విశ్వాసాన్ని బలపరిచే శ్రమ

విశ్వాసాన్ని బలపరిచే శ్రమ

షేర్ చెయ్యండి:

“నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి”. (యాకోబు 1:2-3)

వింతగా అనిపించినా, శ్రమ ద్వారా కదలించబడుటకుగల ప్రాధమిక ఉద్దేశాలలో ఒక ఉద్దేశం ఏంటంటే మన విశ్వాసాన్ని మరింత ఎక్కువగా కదలని విశ్వాసంగా చేసుకోవడమే.

విశ్వాసం అనేది కండరాల కణజాలం వంటిది: మీరు దానిని పరిమితి వరకు నొక్కితే, అది బలంగా మారుతుంది గాని బలహీనంగా మారదు. ఇక్కడ యాకోబు గారు అదే చెప్తున్నారు. మీ విశ్వాసం విచ్చిన్నమయ్యే స్థితికి బెదిరించబడినప్పుడు, పరీక్షించబడినప్పుడు, విస్తరింపజేసినప్పుడు, ఫలితం ఎక్కువగా తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. దాన్నే ఆయన ఓర్పు అని అంటున్నాడు.

దేవుడు విశ్వాసాన్ని ఎంతగా ప్రేమిస్తాడంటే, విశ్వాసం పవిత్రంగాను మరియు బలంగా ఉంచడానికి అతను దానిని విచ్ఛిన్నం చేసే స్థాయికి పరీక్షిస్తాడు. ఉదాహరణకు, 2 కొరి౦థీయులు 1:8–9 ప్రకార౦ ఆయన పౌలుకు ఇలా చేశాడు.

సహోదరులారా, ఆసియలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు; అదేదనగా మేము బ్రదుకుదుమను నమ్మకము లేకయుండునట్లుగా, మా శక్తికి మించిన అత్యధిక భారమువలన క్రుంగిపోతిమి. మరియు మృతులను లేపు దేవునియందేగాని, మాయందే మేము నమ్మిక యుంచకుండునట్లు మరణమగుదుమను నిశ్చయము మామట్టుకు మాకు కలిగియుండెను.

“అదేదనగా” అనే పదం ఈ విపరీతమైన శ్రమలో ఒక ఉద్దేశం ఉ౦దని చూపిస్తో౦ది: పౌలు తనపైన గాని, తనకున్న వనరులపైన గాని ఆధారపడకుండా, దేవుని మీదనే ఆధారపడ్డాడు, ముఖ్యంగా చనిపోయినవారిని పైకి లేపడమును గురించి వాగ్దానం చేయబడిన దేవుని కృపలోనే ఆధారపడ్డాడు.

హృదయపూర్వకంగా కలిగియుండే మన విశ్వాసానికి దేవుడు ఎ౦త విలువనిస్తాడ౦టే, అవసరమైతే, మన౦ ఆధారపడటానికి మనం శోధించబడునట్లు ఈ లోకంలో ఉన్న ప్రతి దానిని, జీవితాన్ని కూడా కృపా పూర్వకంగానే తీసివేస్తాడు. ఆయన మాత్రమే మనకు అవసరమన్న నిశ్చయతలోనే మనం మరింత లోతుగా, బలంగా ఎదగాలన్నదే ఆయన లక్ష్యం.

“ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నా కక్కరలేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునైయున్నాడు” (కీర్తన 73:25-26) అని కీర్తనాకారుడు చెప్పినట్లుగా మన౦ ఏకీభవించి చెప్పాలని ఆయన కోరుకు౦టున్నాడు.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...