మన బలహీనత ఆయన విలువను వెల్లడిస్తుంది
“అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను”. (2 కొరింథీయులు 12:9)
క్రీస్తు విలువను మరియు ఆయన బలమును గొప్పగా చూపించడం కోసం దేవుడు శ్రమలను మన కొరకు రూపకల్పన చేశాడు. ఇది దేవుని కృప ఎందుకంటే క్రైస్తవ జీవితాలలో క్రీస్తు గొప్ప చేయబడడాన్ని అనుభవించడమే మన గొప్ప ఆనందం.
తన “శరీరంలోని ముల్లు” తీసివేయబడదని ప్రభువైన యేసు చెప్పినప్పుడు, ఆయన ఎందుకు తీసివేయడో చెప్పడం ద్వారా పౌలు విశ్వాసానికి మద్దతు ఇచ్చాడు. “నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని” ప్రభువు చెప్పాడు (2 కొరింథీయులు 12:9). పౌలు పక్షాన క్రీస్తు బలవంతునిగా కనబడడం కోసం పౌలు బలహీనుడుగా ఉండాలని దేవుడు నియమించాడు.
మనకు మనమే స్వయం సమృద్ధి గలవారమని అనుకుంటే, క్రీస్తుకు మహిమ రాకుండ మనకు మహిమ వస్తుంది. కాబట్టి, “ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు” లోకంలో బలహీనులైనవారిని క్రీస్తు ఏర్పరచుకొని యున్నాడు. (1 కొరింథీయులు 1:27). మరియు దేవుని శక్తి మరింత స్పష్టంగా కనిపించడానికి కొన్నిసార్లు ఆయన బలమైన వ్యక్తులనుకున్న వారిని బలహీనపరుస్తాడు.
పౌలు ఈ కృపను అనుభవించాడని మనకు తెలుసు, ఎందుకంటే అతను దానిలో సంతోషించాడు: “కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను.” (2 కొరింథీయులు 12:9-10).
దేవుని కృపపై విశ్వాసంతో జీవించడం అంటే యేసులో దేవుడు మనకు ఏమైవున్నాడో దానియందు సంతృప్తి చెందడం. కాబట్టి, యేసులో దేవుడు మనకు ఏమైవున్నాడో దానిని వెల్లడి చేసి మరియు దానిని ఘనపరిచే విషయంలో విశ్వాసం వెనుకకు తగ్గదు. మన బలహీనత మరియు మన శ్రమ ఉన్నది అందుకే.

జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Powered By ABNY Web