అనుభవపూర్వకమైన మరియు చారిత్రాత్మక అంశాలు రెండూ ఉన్నాయి. కొరింథీయులు పొందుకున్న కృపను గురించి పౌలు మాట్లాడినప్పుడు,“మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా? ఆయన ధనవంతుడై యుండియు మీరు తన దారిద్ర్యమువలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను” (2 కొరింథీ 8:9) అని చారిత్రాత్మకమైన ముఖ్య సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు.
కృపను గురించి ఈ చారిత్రాత్మకమైన కార్యం లేకుండా, క్రీస్తు ఔన్నత్యాన్ని చాటి చెప్పే ఆయన ధారాళత్వపు తలుపు ఎల్లప్పుడూ మూసివేయబడి ఉంటుంది. గతంలో క్రీస్తు చేసిన కృపాకార్యం ప్రేమించడానికి తప్పనిసరియైన అంశంగా ఉన్నది .
అయితే, ఈ వచనంలో గతంలోనీ ఆ కృప ఎలా పని చేస్తుందనే విషయాన్ని గమనించండి. ఇది భవిష్యత్తులోని కృపకు అంటే మనం ధనవంతులు కావాలని పునాదిగా ఇవ్వబడింది అంటే దానికొరకే క్రీస్తు మన కోసం దరిద్రుడయ్యాడు అనే విషయం. కాబట్టి, భవిష్యత్తులో దేవుడు తన కృపలో ఇవ్వబోతున్న బహుమానం ప్రస్తుతం మనం దాతృత్వాన్ని పాటించడానికి పునాదిగా ఉన్నది.
కాబట్టి, ప్రేమించడానికి మరియు ధారాళత్వానికి అనుభవపూర్వకమైన కీలకాంశం ఇదే: “భవిష్యత్తులో దేవుడు సమస్త కృపను మీకు సమృద్ధిగా దయచేస్తాడు అని నమ్ముతూ మీ విశ్వాస్వాన్ని భవిష్యత్ కృపలో భద్రంగా ఉంచండి.” దీనివలన మీ అవసరలు నెరవేరుతాయి దాతృత్వపు ప్రేమతో మీరు పొంగి పొర్లుతారు.
దేవుని భవిష్యత్తు కృపలో ప్రగాఢమైన లోతైన విశ్వాసాన్ని కలిగి ఉంటేనే దురాశ లేదా ధనాపేక్ష నుండి విడుదల లభిస్తుంది.

జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Powered By ABNY Web