విశ్వాసాన్ని నలగగోట్టే శ్రమ

షేర్ చెయ్యండి:

“అయితే వారిలో వేరు లేనందున, కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే వారు అభ్యంతరపడుదురు.” (మార్కు 4:17)

కొందరి విశ్వాసం శ్రమ ద్వారా కట్టబడటానికి బదులుగా విచ్ఛిన్నమవుతుంది. ఈ విషయం యేసుకు తెలుసు, దీని గురించి నాలుగు నేలల ఉపమానంలో ఆయన చక్కగా వివరించి చెప్పాడు. దేవుని వాక్యాన్ని వినిన కొంతమంది మొదట్లో చాలా సంతోషంతో స్వీకరిస్తారు, కానీ ఆ తర్వాత వారికి కలిగే శ్రమను బట్టి వారు పడిపోతారు.

అందుచేత, శ్రమ ఎల్లప్పుడూ విశ్వాసాన్ని బలపరచదు. కొన్నిసార్లు అది విశ్వాసాన్ని అణచివేస్తుంది. ఆ తర్వాత, “మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలువబడును, మరి ఎక్కువగా మీకియ్యబడును” (మార్కు 4:25) అని యేసు చెప్పిన ప్రతికూలమైన మాటలు నిజమవుతాయి.

భవిష్యత్తు కృపపై దృఢమైన విశ్వాసముతో శ్రమలను ఓర్చుకోవాలని, తద్వారా మన విశ్వాస౦ బలము పొందుకొని, వృథాగా పోలేదని నిరూపించుకోవడానికి ఇది మనకు పిలుపునిస్తోంది (1 కొరి౦థీ 15:2). “కలిగినవానికి ఇయ్యబడును” (మార్కు 4:25). శ్రమలో దేవుడు కలిగియున్న ఉద్దేశాన్ని తెలుసుకోవడమనేది శ్రమల ద్వారా ఎదిగేందుకు ఉన్నటువంటి ఒకానొక ముఖ్య సాధనం.

మీ శ్రమ అర్థరహితమని, లేదా దేవుడు నియంత్రణలో ఏవీ లేవని, లేదా ఆయన వింతగానూ క్రూరంగానూ ఉన్నాడని మీరనుకుంటే, ఆప్పుడు మీరు అనుభవిస్తున్న శ్రమ మిమ్మల్ని అన్నింటి నుండి దూరము చేయడానికి బదులుగా దేవుని నుండి దూరం చేస్తుంది. అందుచేత, దేవుని కృపపై విశ్వాసము కలిగియుండడంలో శ్రమ ద్వారా ఆయన కృపను ఇస్తాడనే విశ్వాసం కూడా ఉంది.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...